నాగ చైతన్య -శోభిత నిశ్చితార్ధంలో సేమ్ సీన్ రిపీట్
నాగ చైతన్య -శోభిత నిశ్చితార్ధం చాలా సింపుల్‌గా జరిగింది. గురువారం ఎటువంటి హడావిడి లేకుండా వీరి నిశ్చితార్థం జరిగింది. ఈ కార్యక్రమంలో కేవలం పరిమిత సంఖ్యలో జరిగింది. నాగ చైతన్య ,శోభితల నిశ్చితార్థం విషయాన్ని కింగ్ నాగార్జున్ అధికరికంగా ప్రకటించారు.నాగ చైతన్య,శోభిత నిశ్చితార్ధం ఫొటోలను నాగార్జున తన సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఇదే సమయంలో నాగ చైతన్య సైతం , శోభితతో నిశ్చితార్థం చేసుకున్న ఫొటోలను తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో పెట్టడం జరిగింది. ఈ జంటకు పలువురు సినీ సెలబ్రిటీలు అభినందనలు తెలిపారు. నాగ చైతన్య గతంలో సమంతను ప్రేమ వివాహం చేసుకున్నాడు. పెళ్లి తర్వాత అభిప్రాయభేదాలు రావడంతో ఈ జంట విడాకులు తీసుకుని ఎవరి జీవితాన్ని వారు కొనసాగిస్తున్నారు.
మరోవైపు నాగ చైతన్య తండ్రి నాగార్జున వైవాహిక జీవితం కూడా అంత సాఫీగా సాగలేదు. మూవీ మొఘల్ డాక్టర్ డి రామానాయుడు కూతురు లక్ష్మితో నాగార్జున వివాహం జరిగింది. 1984 వీరి పెళ్లి జరగ్గా..1986లో వీరికి నాగ చైతన్య జన్మించాడు.అయితే లక్ష్మితో పెళ్లి నాగార్జునకు మొదటి నుంచి ఇష్టం లేకపోవడంతో వీరిద్దరు కొన్నాళ్లు వీడిపోయారు. ఆ తర్వాత శివ, నిర్ణయం,చినబాబు, ప్రేమ యుద్ధం, కిరాయి దాదా సినిమాల్లో నటించిన అమలతో మరోసారి ప్రేమలో పడటంతో నాగార్జున ఆమెను రెండో వివాహం చేసుకున్నారు. నాగార్జునతో విడాకులు తర్వాత లక్ష్మి అమెరికా వెళ్లిపోయారు.

లక్ష్మి విడాకులు ఇవ్వగానే అమలాని నాగార్జున వివాహం చేసుకున్నారు. ఇప్పుడు నాగ చైతన్య సైతం తన మొదటి భార్య సమంతకు విడాకులు ఇచ్చాడు. నాగ చైతన్య, సమంతలు 2017లో వివాహం చేసుకున్నారు. కొన్నాళ్లుకు ఇద్దరి మధ్య విభేదాలు రావడంతో ఈ జంట అక్టోబర్ 2021లో విడిపోతున్నట్లు ప్రకటించారు. సమంతతో విడాకులు తర్వాత నాగ చైతన్య శోభితతో రిలేషన్‌లో ఉన్నాడు. సమంత మాత్రం చైతుతో విడాకులు తర్వాత సింగిల్‌గానే కొనసాగుతోంది. దీంతో అక్కినేని ఇంటికి వచ్చిన మొదటి కోడళ్లు పెళ్లి చేసుకోకుండానే సింగిల్‌గా మిగిలిపోతున్నారని మరోసారి ఈ ఘటన రుజువు చేసినట్టు అయింది.












Click it and Unblock the Notifications