మహేష్‌బాబు, ప్రభాస్, రామ్‌చరణ్‌తో సందీప్ రెడ్డి వంగా మల్టీస్టారర్

తెలుగు సినీ పరిశ్రమ ఇప్పుడు సరిహద్దులు చెరిపేసి ప్రపంచ స్థాయికి చేరుకుంది. మన దర్శకులు తీస్తున్న సినిమాలు కేవలం దక్షిణ భారతదేశంలోనే కాకుండా , బాలీవుడ్ నుంచి హాలీవుడ్ వరకు అందరినీ ఆశ్చర్యపరుస్తున్నాయి. రాజమౌళి లాంటి దిగ్గజ దర్శకుడు 'RRR' చిత్రంతో ఇద్దరు అగ్ర హీరోలను ఒకే తెరపై చూపించి సంచలనం సృష్టిస్తే, ఇప్పుడు అంతకు మించిన ఒక భారీ మెగా మల్టీస్టారర్‌కు రంగం సిద్ధమవుతున్నట్లు తెలుగు సినీ వర్గాలు వెల్లడిస్తున్నాయి. ఈసారి ఈ సాహసానికి పూనుకుంటున్నది మరెవరో కాదు, తన విలక్షణ మేకింగ్‌తో సంచలనాలు సృష్టిస్తున్న దర్శకుడు సందీప్ రెడ్డి వంగా.

సందీప్ క్రేజీ ఐడయా

సందీప్ రెడ్డి వంగా మైండ్‌లో ఒకే ఫ్రేమ్‌లో ముగ్గురు సూపర్ స్టార్లను చూపించాలనే క్రేజీ ఐడియా ఉన్నట్లు తెలుస్తోంది. టాలీవుడ్ పిల్లర్స్‌గా పిలవబడే రెబల్ స్టార్ ప్రభాస్, సూపర్ స్టార్ మహేష్ బాబు, గ్లోబల్ స్టార్ రామ్ చరణ్‌లను కలిపి ఒక భారీ యాక్షన్ ఎంటర్టైనర్‌ను ప్లాన్ చేస్తున్నారట. ఈ ముగ్గురు హీరోలకు సరిపోయేలా ఒక పవర్‌ఫుల్ స్క్రిప్ట్‌ను వంగా ఇప్పటికే సిద్ధం చేశారని, ఇది గనుక పట్టాలెక్కితే భారతీయ సినిమా చరిత్రలోనే ఒక అపూర్వ ఘట్టంగా మిగిలిపోతుందని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ప్రస్తుతానికి సందీప్ రెడ్డి వంగా, ప్రభాస్‌తో 'స్పిరిట్' పేరుతో పవర్‌ఫుల్ పోలీస్ డ్రామాను తెరకెక్కించే పనిలో బిజీగా ఉన్నారు. ఈ సినిమా ఫలితం ప్రభాస్ కెరీర్‌కు మాత్రమే కాకుండా, రాబోయే మల్టీస్టారర్ ప్రాజెక్టుకు కూడా అత్యంత కీలకం కానుంది.

Sandeep Reddy Vanga s Multi-starrer with Mahesh Babu Prabhas and Ram Charan

ఉత్కంఠగా ఎదురుచూస్తున్న అభిమానులు

స్పిరిట్' గనుక బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకుంటే, సందీప్ వంగాపై నమ్మకం రెట్టింపు అవుతుంది. తద్వారా మహేష్, చరణ్ వంటి స్టార్ హీరోలు కూడా ఆయన విజన్‌పై పూర్తి విశ్వాసంతో ఈ భారీ ప్రాజెక్టులో భాగస్వాములు అయ్యే అవకాశం ఉంది. గతంలో హీరోల మధ్య ఉన్న కొన్ని ఇమేజ్ పరిమితుల వల్ల మల్టీస్టారర్ సినిమాలు రావడం కష్టంగా ఉండేది. కానీ 'RRR' సక్సెస్ తర్వాత టాలీవుడ్ హీరోల ఆలోచనా దృక్పథంలో చాలా మార్పు వచ్చింది.

కథలో దమ్ముంటే ఇద్దరు లేదా ముగ్గురు హీరోలు కలిసి నటించడానికి ఇప్పుడు అందరూ ఆసక్తి చూపుతున్నారు. సందీప్ రెడ్డి వంగా అనుకున్నట్టుగా ఈ ముగ్గురు దిగ్గజాలు ఒకే స్క్రీన్‌పై కనిపిస్తే, అప్పటి వరకు ఉన్న సినిమా రికార్డులన్నీ గాలిలో కలిసిపోవడం ఖాయం. ఈ 'ట్రిపుల్ ధమాకా' ఎప్పుడు మొదలవుతుందా అని ప్రపంచవ్యాప్తంగా ఉన్న సినీ అభిమానులు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+