అతనితో శృంగార సీన్లు అంటే భయం వేసింది...అర్జున్ రెడ్డి బ్యూటీ సంచలనం
తెలుగు ఇండస్ట్రీలో అర్జున్ రెడ్డి సినిమా ఓ సంచలనమే అని చెప్పాలి. అప్పటి వరకు మూస ధోరణిలో వెళ్తోన్న తెలుగు ఇండస్ట్రీని అర్జున్ రెడ్డి సినిమా మొత్తం మార్చేసింది. ఈ సినిమాతో విజయ్ దేవరకొండ ఓవర్‌నైట్ స్టార్ హీరోగా మారిపోయాడు. సందీప్ రెడ్డి వంగా ఈ సినిమాతో టాప్ దర్శకుల లిస్ట్‌లో చేరిపోయాడు. అయితే సినిమాలో హీరోయిన్‌గా నటించిన షాలిని పాండే మాత్రం పెద్దగా క్లిక్ కాలేకపోయింది. అర్జున్ రెడ్డి సినిమా తర్వాత ఆమెకు పెద్దగా అవకాశాలు దక్కలేదు. ఆ తర్వాత ఇద్దరి లోకం ఒకటే, మహానటి, నిశ్శబ్దం, 118 వంటి చిత్రాల్లో నటించి ప్రేక్షకులను మెప్పించింది. ఈ తర్వాత తెలుగులో అరకొర సినిమాలతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది.
బాలీవుడ్‌లో పలు సినిమాల్లో నటించినప్పటికి అవి కూడా ఆమె కెరీర్‌కు పెద్దగా ఉపయోగపడలేదు. షాలిని పాండే చేతిలో ప్రస్తుతం పెద్దగా సినిమా లేవని తెలుస్తోంది. అయితే సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే షాలిని పాండే.. తన వ్యక్తిగత విషయాలతో పాటు, సినిమా విశేషాలను అభిమానులతో పంచుకుంటుంది. షాలిని పాండే ప్రస్తుతం 'మహారాజ్' అనే సినిమాలో నటిస్తోంది. ఈ సినిమాతో అమీర్ ఖాన్ కొడుకు జునైద్ ఖాన్ హీరోగా ఇండస్ట్రీకి పరిచయం అవుతున్నాడు. ఈ సినిమాను నేరుగా ఓటీటీ ఫ్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్‌లో జూన్ 21 నుంచి స్ట్రీమింగ్ అవుతోంది. సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా ప్రమోషన్స్‌లో పాల్గొన్న షాలిని పాండే ఆసక్తికర విషయాలను అభిమానులతో పంచుకున్నారు.

సినిమాలో నటుడు జైదీప్‌తో ఒక శృంగార సీన్‌లో నటించాను. ఆ సీన్ షూట్ చేసే ముందు నేను బయటకు పరిగెత్తుకుంటూ వెళ్లిపోయాను. చాలా ఒత్తిడిగా అనిపించింది. చీకటి వాతావరణం ఉన్నప్పుడు నాకు భయం ఎక్కువ అని దర్శకుడుకు చెప్పాను. దీంతో నాకు ప్రశాంతమైన వాతావరణం కావాలని దర్శకుడిని అడిగాను. ఆయన నన్ను అర్థం చేసుకుని నాకు స్పేస్ ఇవ్వడంతో ఆ సీన్ పూర్తి చేయగలిగానని చెప్పుకొచ్చింది. షాలిని చేసిన కామెంట్స్‌పై నెటిజన్లు రియాక్ట్ అవుతున్నారు.అర్జున్ రెడ్డిలో అంత బోల్డ్ సీన్స్‌లో నటించిన షాలిని భయపడటమేంటని అంటున్నారు.ప్రస్తుతం ఫాలిని చేసిన కామెంట్స్ నెట్టింట వైరల్‌గా మారాయి.












Click it and Unblock the Notifications