శర్వానంద్ 'భోగి' కొత్త రిలీజ్ డేట్ వచ్చేసింది..
టాలీవుడ్ లో ఇటీవలి కాలంలో వరుస సినిమాలతో అలరిస్తున్న హీరోల్లో ఛార్మింగ్ స్టార్ శర్వానంద్ ఒకరు. హిట్స్.. ప్లాఫ్స్ తో సంబంధం లేకుండా వరుసగా మూవీస్ చేస్తూ ఫ్యాన్స్ లో జోష్ ను నింపుతున్నారు. గతేడాది వరకు హిట్స్ లేక ఇబ్బంది పడిన శర్వానంద్.. ఈ ఏడాది వరుస హిట్స్ తో దూసుకెళ్తున్నారు. ఈ ఏడాది జనవరిలో సంక్రాంతి కానుకగా వచ్చిన నారి నారి నడుమ మురారి సినిమాతో మంచి విజయాన్ని అందుకున్నారు శర్వానంద్.
ఆ తర్వాత స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ లో వచ్చిన బైకర్ మూవీతో మరో సూపర్ హిట్ ను తన ఖాతాలో వేసుకున్నారు. ఈ చిత్రానికి కొత్త దర్శకుడు అభిలాష్ రెడ్డి దర్శకత్వం వహించారు. తొలి సినిమాతోనే వైవిధ్యమైన కథాంశాన్ని ఎంచుకుని బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నారు దర్శకుడు అభిలాష్ రెడ్డి. ఇక బైకర్ మూవీలో టాలీవుడ్ సీనియర్ నటుడు రాజశేఖర్ కూడా కీలక పాత్రలో నటించారు. అయితే ప్రస్తుతం శర్వానంద్ 'భోగి' అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ మూవీకి సంపత్ నంది దర్శకత్వం వహిస్తున్నారు. అయితే ఈ మూవీ వాస్తవానికి నవంబర్ 12న విడుదల కావాల్సి ఉంది. కానీ అనూహ్యంగా చివరి నిమిషంలో వాయిదా పడింది.

రిలీజ్ కు ఒక్కరోజు ముందు ఇలా వాయిదా పడడంతో ఫ్యాన్స్ తీవ్రంగా నిరాశ చెందారు. అయితే చిత్ర యూనిట్ తాజాగా భోగి మూవీ రిలీజ్ డేట్ అధికారికంగా ప్రకటించింది. ఈ మూవీ నవంబర్ 27న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి రానున్నట్లు అధికారికంగా ప్రకటించింది. ఈ మేరకు సినిమా విడుదల తేదీని ప్రకటిస్తూ చిత్ర యూనిట్ విడుదల చేసిన పోస్టర్ ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. ఈ పోస్టర్ కు శర్వా- సంపత్ బ్లడ్ ఫెస్ట్ అని ట్యాగ్ ఇవ్వడంతో మూవీ ఎలా ఉండబోతుందన్నదానిపై ఇప్పటినుంచే ఫ్యాన్స్ లెక్కలు వేసుకుంటున్నారు. ఇక ఈ మూవీ తెలంగాణ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతోంది. శర్వానంద్ సరసన ఈ మూవీలో అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా నటిస్తోంది.












Click it and Unblock the Notifications
