మెగా హీరోతో లిప్ లాక్ చేయడం ఇష్టం లేక సినిమానే వదులుకున్న హీరోయిన్
ఒకప్పుడు సినిమాలో ముద్దు సీన్లు ఉంటే వార్త. ఇప్పుడు ఎన్ని ముద్దు సీన్లు ఉంటే అంత పెద్ద వార్త అన్నట్టుగా సినిమా మారిపోయింది. గతంలో నటులు ముద్దు సీన్లలో నటించడానికి తెగ మొహమాట పడేవారు.కానీ నేటితరం నటులైతే ముద్దు సీన్లు బట్టి తమ పారితోషకం డిమాండ్ చేయడం పరిపాటిగా మారింది. అలాంటిది లిప్ లాక్ ఉందని చెప్పి, ఏకంగా సినిమా నుంచే ఓ హీరోయిన్ తప్పుకుని సంచలనం సృష్టించింది. దీంతో ఆ సినిమాలో మరో హీరోయిన్ నటించింది. కట్ చేస్తే ఆ సినిమా బ్లాక్ బ్లాస్టర్ హిట్ కొట్టింది.ఆమె మరెవరో కాదు రాజశేఖర్ కూతురు శివాని.
కెరీర్ స్టార్టింగ్‌లోనే ఓ సూపర్ హిట్ సినిమాలో ఛాన్స్ వచ్చినప్పటికీ కూడా వదులుకున్నానని ఇప్పుడు తెగ బాధపడుతున్నారామె. మెగా హీరో వైష్ణవ్ తేజ్ తొలి సినిమా 'ఉప్పెన'లో హీరోయిన్‌గా తొలుత శివాని రాజశేఖర్‌నే చిత్ర యూనిట్ సంప్రదించారట.

కానీ ఆ సినిమాలో చాలా బోల్డ్‌గా కనిపించాలని, లిప్ లాక్ సన్నివేశాలు ఉంటాయని దర్శకుడు చెప్పడంతో నేను ఇలాంటి సన్నివేశాల్లో నటించలేనని.. చాలా అసౌకర్యంగా ఫీల్ అవుతానని చెప్పి శివాని రాజశేఖర్ ఈ సినిమా నుంచి తప్పుకుందట. అలా ఉప్పెన సినిమా నా చెయ్యి నుంచి జారిపోయిందని చెప్పి తెగ బాధ పడిపోయింది ఈ బ్యూటీ. ఆ తరువాత ఉప్పెన సినిమాలో కృతి శెట్టి హీరోయిన్‌గా నటించింది.
బేబేమ్మగా కృతి నటనకు మంచి మార్కులే పడ్డాయి. ఇంకా చెప్పాలంటే ఈ సినిమాతో యూత్ అంతా కృతికి వీరాభిమానులుగా మారారు.బాక్సాఫీస్ వద్ద ఉప్పెన సూపర్ డూపర్ హిట్ కావడంతో.. కృతి శెట్టికి తెలుగులో వరుస ఆఫర్లు వెల్లువెత్తాయి. రామ్, నాగ చైతన్య, నితిన్, నాని వంటి యంగ్ స్టార్స్‌తో కృతి శెట్టి జోడి కట్టింది. 'ఉప్పెన' సినిమాను రిజెక్ట్ చేసి శివాని రాజశేఖర్ బంగారం లాంటి ఛాన్స్ మిస్ అయింది కదా అంటూ ఆడియెన్స్ కామెంట్స్ చేస్తున్నారు.












Click it and Unblock the Notifications