శోభన్ బాబుకు ఆ సెంటిమెంట్ ఉందని ఓపెన్ అయిన మనవడు.. ఏంటంటే ?

తెలుగు సినీ చరిత్రలో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు " శోభన్ బాబు ". ఎన్టీఆర్, ఏఎన్నార్, కృష్ణ తర్వాత అదే స్థాయిలో.. కుటుంబ కథా చిత్రాలతో ప్రేక్షకులను మెప్పించారు. తనదైన నటనతో, విభిన్న పాత్రలతో ప్రేక్షకులను అలరించిన ఈ మహానటుడుకి.. సపరేట్ లేడీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉండేది. ఏ హీరోలకి లేని లేడీ ఫ్యాన్ ఫాలోయింగ్ శోభన్ బాబుకి ఉండేది అనడంలో సందేహం లేదు.

ఇండస్ట్రీలో వారసత్వం కొనసాగడం సర్వసాధారడం. శోభన్ బాబు మాత్రం తన పిల్లల్ని ఎవరిని కూడా ఇండస్ట్రీ లోకి పరిచయం చేయలేదు. కానీ ఆయన వారసులు మాత్రం ఇతర రంగాల్లో తమ ప్రతిభను చాటుతూ శోభన్ బాబు పేరును నిలబెడుతున్నారు. ఆ క్రమంలోనే ఆయన మనవడు డాక్టర్ సురక్షిత్ బత్తిన, వైద్య రంగంలో ఓ అద్భుత విజయాన్ని సాధించి దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నారు. తన తల్లిదండ్రులతో పాటు భార్య కూడా డాక్టర్ కావడంతో వీరంతా ఒక సొంతగా ఒక హాస్పిటల్ ఏర్పాటు చేసుకోని సేవలందిస్తున్నారు.

shobhan-babu-grand-son-surakshith-comments-on-his-sentiments

తాతయ్య సెంటిమెంట్...

అయితే ఇటీవల వరుస ఇంటర్వ్యూలకు హాజరవుతున్న డాక్టర్ సురక్షిత్.. తాజాగా తన తాతయ్య శోభన్ బాబుకు ఉన్న సెంటిమెంట్ గురించి ఓపెన్ అయ్యారు. తనకు ఇద్దరు పిల్లలని, వారిలో పెద్దమ్మాయి 10 సంవత్సరాలు, చిన్నమ్మాయికి 4 సంవత్సరాలని తెలిపారు. ఇక వీరి పేర్లు చెబుతూ పెద్దమ్మాయి పేరు సన్విక్ష, చిన్నమ్మాయి పేరు సమన్వి అని తెలిపారు.

" S " లెటర్ తోనే...

S అనే లెటర్ తాతగారికి సెంటిమెంట్ అంటూ చెప్పుకొచ్చారు. తన పేరు మాత్రమే కాకుండా తన కజిన్స్ పేర్లన్నీ కూడా మొదటి లెటర్ S తోనే ఉంటాయని చెప్పారు. అందుకే తన పిల్లలకు కూడా అదే విధంగా పేర్లు పెట్టినట్టు క్లారిటీ ఇచ్చారు. ఇక తెలుగులో ఎక్కువగా సినిమాలు చూడనని కాకపోతే తనకు ప్రభాస్ అంటే చాలా ఇష్టమని తెలిపారు. దీంతో సురక్షిత్ చేసిన ఈ కామెంట్స్ హాట్ టాపిక్ గా మారాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+