'అఖండ 2' ప్రీ రిలీజ్ ఈవెంట్ కు ఎవరూ ఊహించని అతిథులు..?
నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబోలో వస్తున్న నాలుగో సినిమా 'అఖండ-2'. ఇప్పటికే వీరి కాంబోలో సింహ, లెజెండ్, అఖండ సినిమాలు రాగా అవన్నీ బాక్సాఫీస్ ముందు బ్లాక్ బస్టర్ హిట్ సాధించాయి. దీంతో నాలుగోసారి ఈ క్రేజీ కాంబినేషన్ రిపీట్ అవుతున్న నేపథ్యంలో మూవీకి భారీ అంచనాలు నెలకున్నాయి. ఇప్పటికే రిలీజైన టీజర్, సాంగ్స్ ఫ్యాన్స్ తో పాటు సినీ ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటున్నాయి.
ఇక అఖండ 2 సినిమా డిసెంబర్ 5న ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాల నడుమ పాన్ ఇండియా రేంజ్ లో విడుదల కాబోతుంది. ఇటీవల ముంబైలో నిర్వహించిన సాంగ్ రిలీజ్ వేడుక సూపర్ సక్సెస్ అయింది. దీంతో అఖండ 2 మూవీ పాన్ ఇండియా రేంజ్ లో హిట్ అవుతుందని చిత్ర యూనిట్ ధీమా వ్యక్తం చేస్తోంది. ఇక రిలీజ్ టైమ్ దగ్గర పడుతున్న నేపథ్యంలో ఈ మూవీ ప్రీ- రిలీజ్ ఈవెంట్ ఈ నెల 28న హైదరాబాద్ లో ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.

అయితే ఈ ప్రీ- రిలీజ్ వేడుకకు ఊహించని అతిథులు రానున్నట్లు సామాజిక మాధ్యమాల్లో ఓ వార్త హల్ చల్ చేస్తోంది. ఈ మూవీ ప్రీ- రిలీజ్ ఈవెంట్ కు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ రానున్నట్లు సమాచారం అందుతోంది. అయితే దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. గతంలో కూడా అఖండ చిత్రం ప్రీ రిలీజ్ ఈవెంట్ కి అల్లు అర్జున్ ముఖ్య అతిథిగా వచ్చాడు. అయితే ఆ మూవీ బ్లాక్ బస్టర్ అయింది. అయితే మరోసారి బన్నీని అఖండ 2 మూవీ ప్రీ- రిలీజ్ ఈవెంట్ కు ఆహ్వానించినట్లు తెలుస్తోంది. అలాగే ఈ ఈవెంట్ కు సీఎం రేవంత్ రెడ్డి కూడా ముఖ్య అతిథిగా వచ్చేందుకు అంగీకారం తెలిపినట్లు స్పష్టం అవుతోంది. దీనిపై క్లారిటీ రావాల్సి ఉంది. ఇక అఖండ 2 సినిమా డిసెంబర్ 5న ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాల నడుమ పాన్ ఇండియా రేంజ్ లో విడుదల కాబోతుంది.
-
అడ్డంగా దొరికిన చంద్రబాబు? అంకెలతో తేల్చేసిన సజ్జల ..! -
బంగారం ధరల్లో లాభాల మోత -
బెంగళూరు, మైసూర్ కు ప్రత్యేక రైళ్లు- ఏపీలో హాల్ట్ స్టేషన్లు -
జీవన్ రెడ్డికి కేసీఆర్ బిగ్ టాస్క్, ఆపరేషన్ బిగిన్..!! -
భానుడి భగభగలు, పిడుగులతో భారీ వర్షాలు - ఈ ప్రాంతాలకు తాజా హెచ్చరికలు..!! -
Vaibhav Sooryavanshi: బుడ్డోడు మరో వరల్జ్ రికార్డు-కేవలం రెండో బ్యాటర్..! -
'డెకాయిట్'లో అసలైన ట్విస్ట్ ఇదే! -
PM-Rahat: యాక్సిడెంట్ బాధితులకు క్యాష్ లెస్ ట్రీట్మెంట్-ఆస్పత్రులకు ఆదేశాలు..! -
Tamil Nadu polls: చివరి 'బ్రహ్మాస్త్రం' ప్రయోగించిన విజయ్.. ఇక సైకిల్ టూ సీఎం సీటే..! -
Video: ఇదెక్కడి మాస్ రా మావా. బటన్ నొక్కితే బండి నంబర్ ప్లేట్ ఛేంజ్ -
జన్మ నక్షత్రం పునర్వసు, పుష్యమి ఉన్నవారి మే నెల జాతక ఫలం -
SRH కొంపముంచిన క్లాసెన్ జిడ్డు బ్యాటింగ్










Click it and Unblock the Notifications