అతని వల్లే మందుకు బానిసనైయ్యాను - శృతి హాసన్

సినిమా ఇండస్ట్రీలో ఎఫైర్స్, డేటింగ్, పబ్ కల్చర్ అనేది కామన్. తాజాగా తన జీవితంలో ఎదురైన ఇలాంటి కొన్ని సంఘటనల గురించి వివరించారు స్టార్ హీరోయిన్ శృతి హాసన్. ఆ వివరాల్లోకి వెళ్తే...లోకనాయకుడు కమల్ హాసన్ కూతురుగా ఇండస్ట్రీకి పరిచియం అయిన శృతి..అనతి కాలంలోనే స్టార్ హీరోయిన్‌గా ఎదిగింది. తెలుగు, తమిళ, హిందీ భాషల్లో నటించి మంచి పాపులారిటీని తెచ్చుకుంది.

ముఖ్యంగా పవన్ కల్యాణ్‌తో నటించిన గబ్బర్ సింగ్, మహేష్‌తో శ్రీమంతుడు సినిమాలు సూపర్ హిట్ కావడంతో శృతి హాసన్ రేంజ్ ఒక్కసారిగా మారిపోయింది. స్టార్ హీరోయిన్‌గా ఎక్కువ కాలం కొనసాగుతుందనుకున్న శృతి హాసన్ కెరీర్ గాడి తప్పింది. దీనికి కారణం తన వ్యక్తిగత జీవితమే అంటోంది ఈ భామ.

 Shruti Haasan says Alcohol was a big thing, always wanted to drink

వరుస సినిమాలతో బిజీగా ఉన్న సమయంలోనే మైఖేల్ కొసలే అనే వ్యక్తితో శ్రుతి హాసన్ డేటింగ్ చేసింది. పెళ్లికి ముందే ఇద్దరు కలిసి ఒకే ఇంట్లో కాపురం కూడా పెట్టారు. కొన్నాళ్లు బాగానే సాగిన వీరి రిలేషన్‌షిప్‌‌కు 2019లో తెరపడింది. అభిప్రాయభేదాలు తలెత్తడంతో మైఖేల్ కొసలే‌కు శ్రుతి హాసన్ బ్రేకప్ చెప్పేసింది. మైఖేల్‌తో విడిపోయిన తర్వాత మద్యానికి బానిస అయ్యానని, ఆరోగ్య సమస్యలతో బాధపడ్డానని శ్రుతి హాసన్ చెప్పుకొచ్చింది.

 Shruti Haasan says Alcohol was a big thing, always wanted to drink

అయితే తాను ఎనిమిదేళ్ల క్రితమే డ్రింక్ చేయడం మానేశానని..తరచూ పార్టీలకు వెళ్లడం వల్ల మద్యపానం అలవాటు అయిందని..ఇది తీవ్రతరం అవుతుందని గ్రహించి డ్రింకింగ్‌కు దూరంగా ఉన్నానని తెలిపింది. అలాంటి ఫ్రెండ్స్‌‌కు సైతం దూరం పెట్టినట్టు చెప్పుకొచ్చింది. డ్రింక్ మానేయడంపై ఎలాంటి రిగ్రేట్ ఫీల్ కావడం లేదని పేర్కొంది.

తాను ఎప్పుడూ డగ్స్ అలవాటు చేసుకోలేదని.. అదే విధంగా స్మోకింగ్ కూడా దూరంగా ఉన్నానని.. నాకు తెలిసి స్మోకింగ్ అనేది వరెస్ట్ థింగ్‌ అని శృతి చెప్పుకొచ్చింది. ఇది నా వ్యక్తిగత విషయం కావడంతో దీని గురించి ఎవ్వరికీ తెలియకుండా సీక్రెట్‌గా ఉంచినట్లు వివరించింది. ప్రస్తుతం శృతి హాసన్ నటుడు శంతను హజారికాతో రిలేషన్‌తో ఉన్నట్టు క్లారిటీ ఇచ్చింది.

 Shruti Haasan says Alcohol was a big thing, always wanted to drink

ఇక శృతి హాసన్ కెరీర్ విషయానికి వస్తే..2023లో ఆమె ఖాతాలో నాలుగు హిట్లు చేరాయి. చిరంజీవితో కలిసి నటించిన వాల్తేరు వీరయ్య, బాలకృష్ణతో ''వీరసింహారెడ్డి'', నానితో ''హయ్ నాన్న'' సినిమాలో గెస్ట్ రోల్‌లో కనిపించి మెప్పించింది. తాజాగా ప్రభాస్‌తో నటించిన సలార్ కూడా బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ కావడంతో..గతేడాది శృతి హాసన్‌కు బాగా కలిసి వచ్చిందనే చెప్పాలి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+