చిరంజీవి స్వయంగా అడిగినా నో చెప్పిన స్టార్ హీరో
భారతదేశంలో మెగాస్టార్ గా కొనసాగుతున్న చిరంజీవి గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే కొన్ని దశాబ్దాల నుంచి ఆయన ఏమిటి? ఆయన వ్యక్తిత్వం ఏమిటి? ఆయన మనస్తత్వం ఏమిటి? అనే విషయాలను ప్రజలందరికీ క్షుణ్నంగా తెలుసు. సినిమా పరిశ్రమలోకి ప్రవేశించిన కొత్తల్లో చిన్న చిన్న క్యారెక్టర్లు, విలన్ క్యారెక్టర్లు పోషిస్తూ తర్వాత హీరోగా మారారు. నృత్యాలు, ఫైట్లద్వారా ప్రజలను ఆకట్టుకుంటూ మెగాస్టార్ గా మారారు. అగ్ర కథానాయకుడిగా కొనసాగుతున్న చిరంజీవి సినిమాలో అవకాశం వస్తే అందరూ ఎగిరి గంతేస్తారు. ఆయన సినిమాల్లో నటించడంద్వారా తమకు కూడా మంచి గుర్తింపు వస్తుందని, పాపులర్ అవుతామని భావిస్తారు.
చిరు కథానాయకుడిగా వచ్చిన సూపర్ హిట్ చిత్రం మాస్టర్. ఈ సినిమాలో ఒక ప్రత్యేకమైన పాత్రను రచయిత, దర్శకుడు తీర్చిదిద్దారు. ఈ క్యారెక్టర్ లో మంచి క్రేజ్, ఇమేజ్ ఉన్న హీరో నటిస్తేనే బాగుంటుందని భావించారు. దీంతో ఈ క్యారెక్టర్ లో నటించేందుకు శోభన్ బాబును సంప్రదించింది చిత్ర యూనిట్. అయితే ఆయన నో చెప్పారు. దీంతో చిరంజీవి స్వయంగా శోభన్ బాబుతో మాట్లాడారు. మీరుచేస్తే సినిమాకు ప్లస్ అవుతుందని, చేయాలంటూ విన్నవించారు. సినిమాల నుంచి పూర్తిగా తప్పుకోవాలనే నిర్ణయాన్ని తీసుకున్నానని, కాబట్టి నటించలేకపోతున్నందుకు ఏమీ అనుకోవద్దని శోభన్ బాబు అన్నారు.













Click it and Unblock the Notifications