సమంతను అలా చూడగానే కన్నీళ్లు ఆగలేదు - శోభిత ధూళిపాళ
శోభిత ధూళిపాళ గురించి కొత్తగా పరిచియం చేయాల్సిన పనిలేదు. అడవి శేష్ నటించిన 'గూఢచారి' సినిమాలో హీరోయిన్‌గా నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది.ఆ తర్వాత పలు బాలీవుడ్ సినిమాల్లో నటిస్తూ ఫుల్ బిజీ హీరోయిన్‌గా మారింది. అయితే ఇదే సమయంలో అక్కినేని హీరో నాగ చైతన్యతో డేటింగ్ చేస్తూ వార్తల్లో కూడా నిలిచింది. ఇంకా చెప్పాలంటే నాగ చైతన్య వల్లనే శోభితా ధూళిపాళ లైఫ్ లైన్‌లోకి వచ్చింది.సమంత, నాగ చైతన్య ఇద్దరూ ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. తెలుగు ఇండస్ట్రీలో సమంత -నాగచైతన్య జంట బెస్ట్ పెయిర్‌గా నిలుస్తుందని అంతా భావించారు. కానీ వీరి మధ్య విభేదాలు రావడంతో విడాకులు తీసుకున్నారు.
సమంతతో విడాకులు తర్వాత నాగ చైతన్య శోభిత ధూళిపాళతో సైలెంట్‌గా డేటింగ్ చేశాడు. ఇప్పుడు ఏకంగా ఆమెను వివాహం చేసుకోవడానికి రెడీ అయ్యాడు. శోభిత ధూళిపాళను నిశ్చితార్థం చేసుకుని సినీ అభిమానులకు నాగ చైతన్య గట్టి షాకే ఇచ్చాడు. వీరి నిశ్చితార్థానికి సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో అభిమానులు షాక్‌కు గురయ్యారు. ఇక్కడ వరకు అంతా బాగానే ఉన్నప్పటికి , ఇక్కడే అసలు ట్విస్ట్ బయటపడింది. శోభిత ధూళిపాళకు ఓ చెల్లెలు ఉంది. శోభిత ధూళిపాళ్ల చెల్లి పేరు కూడా సమంతనే కావడం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో తన చెల్లెలు సమంత గురించి చెబుతూ శోభిత ఎమోషనల్ అయ్యారు. తన చెల్లెలు సమంత అంటే చాలా ఇష్టమని చెప్పింది.

ఈ మధ్యే తన పెళ్లి అయింది. అందంగా ముస్తాబై మండపంలో కూర్చున్న నా చెల్లిని చూడగానే ఆనందంతో కనీళ్లు ఆగలేదని శోభిత తెలిపింది. చెల్లెలు పెళ్లి కారణంగా నేను మా బంధువులనంతా కలుసుకున్నాను. కెరీర్‌లో బిజీగా ఉండడం కారణంగా ఇన్నాళ్లు వారికి దూరంగా ఉన్నాను. చెల్లి పెళ్లి పుణ్యమా అంటూ వారందర్ని కలుసుకునే అవకాశం లభించిందని ఆమె వ్యాఖ్యానించింది. ఇక మీదట పర్సనల్ లైఫ్‌కి కూడా సమయం కేటాయిస్తానని శోభిత చెప్పుకొచ్చింది. నాగ చైతన్య మరదలు సమంత ధూళిపాళ్ల విషయానికి వస్తే.. వృత్తిరీత్యా డాక్టర్. బార్సిలోనా యూనివర్సిటీలో తన డాక్టర్ చదువు పూర్తి చేసి రేడియో రోగ నిర్ధారణ విభాగంలో ఎండీగా పని చేస్తోంది. అయితే సమంత ధూళిపాళ తన అక్క కంటే ముందే వివాహం చేసుకుని విదేశాల్లో ఉంటుంది. అక్క నిశ్చితార్థానికి రాలేకపోయిన సమంత, పెళ్లికి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.












Click it and Unblock the Notifications