విరహ వేదనలో శోభితా .. నాగ చైతన్య ఎక్కడ అంటూ పోస్ట్
ఇటీవల సోషల్ మీడియాలో బాగా వినిపిస్తోన్న పేర్లలో శోభితా ధూళిపాళ ఒకరు. చేసింది తక్కువ సినిమాలే అయినప్పటికి అతి తక్కువ కాలంలోనే తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. ముఖ్యంగా నాగ చైతన్య వల్ల శోభితా ధూళిపాళ లైఫ్ లైన్‌లోకి వచ్చిందనే చెప్పాలి.సమంతతో విడాకుల తీసుకున్న తర్వాత తెలుగు హీరోయిన్ శోభిత ధూళిపాళతో రిలేషన్‌లో ఉన్నాడనే పుకార్లు షికార్లు చేస్తున్నాయి. దీనికి తగ్గట్టుగానే వీరిద్దరు కలిసి దర్శనం ఇవ్వడంతో ఇదింతా కూడా నిజమే అని అంతా భావిస్తున్నారు. నాగ చైతన్య, శోభిత ధూళిపాళతో కలిసి యూరప్ వెళ్లిన ఫొటోలు వైరల్ అయ్యాయి.
ఓ వైన్ టెస్ట్ పార్టీ జరుగుతుండగా అక్కడికి వీరిద్దరూ కలిసి వెళ్లినట్లు తెలుస్తోంది.శోభిత పక్కనే నాగ చైతన్య దర్శనం ఇవ్వడంతో అందరు ఒక్కసారిగా షాక్ అయ్యారు. వీరిద్దరు పార్టీలో కలిసిన ఫొటోలు ఓ నెటిజన్ తన సోషల్ మీడియాలో పంచుకున్నాడు. దీంతో నాగ చైతన్య, శోభిత డేటింగ్‌లో ఉన్నారనేది మరోసారి రుజువు అయిందని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. సమంతతో విడిపోయిన తర్వాత శోభితతో నాగ చైతన్య సీక్రెట్‌గా రిలేషన్ మెయిన్‌టైన్ చేస్తున్నారు.దీంతో నాగ చైతన్య, శోభిత ధూళిపాళ మధ్య డేటింగ్‌లో ఉన్నారంటూ వార్తలు పుట్టుకొచ్చాయి.

గతంలో కూడా వీరిద్దరు కలిసి దర్శనం ఇచ్చారు. ఓ హోటల్ చెఫ్‌తో నాగ చైతన్య ఫొటో దిగారు. అయితే ఆ ఫొటోలో వెనుక శోభిత ఉంది. ఇదిలా ఉంటే తాజాగా శోభితా వెకేషన్‌కు వెళ్లిన ఫొటోలను తన సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఈ ఫొటోల్లో బ్యూటీ షిప్‌లో ఒంటరిగా కూర్చొని ఏదో ఆలోచిస్తున్నట్లు కనిపిస్తుంది. శోభితా ఫొటోలపై నెటిజన్లు రకరకాలుగా రియాక్ట్ అవుతున్నారు. విరహా వేదనలో ఉన్న శోభితా నాగ చైతన్య ఎక్కడా అంటూ కొందరు పోస్టులు పెడుతుండగా, అసలు ఈ ఫొటోలు తీసిందే నాగ చైతన్య అంటూ మరికొందరు కామెంట్స్ చేస్తున్నారు.ప్రస్తుతం శోభితా వెకేషన్ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.












Click it and Unblock the Notifications