అక్కినేని కోడలు దగ్గర ఈ టాలెంట్ కూడా ఉందేంటి..?
అక్కినేని నాగ చైతన్య సతీమణి, నటి శోభిత ధూళిపాళ్ల సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన కొన్ని చిత్రాలు, వీడియోలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. ఈ వీడియోలో ఆమె పాత్ర కోసం వంట చేస్తూ, అంట్లు తోముతూ కనిపించారు. ఈ ఫోటోలు చూసిన అభిమానులు ఆమె సింప్లిసిటీకి ఆశ్చర్యపోయారు.
శోభిత సింప్లిసిటీకి నెటిజన్ల ఫిదా
సాధారణంగా నటీనటులు షూటింగ్‌లో ఇలాంటి పనులు చేయడం చాలా అరుదుగా చూస్తుంటాం. కానీ శోభిత మాత్రం ఇవన్నీ స్వయంగా చేస్తూ కనిపించారు. ఆమె వంట చేస్తూ కనిపించిన వీడియోపై ఒక అభిమాని 'అక్కా..మీకు వంట చేసే టాలెంట్ కూడా ఉందా?' అని అడగ్గా, దానికి శోభిత 'మూడ్ బాగున్నప్పుడు చేస్తాను చెల్లి' అని సరదాగా సమాధానమిచ్చారు. ఈ సంభాషణ నెటిజన్లను మరింత ఆకట్టుకుంది.

అక్కినేని కుటుంబంలో సక్సెస్ జోష్
శోభిత పోస్ట్‌పై ఆమె భర్త నాగ చైతన్య కూడా స్పందించారు. 'శోభిత చేసిన వంటలను రుచి చూసేందుకు ఆతృతగా ఎదురు చూస్తున్నాను' అంటూ తన స్టోరీలో పెట్టారు. ఈ జంట పెళ్లి తర్వాత ఎంతో అన్యోన్యంగా గడుపుతోంది. పెళ్లికి ముందు వరుస ఫ్లాపులతో ఇబ్బంది పడిన నాగ చైతన్యకు, పెళ్లి తర్వాత విడుదలైన 'తండేల్' చిత్రం బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. మరోవైపు, శోభిత మామయ్య అక్కినేని నాగార్జున కూడా 'కుబేర' మరియు 'కూలీ' చిత్రాలతో సూపర్ హిట్స్ అందుకున్నారు.
శోభిత, నాగ చైతన్యల భవిష్యత్ ప్రాజెక్టులు
శోభిత వివాహం తర్వాత సినిమాలకు దూరం అవుతారని అందరూ భావించారు. కానీ ఆమె ఒక బాలీవుడ్ చిత్రంలో నటిస్తూ కెరీర్ కొనసాగిస్తున్నారు. నాగ చైతన్య కూడా 'విరూపాక్ష' దర్శకుడు కార్తీక్ దండుతో కలిసి ఒక మిస్టిక్ థ్రిల్లర్ చేస్తున్నారు. ఈ చిత్రం ఈ ఏడాదే విడుదల కానుందని, అక్కినేని అభిమానులు ఈ సినిమాపై చాలా ఆశలు పెట్టుకున్నారు. ఈ చిత్రం తర్వాత నాగ చైతన్య, దర్శకుడు కొరటాల శివతో ఒక సినిమా చేయబోతున్నారు. ఈ ప్రాజెక్ట్ వచ్చే ఏడాది మధ్యలో విడుదలయ్యే అవకాశం ఉంది. ఈ దంపతులు కెరీర్ పరంగా, వ్యక్తిగత జీవితంలోనూ సంతోషంగా ఉండటం అక్కినేని అభిమానులకు ఆనందాన్ని పంచుతోంది.












Click it and Unblock the Notifications