ఆ స్టార్ హీరో నన్ను వేధిస్తున్నాడు: పూనమ్‌కౌర్ సంచలన ట్వీట్
తెలుగందంతో కలిసిపోయిన పంజాబీ అందం పూనమ్ కౌర్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరంలేదు. హీరోయిన్ గా చాలా సినిమాలు చేసి ప్రేక్షకులను మెప్పించింది. కాలం కలిసిరాలేదుకానీ స్టార్ హీరోయిన్ గా మారాల్సింది. అయితే తాను స్టార్ హీరోయిన్ గా మారకుండా, తన భవిష్యత్తును దెబ్బతీసిన వ్యక్తి మాత్రం ఒక డైరెక్టర్ అని చెబుతూ అనిపై తీవ్రస్థాయిలో ఎప్పుడూ నిప్పులు చెరుగుతుంటుంది. కొంతమంది హీరోలతో నటించిన తర్వాత అవకాశాలు రాకపోవడంతో సినిమాలకు గుడ్ బై చెప్పిందికానీ సామాజిక మాధ్యమాల్లో మాత్రం ఎప్పుడూ చురుగ్గా ఉంటుంది. ఎప్పటికప్పుడు కరెంట్ అఫైర్స్ పై ట్వీట్ చేస్తుంటుంది.
హఠాత్తుగా సినిమాలు చేయడం మానేసింది
త్రివిక్రమ్ శ్రీనివాస్ గురించి, పవన్ కల్యాణ్ గురించి తరుచుగా ట్వీట్ చేస్తూ వార్తల్లో నిలుస్తుంటుంది పూనమ్ కౌర్. వారిద్దరినీ విమర్శించడానికి కారణాలేమిటనే విషయం తెలియదుకానీ చాలా తీవ్రస్థాయిలో విరుచుకుపడుతుంది. అందులోను త్రివిక్రమ్ అంటే మరీ సీరియస్ అవుతుంటుంది. తాజాగా ఓ సంచలన ట్వీట్ చేసింది. తాను తెలుగలో ఓ సోషియో ఫాంటసీ చిత్రం చేశానని, అందుతో తనతోపాటు ఓ అమ్మయి నటించిందని, తర్వాత హీరోయిన్ అయిందని, అయితే కొన్నేళ్లుగా సినిమాలు చేయడం మానేసిందని పూనమ్ ట్వీట్ లో పేర్కొంది. తర్వాత ఎవరికీ అందుబాటులో లేదని, ఎవరికీ కనిపించలేదని వివరించింది.

విమానంలో కనపడి అసలు విషయం చెప్పింది
తర్వాత తనకు ఓ విమానంలో కనపడిందని, పలకరించగా పెళ్లికి షాపింగ్ చేయడానికి వచ్చినట్లు చెప్పింది. అయితే తాను ఇండియాలో ఉన్న విషయం ఎవరికీ చెప్పొద్దని వేడుకుంది. ఏమైందని అడగ్గా ఒక స్టార్ హీరో తనను తరుచుగా వేధిస్తున్నాడని, తాను ఎక్కడికి వెళ్లినా అక్కడికి వస్తున్నాడని, తామిద్దరం కలిసి చేసిన సినిమాలో ఇంటిమేటెడ్ సన్నివేశం చేసినప్పుడు తన ముఖంపై నిజంగానే భారీగా ఉమ్మేశాడని, దర్శకుడు కట్ కూడా చెప్పలేదంటూ వాపోయింది. తర్వాత పరిశ్రమను వదిలేసి అమెరికాలో చదువుకునేందుకు వెళ్లిపోయింది. అయినప్పటికీ ఆ స్టార్ హీరో వేధింపులు మాత్రం తగ్గలేదని చెప్పింది. ఆ అమ్మాయి చెప్పిందంతా నిజమేనని, తనను గట్టిగా హగ్ చేసుకొని ధైర్యం చెప్పానని, ఓదార్చానని పూనమ్ కౌర్ ట్వీట్ లో రాసుకొచ్చింది. ప్రస్తుతం ఈ ట్వీట్ సోషల్ మీడియాలో సంచలనం సృష్టిస్తోంది. ఆ హీరో ఎవరై ఉంటారు అనే విషయంపై నెటిజన్ల మధ్య చర్చ నడుస్తోంది.
!! ॐ नमो हनुमते भय भंजनाय सुखम् कुरु फट् स्वाहा ।। !!⠀
— पूनम कौर ❤️ poonam kaur (@poonamkaurlal) November 17, 2024
TAMILNADU#womensupportingwomen pic.twitter.com/QgYxjfYA7I












Click it and Unblock the Notifications