అనుష్కకు వార్నింగ్ ఇచ్చిన స్టార్ హీరో..?
హీరోయిన్ అనుష్క శెట్టి సినిమాల్లో కనిపించి చాలాకాలం అయింది. అయినప్పటికి కూడా అభిమానుల్లో ఆమె క్రేజ్ ఏమాత్రం చెక్కుచెదరలేదు. అతి తక్కువ కాలంలోనే అనుష్క తనకంటూ ప్రత్యేక ఇమేజ్‌ను క్రియేట్ చేసుకున్నారు. తెలుగులో స్టార్ హీరోలందరితోనూ నటించి ఫుల్ పాపులారిటీని సంపాదించుకుందామె. లేడీ ఓరియెంటెడ్ సినిమాల్లో నటిస్తూ స్పెషల్ క్రేజ్ తెచ్చుకుంది. ముఖ్యంగా అరుంధతి సినిమాతో అనుష్క రేంజ్ ఒక్కసారిగా మారిపోయింది. తెలుగులో హీరోలతో సమానంగా అనుష్కకు మార్కెట్ ఉందంటే అతిశేయోక్తి కాదు.
అయితే గత కొంతకాలంగా అనుష్క సినిమాలు చేయడం తగ్గించేసిందనే చెప్పాలి. జీరోసైజ్ సినిమాతో లావు పెరగిన అనుష్క తరువాత బరువు తగ్గడానికి చాలా ప్రయత్నాలు చేసింది. దాదాపు 100 కేజీలకు పైగా బరువు పెరిగి షాకిచ్చింది. ఆవెంటనే నిశ్శబ్దం సినిమా కోసం బరువు తగ్గి మాములు స్థితిలోకి వచ్చింది. గతేడాది యంగ్ హీరో నవీన్ పోలిశెట్టితో కలిసి మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి సినిమాతో అనుష్క ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని నమోదు చేసింది. ఆ తరువాత మరే సినిమాను అనుష్క అంగీకరించలేదు. కథ నచ్చితే తప్పిస్తే అనుష్క సినిమా ఒప్పుకోదనే విషయం తెలిసిందే. అనుష్క ప్రస్తుతం 'కథానర్' అనే మలయాళ సినిమాలో నటిస్తున్నారు. ఇదిలా ఉంటే అనుష్కకు సంబంధించిన ఓ వార్త నెట్టింట వైరల్‌గా మారింది. వేదం సినిమా అనుష్కకు మంచి పేరు తీసుకువచ్చింది. కమర్షియల్‌గా హిట్ కాకపోయినప్పటికి వేదం సినిమా అభిమానుల్లో చెరగని ముద్ర వేసిందనే చెప్పాలి. ఈ సినిమాలో అనుష్క వేశ్యగా నటించారు. అయితే అనుష్కను వేశ్యగా నటించొద్దని ఓ స్టార్ హీరో ఆమెకు వార్నింగ్ ఇచ్చాడట.
అలా వార్నింగ్ ఇచింది మరెవ్వరో కాదు.. డార్లింగ్ ప్రభాస్. ఒక స్టార్ హీరోయిన్ అలాంటి పాత్ర చేస్తే కెరీర్ పై ప్రతికూల ప్రభావం పడుతుందని సీరియర్ వార్నింగ్ ఇచ్చాడట. కానీ అనుష్క మాత్రం ప్రభాస్ మాటలు పట్టించుకోకుండా వేదం సినిమాలో అనుష్క వేశ్యగా కనిపించారు. కట్ చేస్తే.. అనుష్క పోషించిన సరోజ పాత్రకు ఎంతటి పేరు వచ్చిందో అందరికి తెలిసిందే. క్రిష్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో అల్లు అర్జున్, మంచు మనోజ్ కీలక పాత్రల్లో కనిపించారు.












Click it and Unblock the Notifications