ఐటం సాంగ్ లో పూజా హెగ్డే... హీరో ఎవరో తెలుసా?
వరుసగా సూపర్ హిట్ సినిమాలతో స్టార్ హీరోయిన్ గా మారిన పూజాహెగ్డేకు ప్రస్తుతం కాలం కలిసి రావడంలేదు. గతేడాది వరుసగా సినిమాలన్నీ పరాజయం పాలవడంతో నిర్మాత, దర్శకులు, హీరోలు పూజాను దూరం పెట్టడం ప్రారంభించారు. సినిమా అవకాశాలు రావడంలేదని దిగులుచెందుతున్న సమయంలోనే గుంటూరు కారం, ఉస్తాద్ భగత్ సింగ్ లాంటి సినిమాల్లో వచ్చిన అవకాశాలు కూడా దురదృష్టవశాత్తూ ఈ ముద్దుగుమ్మ నుంచి దూరమయ్యాయి.
అలాంటి స్థితిలో ఉన్న ఈ అమ్మడుకు అనుకోకుండా ఓ స్టార్ డైరెక్టర్ పిలిచి అవకాశం ఇచ్చినట్లు తెలుస్తోంది. రవితేజ హీరోగా సినిమాను రూపుదిద్దుతున్న ఈ డైరెక్టర్ ఒక ప్రత్యేక గీతంలో నర్తించేందుకు పూజాను ఒప్పించినట్లు తెలుస్తోంది. చాలాకాలం తర్వాత స్టార్ హీరో సరసన స్క్రీన్ షేర్ చేసుకునే అవకాశం రావడంతో ఈ సినిమా విడుదలైన తర్వాత కచ్చితంగా అవకాశాలు వస్తాయనే నమ్మకంతో ఈ బుట్టబొమ్మ ఉంది. రంగస్థలం సినిమాలో కూడా రామ్ చరణ్ తో ఒక స్పెషల్ సాంగ్ చేసింది. అది బ్లాక్ బస్టర్ గా నిలిచింది.

నాగచైతన్య సరసన ఒక లైలాకోసం సినిమాతో తెలుగు పరిశ్రమకు పూజా పరిచయం అయింది. ముకుందతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది. ఆ తర్వాత హృతిక్ రోషన్ సరసన మొహంజదారో సినిమాలో అవకాశం రావడంతో బాలీవుడ్ కు వెళ్లిందికానీ ఆ సినిమా ఫ్లాపవడంతో వెంటనే తిరిగి టాలీవుడ్ కు వచ్చేసింది. ఆ సమయంలో చేసిన సినిమాలన్నీ సూపర్ హిట్ గా నిలవడంతో పూజాను గోల్డెన్ లెగ్ అంటూ పరిశ్రమ మొత్తం ఆమె వెంట పడింది. కొంతకాలం తర్వాత పెద్ద హీరోలతో చేసిన సినిమాలన్నీ ఫ్లాపవడంతో ఎటువంటి కథలను ఎంచుకోవాలో ఈ బ్యూటీకి అర్థం కాలేదు. తెలుగులో ఏమైనా మంచి అవకాశాలు వస్తాయేమోనన్న ఆశతో ఎదురుచూస్తోంది.












Click it and Unblock the Notifications