ఆటోలో సైలెంట్ గా సమంత ప్రయాణం.. ఏమైంది?

సౌత్ ఇండియన్ స్టార్ హీరోయిన్ సమంత.. ప్రస్తుతం దక్షిణాదిలో ఉన్న అగ్ర కథానాయికల్లో ఒకరు. ఏమాయె చేసావే సినిమాతో మొదటి చిత్రంతోనే బ్లాక్ బస్టర్ హిట్ దక్కించుకున్నారు. ఆ తర్వాత మహేశ్, నాగార్జున, ఎన్టీఆర్, పవన్ కళ్యాణ్ లాంటి స్టార్ హీరోస్ తో నటించి తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. అక్కినేని నాగచైతన్యతో 2010లో నటించిన మొదటి సినిమా ఏమాయ చేసావే చిత్రంతో ఇద్దరి మధ్య పరిచయం ఏర్పడింది.కొద్దికాలానికి పరిచయం కాస్త ప్రేమగా మారింది. దీంతో వీరి ఎంగేజ్ మెంట్ 29 జనవరి 2017న హైదరాబాద్ లో జరిగింది. ఇక వీరి పెళ్లి గోవాలో హిందూ సంప్రదాయ పద్ధతిలో అక్టోబరు 6, 2017న అంగరంగ వైభవంగా జరిగింది.

వివాహం తర్వాత అక్కినేని సమంతగా తన పేరును మార్చుకున్నారు. పెళ్లి తర్వాత కూడా కొన్ని సినిమాల్లో నటించారు సామ్. ఆ తర్వాత చైతూ, సమంతల మధ్య మనస్పర్థలు రావడంతో వాళ్లిద్దరూ విడాకులు తీసుకుంటున్నట్లు అక్టోబరు 2, 2021లో తెలిపారు. ఆ తర్వాత విడాకులు తీసుకున్నారు. ప్రస్తుతం తన తల్లి వద్దే సమంత ఉంటున్నారు. అయితే సమంత ముంబయికు మకాం మార్చినట్లు సమాచారం.

Star Heroine Samantha Drives an Auto in Mumbai Video Goes Viral

సమంత ఆటోలో ప్రయాణం..

అయితే తాజాగా సమంత ఆటోలో ప్రయాణించారు. ముంబైలోని రోడ్లపై ఆటోలో సరాదాగా చక్కర్లు కొట్టడం బాలీవుడ్ బ్యూటీస్ కు మామూలే. ఇప్పుడు ఆ జాబితాలోకి సమంత చేరారు. ఆమె ముంబైలోని రోడ్లపై ఆటోలో చక్కర్లు కొట్టారు. అందుకు సంబంధించిన వీడియోను ఆమె సామాజిక మాధ్యమంలో పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఆ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. ఆమె ఆటోలో ప్రయాణిస్తున్నప్పుడు తీసిన వీడియోకు నటి రకుల్ ప్రీత్ సింగ్ నటించిన మేరే హస్బెండ్ కీ బీవీ సినిమాలోని పాటను యాడ్ చేశారు.

ఇక 2013లో శాకుతలం, ఖుషీ చిత్రాలతో తెలుగు ప్రేక్షకులను అలరించిన సమంత ఆ తర్వాత తెలుగులో సినిమాలను తగ్గించారు. ప్రస్తుతం ముంబైలో నివాసం ఉంటున్నట్లు సమాచారం.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+