ఏమున్నాడు రా బాబు.. వేటాడే సింహం లాగా మహేష్ న్యూ లుక్.. ఫుల్ వైరల్
సూపర్ స్టార్ మహేష్ బాబు - దర్శక ధీరుడు రాజమౌళి కాంబినేషన్ లో మూవీ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. టాలీవుడ్ మోస్ట్ ప్రెస్టీజియస్ ఫిల్మ్ గా.. మహేష్ బాబు కెరీర్ ల లోనే అత్యంత భారీ బడ్జెట్ తో ఈ సినిమా నిర్మిస్తున్నారు. ఈ మూవీలో మాలీవుడ్ స్టార్ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్, బాలీవుడ్ బ్యూటీ ప్రియాంక చోప్రా కూడా నటిస్తున్నారు. SSMB29అనే వర్కింగ్ టైటిల్ తో శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది ఈ చిత్రం. రీసెంట్ గానే ఒడిశాలోని కోరాపుట్ జిల్లాలో ఈ మూవీ షూటింగ్ లో ఓ షెడ్యూల్ పూర్తి చేసుకుంది. దీంతో మహేశ్ బాబు, రాజమౌళి, ప్రియాంక చోప్రాతో అక్కడి అభిమానులకు ఫోటోలు ఇవ్వడంతో.. అవి కాస్త వైరల్ అయ్యాయి.
ఇప్పటికే రెండు షెడ్యూల్ షూటింగ్ పూర్తవగా.. త్వరలోనే మరో షెడ్యూల్ ప్రారంభం కానుంది. దీంతో ప్రస్తుతం షూటింగ్ నుంచి కొంచెం బ్రేక్ తీసుకున్న మహేష్ బాబు.. ఫ్యామిలీతో టైమ్ స్పెండ్ చేస్తున్నారు. ఈ సినిమా కోసం మహేష్ సరికొత్త లుక్‌లోకి మారాడు. జుట్టు పెంచి గుబురు గడ్డంతో, జిమ్‌లో వర్కౌట్ చేసి మరింత ఫిట్ అయ్యాడు. దీంతో ఆయన లుక్ సినిమాలో ఎలా ఉండబోతుంది అనే హాట్ టాపిక్ నడుస్తోంది.

ఈ క్రమంలోనే రీసెంట్ గా తన కూతురు సితారతో కలిసి ఎయిర్ పోర్టులో పాస్ పోర్టు చూపించిన పిక్స్ ఫుల్ ట్రెండ్ అయ్యాయి. అయితే అప్పుడు క్యాప్ పెట్టుకొని ఫేస్ మొత్తం రివీల్ అవ్వకుండా జాగ్రత్త పడ్డారు మహేష్ బాబు. అయితే ఇప్పుడు లేటెస్ట్ గా మరోసారి ఆయన ఫోటోలు సోషల్ మీడియాలో ఫుల్ గా చక్కర్లు కొడుతున్నాయి. ఈసారి క్యాప్ లేకుండానే ఫేస్ రివీల్ అవడంతో ఫ్యాన్స్ ఫుల్ ఖుషి అవుతూ ఆ ఫోటోను తెగ షేర్ చేస్తున్నారు.
వైరల్ గా మారిన మహేష్ బాబు పిక్స్ గమనిస్తే.. తన భార్య నమ్రత శిరోద్కర్ తో కలిసి ఎవరితోనో మాట్లాడుతున్నట్టు కనిపిస్తున్నారు. టి-షర్టు, షార్ట్ లో ఉన్న మహేష్.. పొడవైన జుత్తు, గుబురు గడ్డంతో కనిపించాడు. దీంతో మహేష్ బాబును సింహంతో కంపేర్ చేస్తూ అభిమనులంతా కామెంట్స్ చేస్తున్నారు. హెయిర్ స్టైల్, లుక్ చూస్తుంటే వేటకు సిద్దమైన సింహం లాగా ఉన్నావ్ అన్నా అంటూ కామెంట్స్ పోస్టులు పెడుతున్నారు.
Waah Mahesh Babu ❤️🔥
— Siva DHFM (@sivadhfmforever) April 29, 2025
Hollywood jathini *engooooo#SSMB29#maheshbabu pic.twitter.com/hu8DG7bVyg












Click it and Unblock the Notifications