santosham awards: గోవాలో టాలీవుడ్ పరువు తీసిన సురేష్ కొండేటి?

సీనియర్ సినిమా జర్నలిస్ట్, 'సంతోషం' మ్యాగజైన్ వ్యవస్థాపకుడు సురేష్ కొండేటి చాలా ఏళ్లుగా సంతోషం సౌత్ ఇండియన్ ఫిల్మ్ అవార్డ్స్ పేరిట తెలుగు, తమిళం, కన్నడ, మలయాళ సినీ పరిశ్రమలకు చెందిన వారికి పురస్కారాలు ఇస్తున్నారు. అవార్డుల ఫంక్షన్ ఎక్కువగా హైదరాబాద్‌లోనే జరిగేది. మిగిలిన మూడు ఇండస్ట్రీలకు చెందిన సినీ తారలు ఇక్కడికే వచ్చేవారు. ఈసారి మాత్రం అవార్డులు గోవాలో పెట్టారు. వాటిని తీసుకోవడానికి తెలుగు, తమిళం, కన్నడ, మళయాళ పరిశ్రమల నుంచి తారలు గోవా వెళ్లారు.

అవార్డుల వేడుల్లో పాల్గొన్న కన్నడ సినీ నటులకు అవమానం జరిగిందని ఓ కన్నడ సినీ జర్నలిస్ట్ శారద సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు. హోటల్‌లో రూమ్‌లు లేవని, దీంతో చాలామంది తారలు రిసెప్షన్ ఏరియాలో ఉండిపోయారంటూ అందుకు సంబంధించిన కొన్ని వీడియోలను కూడా బయటపెట్టారు. డిసెంబర్ 2న కార్యక్రమం జరిగే సమయంలో కన్నడ ఫిల్మ్ ఇండస్ట్రీ నుంచి అవార్డులు తీసుకుంటున్న తరుణంలో అకస్మాత్తుగా కార్యక్రమాన్ని ఆపేశారు. క్రాంతి, వేద సినిమాలకు ఒక్కొక్క అవార్డు ఇచ్చిన తర్వాత రమేష్ అరవింద్ అవార్డు తీసుకోవడానికి వేదిక మీదకు వెళ్లిన వెంటనే లైట్లు ఆగిపోయాయి. కన్నడ నటీనటులు వెళ్లిపోవాలంటూ యాంకర్ ప్రకటించారు.

suresh kondeti santhosham south indian film awards controversy in goa

మరో విషయం ఏమిటంటే.. కార్యక్రమానికి హాజరైన నటీనటులకు వసతి కూడా కల్పించలేదు. రమేష్ అరవింద్, బి.సురేష, శైలజా నాగ్, వాణి హరికృష్ణ, రాగిణి ద్వివేది, రాజవర్ధన్ రెడ్డి, సప్తమి గౌడ, హర్షతో పాటు మరికొంత మంది కన్నడ సినీ ప్రముఖులు హాజరయ్యారు. అవార్డులు ఇచ్చిన నిర్వాహకులు వీరి హోటల్ బిల్లులు చెల్లించకపోవడంతో హోటల్ యాజమాన్యం వీరి గదులకు తాళాలు వేసి బయటకు పంపేసింది. చివరకు పోలీసుల సహాయంతో వీరంతా విమానాశ్రయానికి చేరుకోవాల్సి వచ్చింది.

ఈ విషయాలన్నింటినీ శారద తన పోస్ట్ లో పేర్కొన్నారు. ఈ వివాదంపై కన్నడ సినీ ప్రేమికులు సురేష్ కొండేటిపై మండిపడుతున్నారు. దీనికి స్పందించిన సురేష్ కొంతమంది కావాలనే తనపై బురద జల్లుతున్నారని ఆరోపించారు. చిన్న చిన్న పొరపాట్లు జరగడం సహజమేనని, సెలబ్రిటీలకు గదులు సర్దుబాటు చేయడంలో ఇబ్బంది జరిగిందని, అది కావాలని చేసింది కాదని అందరూ అర్థం చేసుకోవాలని సురేష్ ట్వీట్ చేశారు.ఈ రచ్చపై మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ స్పందించారు. తెలుగు సినీ పరిశ్రమకు ఈ అవార్డుల ఫంక్షన్ తో సంబంధం లేదని, వ్యక్తిగతంగా జరిగిన కార్యక్రమాన్ని పరిశ్రమకు ఆపాదించడం సరికాదన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+