రెడ్ డ్రెస్‌లో సెగలు పుట్టించిన తమన్నా.. సోనమ్ బజ్వాతో కలిసి క్రేజీ డాన్స్! (వీడియో)

న్యూ ఇయర్ 2026కు గోవా అత్యంత ఉత్సాహంగా స్వాగతం పలికింది. బాగా బీచ్‌లోని ఓ ప్రముఖ క్లబ్‌లో జరిగిన వేడుకలు సినీ తారల తళుకులతో మెరిసిపోయాయి. ముఖ్యంగా టాలీవుడ్ మిల్కీ బ్యూటీ తమన్నా భాటియా, పంజాబీ స్టార్ సోనమ్ బజ్వా తమ డ్యాన్స్‌తో స్టేజ్‌పై మంటలు పుట్టించారు.

స్టేజ్‌పై తమన్నా తళుకులు
మిల్కీ బ్యూటీ తమన్నా భాటియా తనదైన ఎనర్జీతో స్టేజ్ పైకి వచ్చిన ప్రేక్షకుల మనస్సులను కొల్లగొట్టింది. రెడ్ డ్రెస్‌లో మెరిసిపోతూ తన సూపర్ హిట్ పాటలకు స్టెప్పులేస్తూ కుర్రకారు హృదయాలను దోచేసింది. తమన్నా డ్యాన్స్ చూసి అభిమానులు కేరింతలు కొట్టారు. తమన్నా పర్ఫార్మెన్స్‌కు సంబంధించిన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి.

Tamannaah and Sonam Bajwa Set the Stage on Fire with Dance at Goa New Year 2026 Party

ప్రేక్షకులను అలరించిన సోనమ్ బజ్వా
తమన్నాతో పాటు సోనమ్ బజ్వా కూడా తన గ్లామర్, డ్యాన్స్ మూవ్స్‌తో ప్రేక్షకులను ఆకట్టుకుంది. వీరిద్దరి కాంబినేషన్ స్టేజ్ పై కొత్త ఉత్సాహాన్ని నింపింది. వీరిద్దరి డాన్స్ పర్ఫార్మెన్స్ ఆ రాత్రికి హైలైట్‌గా నిలిచింది.

లైవ్ మ్యూజిక్, సెలబ్రిటీల సందడి
ఈ పార్టీలో కేవలం ఈ ఇద్దరు భామలే కాకుండా, ప్రముఖ సింగర్ మిలింద్ గాబా లైవ్ పర్ఫార్మెన్స్ ఇచ్చారు. డీజే చేత్జ్, స్వప్నిల్, మాక్ వియెరా తమ సంగీతంతో 2026 తొలి కిరణాలు వచ్చే వరకు ప్రేక్షకులను డాన్స్ ఫ్లోర్ పైనే ఉండేలా చేశారు.

ప్రపంచవ్యాప్తంగా సందడి
ఒకవైపు గోవాలో ఇలాంటి వేడుకలు జరుగుతుంటే, మరోవైపు న్యూయార్క్ నగరంలోని టైమ్స్ స్క్వేర్ వద్ద 'బాల్ డ్రాప్' వేడుకతో వేలాది మంది ప్రజలు 2026కు గ్రాండ్‌గా వెల్‌కమ్ చెప్పారు. కటిక చలిలో కూడా ప్రజలు భారీ సంఖ్యలో తరలివచ్చి ఈ వేడుకను ఎంజాయ్ చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+