Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

సొంతింట్లోనే నరకంగా ఉంది.. ఏడ్చేసిన హీరోయిన్

Tanushree Dutta: 2018లో బాలీవుడ్‌లో మీటూ ఉద్యమానికి తెరలేపిన నటి తనుశ్రీ దత్తా మంగళవారం ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక ఆందోళన కలిగించే వీడియోను పంచుకున్నారు. ఆ వీడియోలో ఆమె కన్నీళ్లు పెట్టుకుంటూ సహాయం కోసం వేడుకుంటున్నారు. గత 4-5 ఏళ్లుగా తన ఇంట్లోనే వేధింపులకు గురవుతున్నానని ఆమె ఆరోపించారు. తనుశ్రీ దత్తా పోలీసుల జోక్యాన్ని కూడా కోరారు.

ఏం జరుగుతోంది?
తనుశ్రీ దత్తా ఆ వీడియోలో ఆవేదనతో ఇలా ఇలా అన్నారు: "స్నేహితులారా, నన్ను నా ఇంట్లోనే వేధిస్తున్నారు. నేను ఇప్పుడే పోలీసులకు ఫోన్ చేశాను. పోలీసులు వచ్చారు. సరైన ఫిర్యాదు చేయడానికి పోలీస్ స్టేషన్‌కు రమ్మని అడిగారు. నేను బహుశా రేపు లేదా ఎల్లుండి వెళ్తాను. నాకు ఆరోగ్యం బాగాలేదు. గత 4-5 సంవత్సరాలుగా నేను చాలా వేధింపులకు గురయ్యాను. నా ఆరోగ్యం క్షీణించింది. పని మనుషులను కూడా పెట్టుకోలేకపోతున్నాను. నా ఇల్లు పూర్తిగా చిందరవందరగా ఉంది. కొందరు పనిమనిషిలా వచ్చి నా వస్తువులను దొంగిలించారు. నేనే అన్ని పనులు చేసుకోవాల్సి వస్తోంది. నా సొంత ఇంట్లోనే నన్ను ఇబ్బంది పెడుతున్నారు. ఈ వేధింపుల వల్ల తీవ్ర మానసిక ఒత్తిడి, ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నాను." అని తనుశ్రీ దత్తా ఆవేదన వ్యక్తం చేశారు.

Tanushree Dutta Shares Emotional Video Seeking Help Amid Harassment at Home

దయచేసి.. ఎవరైనా నాకు సహాయం చేయండి: తనుశ్రీ దత్తా
ఆ వీడియోకు క్యాప్షన్‌లో తనుశ్రీదత్తా ఇలా రాసుకొచ్చారు. "ఈ వేధింపులతో నేను విసిగిపోయాను!! ఇది 2018 #metoo నుంచి జరుగుతోంది. ఈరోజు విసుగెత్తి పోలీసులకు కాల్ చేశాను. దయచేసి ఎవరైనా నాకు సహాయం చేయండి! చాలా ఆలస్యం కాకముందే ఏదైనా చేయండి." అని తనుశ్రీ దత్తా రాశారు. రెండో వీడియోలో తనుశ్రీ రోజూ రాత్రి తన ఇంటి దగ్గర వినిపించే పెద్దపెద్ద శబ్ధాలను రికార్డు చేసి షేర్ చేశారు. ఈ శబ్ధాలు తనను మానసికంగా వేధిస్తున్నాయని.. ప్రశాంతంగా ఉండనివ్వడం లేదని వెల్లడించారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారడంతో తనుశ్రీదత్తా అభిమానులు ఆమెకు మద్దతుగా నిలిచారు. ఒక స్టార్ ఇలాంటి సమస్యలు ఎదుర్కోవడం చూస్తే బాధగా ఉందని.. దోషులను శిక్షించాలని ఓ నెటిజన్ కామెంట్ చేశారు. తనశ్రీ దత్తాకు తక్షణ సాయం అందించాలని.. అధికారులు వెంటనే చర్యలు తీసుకోవాలని నెటిజన్లు కోరుతున్నారు.

మీటూ ఉద్యమంతో సంచలనం రేపిన తనుశ్రీ దత్తా
2018లో ఇచ్చిన ఒక జూమ్ ఇంటర్వ్యూలో, తనుశ్రీ 2009లో తన చిత్రం 'హార్న్ ఓకే ప్లీజ్' సినిమా కోసం ఒక ప్రత్యేక పాట చిత్రీకరణ సమయంలో నటుడు నానా పటేకర్ తనను లైంగికంగా వేధించారని ఆరోపించారు. అయితే నానా ఈ ఆరోపణలన్నింటినీ ఖండించారు. ఆమె మొదట 2008లో సినీ, టీవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్‌కు ఫిర్యాదు చేసి నటుడిపై ఆరోపణలు చేశారు. అయితే ఆ కేసు క్రిమినల్ కేసుగా పరిగణించబడినందున ఎటువంటి చర్య తీసుకోలేదు.2018 అక్టోబర్ 13న తనుశ్రీ దత్తా న్యాయవాది నితిన్ సాత్పూటే ముంబైలోని ఒషివారా పోలీస్ స్టేషన్‌లో నటుడు నానా పటేకర్, కొరియోగ్రాఫర్ గణేష్ ఆచార్య, నిర్మాత సమీ సిద్దిఖీ, దర్శకుడు రాకేష్ సారంగ్ నార్కో-ఎనాలిసిస్, బ్రెయిన్ మ్యాపింగ్, లై డిటెక్టర్ పరీక్షలు చేయించుకోవాలని ఒక దరఖాస్తును సమర్పించారు.2019 జూన్‌లో నానా పటేకర్‌ను పోలీసులు లైంగిక వేధింపుల ఆరోపణల నుంచి క్లీన్ చిట్ ఇచ్చారు. 2025 మార్చిలో ముంబై మేజిస్ట్రేట్ కోర్టు తనుశ్రీ ప్రొటెస్ట్ పిటిషన్‌ను కూడా తిరస్కరించింది. ఆరోపణలు 2008 నాటివి కావడంతో చట్టపరమైన గడువు ముగిసిందని న్యాయస్థానం పేర్కొంది.

తనుశ్రీ దత్తా ఆషిక్ బనాయా ఆప్నే, ధోల్, భాగం భాగ్ వంటి చిత్రాలలో నటించారు. ఆమె ఫెమినా మిస్ ఇండియా యూనివర్స్ 2004 టైటిల్‌ను కూడా గెలుచుకున్నారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+