Ramya Krishna : అడ్డంగా దొరికిపోయిన రమ్యకృష్ణ
నటి రమ్యకృష్ణకు ఎంతటి ఫాలోయింగ్ ఉందో అందరికి తెలిసిన విషయమే. ఒకప్పుడు హీరోయిన్‌గా, ఇప్పుడు క్యారెక్టర్ ఆరిస్టుగా రాణిస్తుందామె. ముఖ్యంగా బాహుబలి సినిమా తరువాత రమ్యకృష్ణ ఫాలోయింగ్ అమాంతం పెరిగిపోయింది. మొదటి నుంచి వివాదాలకు దూరంగా ఉంటున్న రమ్యకృష్ణ.. ఇటీవలే ఏపీ మంత్రి రోజాకు మద్దతుగా నిలిచి వార్తల్లో నిలిచారు.
టీడీపీ మాజీ మంత్రి బండారు సత్యనారాయణ మంత్రి రోజాపై చేసిన అనుచిత వ్యాఖ్యలను నటి రమ్యకృష్ణ ఖండించారు. బండారు సత్యనారాయణ చేసిన కామెంట్స్‌కు రమ్యకృష్ణ కౌంటరిచ్చారు. సమాజంలో మహిళలను గౌరవించడం నేర్చుకోవాలని హితవు పలికారామె. దీనిపై టీడీపీ నాయకులు కూడా రమ్యకృష్ణకు ధీటుగానే బదులిస్తున్నారు.

గతంలో తమ నాయకుల గురించి రోజా ఏం మాట్లాడారో తెలుసుకోవాలని హితవు పలుకుతున్నారు. ఇదిలా ఉంటే గతంలో రమ్యకృష్ణకు సంబంధించిన పాత వీడియోను మళ్లీ తెర మీదకు తీసుకువచ్చి టీడీపీ సోషల్ మీడియా వైరల్ చేస్తుంది. గతంలో చైన్నైలో మద్యం బ్యాన్ ఉన్న సమయంలో నటి రమ్యకృష్ణ ఓ వివాదంలో చిక్కుకున్నారు.
రమ్యకృష్ణ గారు ఇలాంటి వారు అని ఎప్పుడూ అనుకోలేదు 😭😭 pic.twitter.com/0wxZOuvANZ
— TDP Germany (@TDP_Germany) October 8, 2023
ఆ సమయంలో భారీ ఎత్తున మద్యం సీసాలతో రమ్యకృష్ణ దొరికిపోయారు.తనిఖీల్లో భాగంగా రమ్యకృష్ణ కారులో మద్యం బాటిళ్లను గుర్తించారు. మహాబలిపురం నుంచి మద్యాన్ని తీసుకువస్తున్నట్టు గుర్తించిన అధికారులు... రమ్యకృష్ణ కారు డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్నారు. అప్పట్లో ఈ వార్త సంచలనంగా మారింది. రమ్యకృష్ణ పాత వీడియోను టీడీపీ సోషల్ మీడియా ఇప్పుడు వైరల్ చేస్తుంది. మంత్రి రోజాకు మద్దతుగా నిలిచినందుకే రమ్యకృష్ణపై ఇలాంటి పోస్టులు పెడుతున్నారని వైసీపీ ఆరోపిస్తుంది.












Click it and Unblock the Notifications