16 కోట్లు ఖర్చు పెడితే 450 కోట్లు వసూలు ..చరిత్ర సృష్టించిన తెలుగు సినిమా
దర్శక ధీరుడు రాజమౌళి ఏ మూహార్తనా బహుబలి సినిమా తీశారో తెలియదు కానీ, ఈ సినిమా దగ్గర నుంచి పార్ట్ 1, పార్ట్2లు అంటూ సినిమాలను రెండు భాగాలుగా తెరకెక్కిస్తున్నారు. బహుబలి, బహుబలి-2, కేజీఎఫ్, కేజీఎఫ్-2, పుష్ప, పుష్ప-2, దేవర, దేవర-2 వంటి సినిమాలు తెరకెక్కిన సంగతి తెలిసిందే. మొదటి పార్ట్ హిట్ అయితే చాలు, రెండో పార్ట్‌ను అనౌన్స్ చేస్తున్నారు. సాధారణంగా మొదటి పార్ట్‌కు కంటిన్యూ చేస్తూ రెండో పార్ట్‌ను తీయడానికి ఆసక్తి చూపిస్తుంటారు.
కానీ విచిత్రంగా ఓ సినిమా రెండో పార్ట్ విడుదలైన తర్వాత , మొదటి పార్ట్‌ను తెరకెక్కిస్తున్నారు. ఆ సినిమా మరేదో కాదు.. కన్నడ హీరో నటించి దర్శకత్వం వహించిన కాంతార. 2023లో వచ్చిన ఈ సినిమా బ్లాక్ బ్లాస్టర్ హిట్‌గా నిలిచింది. కాంతార సినిమా కన్నడ చిత్ర పరిశ్రమలోనే కాకుండా దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ప్రకృతి, సంప్రదాయాలు, మత విశ్వాసాలు, మనిషి అహంకారం వంటి విషయాలను అద్భుతంగా తెరకెక్కించిన ఈ చిత్రం ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. రిషబ్ శెట్టి నటన అద్భుతంగా ఉంది. తన పాత్రకు పూర్తి న్యాయం చేశాడు. అజనీష్ లోక్‌నాథ్ సంగీతం కథకు మరింత బలం చేకూర్చింది.

ముఖ్యంగా 'వరహా రూపం' పాట ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. ఈ సినిమాకు 16 కోట్లు ఖర్చు పెట్టగా, 450 కోట్లకుపైగానే కలెక్ట్ చేసింది ఈ సినిమా. రిషబ్ శెట్టి దర్శకుడిగా కూడా తన ప్రతిభను చాటుకున్నారు. ఈ సినిమా సూపర్ హిట్ కావడంతో, అసలు ఈ సినిమాకు మూలం అయిన కథను మొదటి పార్ట్‌గా తెరకెక్కిస్తున్నారు. "కాంతార 2" కథ మొదటి భాగం కథకు ముందు జరిగే కథగా ఉంటుంది. ఈ సినిమా కన్నడతో పాటు పాన్ ఇండియా రేంజ్‌లో విడుదల కానుంది."కాంతార" మొదటి భాగం భారీ విజయం సాధించింది. దీనికి తగ్గట్టుగా "కాంతార 2" కూడా భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతోంది. ఈ సినిమా కోసం హాలీవుడ్ స్టంట్ టెక్నీషియన్లు పనిచేస్తున్నారు.ఈ సినిమా అక్టోబర్ 2, 2025న విడుదల కానుంది.












Click it and Unblock the Notifications