అమెరికాలో తెలుగు హీరో, హీరోయిన్ వెధవ పనులు
తెలుగు చలనచిత్ర పరిశ్రమలో అతనొక హీరో. మొదట కొన్ని సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు చేసిన తర్వాత వరుసగా హిట్లు పడటంతో తక్కువ టైంలోనే స్టార్ ఇమేజ్ ను సొంతం చేసుకున్నాడు. లాస్ట్ మూడు సినిమాల నుంచి మాత్రం విజయం దక్కలేదు. చేతిలో పెద్ద పెద్ద ప్రాజెక్టులే ఉన్నాయి. మరికొన్ని పెద్ద ప్రాజెక్టులు ఈ హీరోను వెతుక్కుంటూ వస్తున్నాయి. ప్రస్తుతం ఓ పెద్ద బ్యానర్ లో సినిమా చేస్తున్నాడు. ఆ బ్యానర్ లో సినిమా చేస్తే కచ్చితంగా బ్లాక్ బస్టర్ అవుతుందనే నమ్మకం ఉంది.
ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్న చిత్రం కచ్చితంగా భారీ విజయాన్ని ఇవ్వబోతోందని ఆ హీరో అభిమానులు భావిస్తున్నారు. కొద్దిరోజుల క్రితం ఈ సినిమా షూటింగ్ కోసం చిత్ర బృందం అమెరికా వెళ్లింది. సాధారణంగా షూటింగ్ ఆలస్యమై ఎక్కువరోజులుగా ఉండాల్సి వస్తే నిర్మాతకు ఖర్చు తడిసి మోపడవుతుంది. సరిగ్గా ఇలాగే జరిగింది. రోజురోజుకు బడ్జెట్ పెరిగిపోతూనే ఉంది. హీరోగారు షూటింగ్ కు రావడంలేదు.

అక్కడి స్టార్ హోటల్ లో ఉండి చిల్ అవ్వడానికి మాత్రమే ఇంట్రెస్ట్ చూపిస్తున్నాడని తెలుస్తోంది. తాను షూటింగ్ కు వెళ్లకుండా, తనతోపాటు హీరోయిన్ ను కూడా షూటింగ్ కు వెళ్లనివ్వకుండా చేస్తున్నాడంట. ఆమెతో కలిసి ఎంజాయ్ చేస్తున్నాడు. నిర్మాత ఫోన్లమీద ఫోన్లు చేసి గోలపెడుతున్నా ఆ హీరో, హీరోయిన్ పట్టించుకోవడంలేదు. దీంతో నిర్మాతకు ఒళ్లు మండిపోయి దేశానికి తిరిగివచ్చేశాడు. మరోపక్క దర్శకుడు అక్కడే ఉండి ఎలాగైనా ఈ సినిమా షెడ్యూల్ ను పూర్తిచేయాలని చూస్తున్నాడు. దీనికోసం ఆ హీరోను, హీరోయిన్ ను బతిమలాడుకుంటున్నాడని సమాచారం. ఇలాంటివాళ్లా.. సినిమాల్లో హీరో, హీరోయిన్లుగా నటిస్తూ అభిమానులను సొంతం చేసుకునేది? అంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.












Click it and Unblock the Notifications