ఎప్పటికైనా అలాంటి పాత్ర చేయాలంటున్న తెలుగు హీరోయిన్ 'వైష్ణవి చైతన్య'..

వైష్ణవి చైతన్య.. షార్ట్ ఫిలిమ్స్ తో కెరీర్ మొదలుపెట్టిన ఈ ముద్దుగుమ్మ.. ఆ తర్వాత వెబ్ సిరీస్ లతో పాపులర్ అయింది. షార్ట్ ఫిలిమ్స్ సమయంలోనే తన నటనకి, అందానికి అంతా ఫిదా అయ్యారు. సిరీస్ లు చేస్తున్న సమయంలోనే క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా అవకాశాలు రావడం తో సినిమాల్లో నటించడం మొదలుపెట్టింది. అల్లు అర్జున్, నాని, అజిత్ లాంటి స్టార్ హీరోల సినిమాల్లో వైష్ణవి చైతన్య నటించి మెప్పించింది. ఇక సాయి రాజేష్ దర్శకత్వంలో ఆనంద్ దేవరకొండ హీరోగా వచ్చిన 'బేబీ' సినిమాలో హీరోయిన్ గా నటించి ఓవర్ నైట్ లోనే స్టార్ హీరోయిన్ అయిపోయింది ఈ తెలుగు అమ్మాయి.

మొదటి సినిమాలోనే ఇంటిమేట్ సీన్ లో సైతం నటించి యువతను మెప్పించింది. ఆమె నటనకు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కూడా ప్రశంసలు కురిపించారు. ఆ సమయంలోనే తెలుగమ్మాయిలను ఇండస్ట్రీకి రావాలని తెలిపారు. ప్రస్తుతం 'బొమ్మరిల్లు' భాస్కర్, సిద్ధూ జొన్నలగడ్డ కాంబినేషన్లో రాబోతున్న 'జాక్' మూవీలో నటిస్తుంది. ఇప్పటికే రిలీజ్ అయిన పోస్టర్స్, టీజర్, ట్రైలర్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి. ఈ క్రమంలోనే నిర్వహించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ లో తెలుగు అమ్మాయిలు చిత్ర పరిశ్రమలోకి రావడం గురించి వైష్ణవి చైతన్య చేసిన కామెంట్స్ సర్వత్రా చర్చనీయాంశంగా మారాయి.

telugu-heroine-vaishnavi-chaitanya-shocking-comments-on-telugu-actress

వైష్ణవి చైతన్య మాట్లాడుతూ.. తెలుగు ఇండస్ట్రీలో తెలుగు అమ్మాయిలకు అవకాశాలు రావు అనే ప్రచారం ఎందుకు వచ్చిందో తెలియదన్నారు. కానీ ఈ ప్రచారం వల్లే చాలామంది అమ్మాయిలు ఇండస్ట్రీకి రావడానికి భయపడుతున్నారని వ్యాఖ్యానించారు. అసలు ప్రయత్నమే చేయకుండా అవకాశాలు రావడం లేదంటే అది ఎంతవరకు కరెక్ట్.. ఓపికతో ప్రయత్నిస్తేనే కదా అవకాశాలు వస్తాయో లేదో తెలిసేదని చెప్పుకొచ్చారు. అందుకు ఉదాహరణ తానే అని కొత్తగా వచ్చే వారికి ఇచ్చే సలహా కూడా ఒకటే అని.. అవకాశాలు రావు అని భయపడే బదులు గట్టిగా ప్రయత్నిస్తే, అవే అవకాశాలు మీ ఇంటి తలుపు తడతాయి అంటూ వెల్లడించారు.

అలాంటి పాత్ర చేయాలని ఉంది..

ఇంకా లానే మాట్లాడుతూ అలియా భట్ నటించిన గంగూభాయి కతియావాడి సినిమా తనకు చాలా ఇష్టం అని వెల్లడించింది. అలియా భట్ నటనకు ఫిదా అయిపోయానని.. ఆ పాత్రకు ఆమె ప్రాణం పోసిందని తెలిపింది. భవిష్యత్తులో తనకు కూడా అలాంటి పాత్రలు చేయాలని ఎంతో ఆశగా ఉందన్నారు.

మరోవైపు కొద్ది రోజుల క్రితం ఎస్‌కేఎన్ మాట్లాడుతూ.. తెలుగులో తెలుగు వచ్చిన అమ్మాయిల కంటే తెలుగు రాని అమ్మాయిల్నే ఎక్కువగా ప్రేమిస్తుంటారు.. తెలుగమ్మాయిల్ని ఎంకరేజ్ చేస్తే ఏం జరుగుద్దో మాకు తెలిసి వచ్చింది. అందుకే ఇకపై తెలుగు రాని అమ్మాయిల్నే సపోర్ట్ చేయాలని నేను, సాయి రాజేష్ ఫిక్స్ అయ్యాం అంటూ ఎస్‌కేఎన్ వ్యాఖ్యానించారు. ఆ తర్వాత ఆయన చేసిన కామెంట్స్ వివాదాస్పదంగా మారడంతో ఓ వీడియోను సోషల్ మీడియా వేదికగా రిలీజ్ చేశారు. ఆ వీడియోలో ఆయన మాట్లాడుతూ.. తెలుగు అమ్మాయిల గురించి తాను చేసిన వ్యాఖ్యలను తప్పుగా అర్థం చేసుకున్నారని తెలిపారు. ఇప్పటికే దాదాపు ఎనిమిది మందిని తెలుగు వారిని వెండితెరకు పరిచయం చేశానని వెల్లడించారు. భవిష్యత్తులో మరో 25 మందిని ప్రతిభావంతులైన తెలుగమ్మాయిలను టాలీవుడ్‌కు పరిచయం చేయనున్నట్లు వెల్లడించారు. ఆ సమయంలో ఆయన చేసిన కామెంట్స్ వైష్ణవి గురించే అని హాట్ టాపిక్ నడిచింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+