మార్చిలో ఓటీటీ లవర్స్ కు పండగే.. టాప్ తెలుగు మూవీస్ అన్నీ ఈనెలలోనే..!

ప్రస్తుతం ఓటీటీ, వెబ్ సిరీస్ ల జోరు కొనసాగుతోంది. ఎప్పటిలాగే ఈ వారంలో కూడా రిలీజ్ అయ్యే సినిమాల కోసం మూవీ లవర్స్ ఎదురుచూస్తూ ఉన్నారు. మరి ఈ మార్చిలో రానున్న బ్లాక్ బస్టర్ తెలుగు సినిమాలపై ఓ లుక్కేయండి.

బ్లాక్ బస్టర్ పొంగల్..

విక్టరీ వెంకటేష్ లేటెస్ట్ బ్లాక్ బస్టర్ మూవీ "సంక్రాంతికి వస్తున్నాం" మార్చి 1న ఓటీటీలో రిలీజ్ కానుంది. ఈ మూవీ జీ5లో స్ట్రీమింగ్ కానుంది. విశేషం ఏంటంటే.. అదే రోజు సాయంత్రం 6 గంటలకు జీ తెలుగు టెలివిజన్​ లోనూ ఈ మూవీ ప్రసారం కానుంది. సంక్రాంతి కానుకగా విడుదలైన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద రూ.300 కోట్లు పైగా కలెక్ట్ చేసి వెంకటేష్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. ఈ సినిమాలో వెంకటేష్ సరసన ఐశ్వర్య రాజేష్ మరియు మీనాక్షి చౌదరి నటించారు.

బుజ్జితల్లి వచ్చేది ఆరోజే..

యువసామ్రాట్ అక్కినేని నాగచైతన్య, డాన్సింగ్ క్వీన్ సాయి పల్లవి కాంబోలో వచ్చిన చిత్రం తండేల్. ఫిబ్రవరి 7న ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద సంచలన విజయం నమోదు చేసుకుంది. అయితే ఈ మూవీ ఓటీటీ రిలీజ్ పై అధికారిక ప్రకటన రాలేదు. కానీ మార్చి 7న ఓటీటీ రిలీజ్ అంటూ సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. అయితే ఈ సినిమాను తెలుగుతో పాటు తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో స్ట్రీమింగ్‍కు తీసుకొస్తామని ఇటీవల నెట్‍ఫ్లిక్స్ వెల్లడించింది. ఇక తండేల్ శాటిలైట్ రైట్స్ హక్కులను జీ తెలుగు ఛానెల్ సొంతం చేసుకుంది.

telugu latest blockbusters sankranthiki vasthunnam thandel movies releasing in ott in march

'లైలా' రిలీజ్..

విశ్వక్ సేన్, ఆకాంక్ష శర్మ జంటగా రామ్ నారాయణ్ దర్శకత్వంలో సాహు గారపాటి నిర్మించిన చిత్రం 'లైలా'. వాలంటైన్స్ డే సందర్భంగా ఫిబ్రవరి 14న సినిమా రిలీజైంది. అయితే నెగిటివ్ టాక్ తెచ్చుకుని ప్లాఫ్ గా నిలిచింది. ఈ సినిమా ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ కి రానుంది. త్వరలో లైలా ఓటీటీ ప్రీమియర్ డేట్ అనౌన్స్ చేసే అవకాశం ఉంది.

'మజాకా' ఓటీటీ:

టాలీవుడ్ యంగ్ యాక్టర్ సందీప్ కిషన్ 'మజాకా' మూవీ శివరాత్రి ఫిబ్రవరి 26న సందర్భంగా రిలీజై బాక్సాఫీస్ వద్ద యావరేజ్ గా నిలించింది. ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ ఓటీటీ ప్లాట్‍ఫామ్ జీ5 సొంతం చేసుకుంది. ఈ మూవీ మార్చి లాస్ట్ వీక్ లో ఓటీటీలోకి వచ్చే అవకాశం ఉంది.

బ్రహ్మాజీ 'బాపు' :

బ్రహ్మాజీ లీడ్ రోల్‌‌లో నటించిన చిత్రం 'బాపు'. ఆమని, బలగం సుధాకర్ రెడ్డి, ధన్య బాలకృష్ణ, మణి ఏగుర్ల, అవసరాల శ్రీనివాస్ కీలక పాత్రలు పోషించారు. ఈ సినిమాకు దయా దర్శకత్వం వహించారు. ఫిబ్రవరి 21న సినిమా విడుదలై మంచి ఆదరణ దక్కించుకుంది. తెలంగాణ విలేజ్ బ్యాక్‍డ్రాప్‍లో రూపొందిన ఈ మూవీ మార్చి సెకండ్ వీక్ లో స్ట్రీమింగ్ కు వచ్చే అవకాశం ఉంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+