గర్భవతైన ప్రముఖ సింగర్..సోషల్ మీడియాలో పోస్ట్ వైరల్

టాలీవుడ్‌లో చాలామంది మహిళ సింగర్స్ ఉన్నప్పటికీ.. వారందరి కన్నా ప్రముఖ సింగర్ గీతా మధురికి మాత్రం ప్రత్యేకమైన క్రేజ్ సంపాదించుకున్నారనే చెప్పాలి. తన హస్కీ వాయిస్‌తో ఎన్నో పాటలకు జీవం పోశారామె. ముఖ్యంగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తొలి సినిమా 'చిరుత'లో 'చమ్కా చమ్కా' సాంగ్‌తో తెలుగు ప్రేక్షకులను తనవైపు తిప్పుకునేలా చేశారు.

ఈ సాంగ్ తరువాత గీతా మధురి కెరీర్ ఒక్కసారిగా మారిపోయింది. ఇదే సమయంలో ఆమె ప్రముఖ నటుడు నందుని ప్రేమించి పెళ్లి చేసుకున్నారు.అయితే గత కొద్దిరోజులుగా గీతా మధురి - నందు మధ్య విభేదాలు చోటు చేసుకున్నాయని..వీరిద్దరు విడాకులు తీసుకోబోతున్నారంటూ అనేక వార్తలు వచ్చాయి. ఈ వార్తలకు తగ్గట్టుగానే ఈ జంట బయట ఎక్కడా కూడా కనిపించలేదు.

Telugu Popular singer is pregnant..post viral on social media

ఆ మధ్య నందు -యాంకర్ రష్మీ హీరో, హీరోయిన్లుగా నటించిన 'బొమ్మ బ్లాక్ బ్లాస్టర్' సినిమా విడుదల సమయంలో కూడా గీతా మధురి బయటకు రాకపోవడంతో .. ఈ జంట విడాకులు తీసుకుంటున్నారనే అందరు భావించారు.తమ విడాకులపై వస్తున్న వార్తలపై ఇటీవలే నందు స్పందించారు. గీతా మధురితో తనకు ఎలాంటి విభేదాల్లేవని ఆయన క్లారిటీ ఇచ్చారు. మీడియలో వస్తున్న వార్తలు చూసి తాము కూడా నవ్వుకున్నామని నందు తెలిపారు.

తాజాగా ఈ జంట గుడ్ న్యూస్ చెప్పారు. తాను మరోసారి తల్లిని కాబోతున్నానంటూ ప్రకటించి గీతా మధురి అందరికీ సర్‌ప్రైజ్ ఇచ్చింది. వచ్చే ఏడాది దాక్షాయని అక్క కాబోతుదంటూ తన సోషల్ మీడియా అకౌంట్‌లో ఫ్యామిలీ ఫొటోను పోస్ట్ చేసింది. గీతా మధురికి ఇప్పటికే ఓ కూతురు ఉందనే విషయం అందరికి తెలిసిందే. గీతా మధురి - నందు జంటకు సినీ ప్రముఖులు, బుల్లితెర నటులు, నెటిజన్లు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+