రిలీజ్ డేట్ మార్చుకున్న దేవర.. వాయిదా పడ్డ పుష్ప2
యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం దేవర. వాస్తవానికి ఈ సినిమా ఏప్రిల్ ఐదోతేదీనే విడుదల కావాల్సి ఉంది. అయితే సంగీత దర్శకుడు అనిరుధ్ రవిచందర్ స్వరాలందించడంలో ఆలస్యం కావడంతో అక్టోబరు 10వ తేదీన విజయదశమి సందర్భంగా విడుదల తేదీని చిత్ర యూనిట్ ప్రకటించింది. అయితే ఈ సినిమా విడుదల తేదీని మరోసారి మార్చారు. రెండువారాలు ముందుకు జరిపి సెప్టెంబరు 27వ తేదీకి తీసుకొచ్చారు. ఇలా తేదీని ముందుకు తీసుకురావడంవల్ల ఏ సినిమాతోను పోటీ ఉండదని, సింగిల్ సినిమాగా కలెక్షన్లు భారీగా కొల్లగొట్టొచ్చని దేవర టీమ్ అంచనా వేస్తోంది.
ఓజీ వాయిదా పడటంతో..
సెప్టెంబరు 27వ తేదీన సుజిత్ దర్శకత్వంలో పవన్ కల్యాణ్ నటిస్తున్న ఓజీ సినిమా విడుదల కావాల్సి ఉంది. అయితే ఆ సినిమా షూటింగ్ ఆలస్యం కావడంతో వచ్చే ఏడాదికి మార్చారు. దీంతో సెప్టెంబరు 27పై దేవర కర్చీఫ్ వేసింది. జాన్వీకపూర్ కథానాయికగా నటిస్తున్న ఈ సినిమాకు కొరటాల శివ దర్శకుడు. పాన్ ఇండియా సినిమాగా తెలుగు, తమిళం, కన్నడం, మళయాళం, హిందీలో ఒకేసారి విడుదల కాబోతోంది.

రాజీపడని సుకుమార్
అల్లు అర్జున్ కథానాయకుడిగా నటిస్తున్న పుష్ప2 చిత్రంపై మొదటి నుంచి అంచనాలు భారీగా ఉన్నాయి. ఈ సినిమాను ఈ ఏడాది ఆగస్టు 15వ తేదీన విడుదల చేయనున్నట్లు నిర్మాతలు ప్రకటించారు. అయితే పుష్ప2కు సంబంధించిన వీఎఫ్ఎక్స్ పనులపై దర్శకుడు సుకుమార్ రాజీపడటంలేదని తెలుస్తోంది. దీంతో సినిమా విడుదల వాయిదా పడినట్లేనని సోషల్ మీడియాలో వార్త వైరలవుతోంది. రష్మిక, ఫహాద్ ఫాజిల్.. తదితరులు నటిస్తున్న ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ దాదాపు రూ.400 కోట్ల భారీ బడ్జెట్ తో రూపొందిస్తోంది. షూటింగ్ కూడా అనుకున్న సమయానికింటే ఎక్కువగానే పట్టే అవకాశం ఉందంటున్నారు. ఈ రెండు కారణాలు కలిసి సినిమా విడుదలను వాయిదా వేయించేలా ఉన్నాయంటున్నారు.












Click it and Unblock the Notifications