అరవింద్‌స్వామి ఎన్ని వేలకోట్లకు అధిపతో తెలుసా?
అమ్మాయిల కలల రాకుమారుడు అరవింద్ స్వామి గురించి ప్రత్యేక పరిచయం అవసరంలేదు. దర్శక దిగ్గజం మణిరత్నం తన రోజా సినిమాద్వారా అరవింద్ స్వామిని సినీ పరిశ్రమకు పరిచయం చేశారు. అప్పట్లోనే ఈ సినిమా సంచలన విజయాన్ని నమోదు చేసింది. దేశవ్యాప్తంగా ఉన్న సినీ ప్రియులందరినీ ఈ సినిమా బాగా ఆకట్టుకుంది. ఆ సినిమాతో బాబా ప్రాచుర్యం పొందిన అరవింద్ వరుసగా సినిమాల్లో నటించారు. రోజాతోపాటు బాంబే, దళపతి.. తదితర సినిమాలు చేశారు.
వ్యాపారాలపై దృష్టి
వ్యాపారంపై దృష్టిపెట్టేందుకు హఠాత్తుగా సినిమాల నుంచి దూరమయ్యారు. ఆ సమయంలోనే రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. అక్కడి నుంచి చాలా కష్టంగా కోలుకున్నారు. ఇలా కోలుకునే క్రమంలో ఎన్నో కష్టాలను అనుభవించారు. సినిమాల నుంచి తప్పుకున్న సమయంలో పూర్తిగా వ్యాపారాలపై దృష్టిపెట్టారు. ఆయన తండ్రికి చెన్నైలో పెద్ద కంటి ఆసుపత్రి ఉంది. దాంతోపాటు కొన్ని వ్యాపారాలు కూడా ఉండటంతో సినిమాలకు విరామం ప్రకటించి వాటిని చూసుకునేవాడు.

కంపెనీ విలువే రూ.3500 కోట్లు
ఆ సమయంలోనే 'ట్యాలెంట్ మ్యాక్సిమస్' పేరుతో ఓ సంస్థను స్థాపించాడు. ఈ సంస్థ దేశంలోను, ప్రపంచంలోను ఎవరికి, ఎక్కడ, ఎలాంటి, ఏ తరహా సిబ్బంది కావాలన్నా వెంటనే అందిస్తుంది. కంపెనీలకు కన్సల్టెన్సీ సేవలందించే సంస్థలా పనిచేస్తుంది. ఆ సమయంలోనే కంపెనీ ప్రధాన విలువ రూ.3500 కోట్లుగా ఉంది. రోజురోజుకు కంపెనీ విలువ పెరుగుతూనే ఉంది. తన తండ్రి ఆసుపత్రితోపాటు ఇతర వ్యాపారాలు, తనకు సినిమాల నుంచి వచ్చే ఆదాయం, వాటి పెట్టుబడి కలిపి దాదాపు అరవింద్ స్వామి ఆస్తుల విలువ రూ.4వేల కోట్లకు చేరుకుంది.
ఆశ్చర్యపోతున్న సినీ ప్రియులు
భారీమొత్తంలో ఆస్తులు కూడబెట్టిన తర్వాత తిరిగి సినిమాల్లోకి ప్రవేశించారు. తమిళంలో వచ్చిన తని ఒరువన్ సినిమాలో ప్రతినాయకుడిగా మెప్పించారు. ఇదే సినిమా తెలుగులో ధ్రువ పేరుతో రీమేక్ చేయగా ఈ సినిమాలో కూడా అరవింద్ ప్రతినాయకుడిగా నటించి ఆహా అనిపించాడు. అప్పటినుంచి కొన్ని సినిమాల్లో ప్రధానమైన విలన్ పాత్రలతోపాటు ముఖ్యమైన పాత్రల్లో నటిస్తున్నాడు. తెలుగు, తమిళంలో కొందరు స్టార్ హీరోలకు కూడా ఈ స్థాయిలో ఆస్తులు లేకపోవడంపై ఈ విషయం తెలుసుకున్నవారంతా ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.












Click it and Unblock the Notifications