ప్రార్థించిన ప్రతి ఒక్కరికీ థాంక్స్.. భార్య ఆరోగ్యం గురించి సోనూసూద్ ట్వీట్
ప్రముఖ నటుడు, రియల్ హీరో సోనూ సూద్ భార్య సోనాలి సూద్ రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. ప్రస్తుతం నాగ్‌పూర్ లోని ఆసుపత్రిలో ఆమె చికిత్స పొందుతున్నారు. ఈ క్రమంలోనే సోషల్ మీడియా వేదికగా తన భార్య ఆరోగ్యం గురించి సోనూసూద్ స్పందించారు. ఈ మేరకు ఆ పోస్టులో.. తన భార్య త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించిన అభిమానులకు ధన్యవాదాలు తెలిపారు. ప్రస్తుతం తన భార్య, మరో ఇద్దరు కుటుంబ సభ్యులు కోలుకుంటున్నట్లు తెలిపారు. మీ ప్రేమకు కృతజ్ఞుడిని అని రాసుకొచ్చారు.
కాగా మహారాష్ట్రలోని ముంబై - నాగ్‌పూర్ సమృద్ధి హైవేపై సోమవారం రాత్రి రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. కోల్‌కతా నుంచి వచ్చిన సోనాలీని ఆమె సోదరి సునీత, మేనల్లుడు సిద్దార్థ్ నాగ్‌పుర్ విమానాశ్రయం నుంచి తీసుకు వెళ్తుండగా ప్రమాదం జరిగింది. వారు ప్రయాణిస్తున్న కారు ఓ ట్రక్కును ఓవర్ టేక్ చేయబోయి వెనుక నుంచి ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో సోనాలి, ఆమె సోదరి కుమారుడికి తీవ్రంగా గాయాలయ్యాయి. ఆమె సోదరి మాత్రం స్వల్ప గాయాలతో బయటపడ్డారు. ప్రస్తుతం వీరికి నాగ్‌పూర్‌లోని మ్యాక్స్ ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. ప్రమాదంలో వారి కారు పూర్తిగా దెబ్బతిన్నట్టు పోలీసులు వెల్లడించారు. కారులోని ఎయిర్‌బ్యాగులు తెరుచుకోవడంతో పెనుప్రమాదం తప్పిందని భావిస్తున్నారు.

అయితే సోనూసూద్ మంచి మనసే అతని భార్యని ప్రమాదం నుంచి కాపాడిందని అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు. కరోనా కష్ట కాలంలో ఎంతో మందికి సోనూసూద్ సాయం చేశారు. సూద్ చారిటీ ఫౌండేషన్ ద్వారా ఇప్పటికీ సేవా కార్యక్రమాలు చేస్తూనే ఉంటున్నారు. రీసెంట్ గానే తన సూద్ ఛారిటబుల్ ట్రస్టు ద్వారా ఆంధ్రప్రదేశ్ సర్కారుకు నాలుగు అంబులెన్స్ లను అందించారు. ఏపీ సచివాలయంలో సీఎం చంద్రబాబును మర్యాదపూర్వకంగా కలిసి అంబులెన్స్‌లను అందించారు.
కరోనా సమయంలో ఆయన చేసిన సేవలను ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రత్యేకంగా కొనియాడారు. సీఎం చంద్రబాబు నాయకత్వంలో ఏపీ అభివృద్ధి జరుగుతోందని సోనూసూద్ అన్నారు. తెలుగు ప్రజలు తనను మంచి నటుడిగా తయారు చేశారన్నారు. ఇక్కడ ఉన్న ప్రేమ ఎక్కడా దొరకదని తెలిపారు. కోవిడ్ సమయంలో కూడా తెలుగు రాష్ట్రాల్లో పలు సేవ కార్యక్రమాలు చేశానని గుర్తు చేశారు. ఏపీ తనకి రెండో ఇళ్లు లాంటిదని.. తన భార్య కూడా ఆంధ్రప్రదేశ్‌కు చెందిన మహిళేనని చెప్పారు. ఏపీ ప్రజలు తనను ఎప్పుడూ ఉన్నత స్థానంలో ఉంచుతారన్నారు సోనూసూద్.
❤️🙏 pic.twitter.com/P7lnOYYTiM
— sonu sood (@SonuSood) March 26, 2025
-
సీరియల్లో అలా.. సోషల్ మీడియాలో ఇలా.. బ్యూటీ పిక్స్ వైరల్ !! -
'అమ్మా.. నాకు ఈ యాక్టింగ్ వద్దు!': కన్నీళ్లు పెట్టుకున్న స్టార్ హీరోయిన్!! -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
ఈ అరటి కాయల మధ్య ఉన్న పామును కనిపెట్టగలరా..? -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
ఇరాన్ ను లేపేద్దాం రండి: ప్రపంచ దేశాలకు నెతన్యాహు పిలుపు -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్!












Click it and Unblock the Notifications