భారతదేశ సినీ చరిత్రలోనే అతి పెద్ద డిజాస్టర్

భారతీయ సినీ చరిత్రలోనే ఊహించని బాక్సాఫీస్ విషాదం. రూ. 45 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన సినిమాకు కేవలం రూ. 60 వేల కలెక్షన్లు రావడం, చివరకు కొనే నాథుడు లేక ఓటీటీ డీల్ కూడా రద్దవ్వడం డిజాస్టర్లకు డిజాస్టర్‌గా నిలిచింది. సినిమా రంగంలో కోట్లు కుమ్మరించి భారీ తారాగణంతో సినిమాలు తీస్తే హిట్టు కొట్టొచ్చని భావిస్తుంటారు. కానీ కంటెంట్, సరైన ప్రణాళిక లేకపోతే ప్రేక్షకులు ఎంతటి ఘోర పరాజయాన్ని అందిస్తారో నిరూపించింది బాలీవుడ్ చిత్రం 'ది లేడీ కిల్లర్'.

సినీ పరిశ్రమలో సంచలనం.. తొలిసారిగా మెగాస్టార్ చిరంజీవి హారర్ చిత్రం?
సినీ పరిశ్రమలో సంచలనం.. తొలిసారిగా మెగాస్టార్ చిరంజీవి హారర్ చిత్రం?

అర్జున్ కపూర్, భూమి

2023లో అజయ్ బహల్ దర్శకత్వంలో టి-సిరీస్ నిర్మాతలు నిర్మించిన ఈ క్రైమ్ థ్రిల్లర్‌లో అర్జున్ కపూర్, భూమి పెడ్నేకర్ ప్రధాన పాత్రలు పోషించారు. స్టార్ కాస్టింగ్, పెద్ద ప్రొడక్షన్ హౌస్, భారీ బడ్జెట్.. ఇలా అన్ని అర్హతలు ఉన్నా, ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద భారత్ లోనే అత్యంత దారుణమైన డిజాస్టర్‌గా చరిత్రకెక్కింది. మొదటి రోజు కేవలం 293 టికెట్లు తెగాలి.

The Lady Killer The Film That Became the Biggest Disaster in Indian Cinema History

రూ. 45 కోట్ల భారీ బడ్జెట్‌తో నిర్మించిన ఈ చిత్రానికి ప్రమోషన్లు సరిగ్గా చేయకపోవడంతో అసలు ఈ సినిమా థియేటర్లలోకి వచ్చిందనే విషయమే మెజారిటీ ప్రేక్షకులకు తెలియదు. దేశవ్యాప్తంగా మొదటి రోజు కేవలం 293 టికెట్లు మాత్రమే అమ్ముడయ్యాయి. దీంతో తొలిరోజు వసూళ్లు అతికష్టం మీద రూ. 38 వేలుగా నమోదయ్యాయి. ఇక ఆ తర్వాత కూడా ఏమాత్రం కోలుకోలేకపోయిన ఈ చిత్రం, తన ముగింపు సమయానికి సాధించిన మొత్తం థియేట్రికల్ కలెక్షన్ కేవలం రూ. 60 వేలు మాత్రమే కావడం గమనార్హం.

సమోసాలు అమ్మిన చేతులతోనే సినీ పరిశ్రమను శాసిస్తున్నాడు
సమోసాలు అమ్మిన చేతులతోనే సినీ పరిశ్రమను శాసిస్తున్నాడు

ఓటీటీ హక్కుల రద్దు.. యూట్యూబే దిక్కు!

థియేటర్లలో ఘోరంగా విఫలమవడంతో డిజిటల్ ప్లాట్‌ఫామ్‌ల వైపు నిర్మాతలు అడుగులు వేశారు. మొదట్లో ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్ ఈ చిత్ర హక్కులను తీసుకుంటుందని వార్తలు వచ్చినా, బాక్సాఫీస్ దగ్గర దారుణ ఫలితాన్ని చూసి ఆ ఒప్పందాన్ని రద్దు చేసుకున్నట్లు సమాచారం. ఇతర ఏ అగ్ర ఓటీటీ సంస్థ కూడా ఈ చిత్రాన్ని కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపకపోవడంతో, చివరకు వేరే దారి లేక యూట్యూబ్‌లోనే ఉచితంగా ప్రసారం చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. కనీసం ప్రింటింగ్, ప్రమోషన్ ఖర్చులను కూడా రాబట్టలేకపోయిన 'ది లేడీ కిల్లర్', భారతీయ చిత్రసీమలోనే అతిపెద్ద బాక్సాఫీస్ వైఫల్యాలలో ఒకటిగా నిలిచిపోయింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+