సినిమా ప్రారంభం కాకుండానే భారీ హైప్స్
మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్నచిత్రం విశ్వంభర. యంగ్ డైరెక్టర్ వశిష్ట దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతుంది. ప్రస్తుతం ఈ చిత్ర షూటింగ్ చివరి దశలో ఉంది. రీసెంట్ గా రిలీజ్ అయిన చిరు ఫొటోస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఈ సినిమాతో పాటు మరొక బ్లాక్ బస్టర్ డైరెక్టర్ అనిల్ రావిపూడి డైరెక్షన్ లో సినిమా చేసేందుకు మెగాస్టార్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. త్వరలోనే ఈ సినిమాను అధికారకంగా ప్రకటించనున్నారు.
బాలయ్య కు భగవంత్ కేసరి, వెంకీకి సంక్రాంతికి వస్తున్నాం వంటి బిగ్గెస్ట్ హిట్స్ అందించిన బ్లాక్ బస్టర్ డైరెక్టర్ అనిల్ రావిపూడి ఇప్పుడు మెగాస్టార్ కు మైల్ స్టోన్ సినిమా ఇవ్వాలని డిసైడ్ అయ్యాడట. వింటేజ్ చిరుని మరోసారి వెండితెరపై చూపించేందుకు ఇప్పనుండే కథ పరంగా కసరత్తులు స్టార్ట్ చేసాడట అనిల్ రావిపూడి. మెగా స్టార్ చిరుకు ఒక డిఫ్రెంట్ కామెడీ టైమింగ్ ఉంటుందని ఆ టైమింగ్ తో తన స్టైల్ ఆఫ్ టేకింగ్ తో సినిమా చేస్తానని గతంలో పలు ఇంటర్వ్యూలలో తెలిపాడు అనిల్ రావిపూడి. కాగా ఈ సినిమాను టాలివుడ్ ప్రముఖ నిర్మాణ సంస్థ షైన్ స్క్రీన్ బ్యానర్ పై నిర్మాత సాహూ గారపాటి భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు.

అనిల్ రావిపూడి లేటెస్ట్ సెన్సేషన్ సంక్రాంతికి వస్తున్నాం సినిమాకు సంగీతం అందించిన భీమ్స్ సిసిరోలియో చిరు - అనిల్ సినిమాకు సంగీతదర్శకుడుగా వ్యవహరించబోతున్నాడు. ఇప్పటీకె నాలుగు సాంగ్స్ కు కూడా రెడీ చేశాడట భీమ్స్. చిరు వింటేజ్ డాన్స్ కూడా ఉండేలా ప్లాన్ చేస్తున్నాడు అనిల్ రావిపూడి. ఏదేమైనా ఈ సినిమాతో వింటేజ్ చిరును చూపిస్తూ మెగాభిమానులకు అనిల్ రావిపూడి బిగ్గెస్ట్ బ్లాస్ట్ బస్టర్ ఇస్తాడని ఫ్యాన్స్ ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. విశ్వంభర చివరి దశ షూట్ ముగించి అనిల్ రావిపూడి సినిమాను సెట్స్ పైకి తీసుకెళ్లనున్నాడు మెగాస్టార్. సమ్మర్ కానుకగా విశ్వంభర రిలీజ్ కానుంది.
-
పెళ్లికి రెడీ అయిన యంగ్ కపుల్.. -
రైతుల ఖాతాలలో 48గంటల్లోనే డబ్బులు జమ.. శుభవార్త చెప్పిన మంత్రి! -
చిన్న సినిమా పెద్ద హిట్ అంటే ఇదే..! -
బాలయ్యతో సినిమా చేయనంటున్న స్టార్ హీరోయిన్..? -
రేషన్ కార్డుల లబ్దిదారులకు శుభవార్తలు.. కొత్త రేషన్ షాపులే కాదు ఏప్రిల్ లో మరో పండుగ! -
Vijay Assets: విజయ్ ఆస్తులు తెలిస్తే షాక్- నామినేషన్లో వెల్లడి..! -
వాస్తు ప్రకారం బాత్రూంలో ఉప్పు పెట్టమని ఎవరైనా చెప్పారా? -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
లబ్దిదారులకు రెండు ఉచిత వంటగ్యాస్ సిలిండర్లు, రూ. 2,500 రీఛార్జ్ రేషన్ కార్డ్ -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
50 వేల కొత్త ఉద్యోగాలు.. AI శిక్షణకు పెద్దపీట! -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్‌గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం












Click it and Unblock the Notifications