The Paradise Remuneration: నాని, మోహన్ బాబు, కాయదు లోహర్, సంపూర్ణేష్.. ఎవరెవరికి ఎన్ని కోట్లంటే?

The Paradise Remuneration: నేచురల్ స్టార్ నాని నటించిన 'ది ప్యారడైజ్' ఎట్టకేలకు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. 'దసరా' తర్వాత దర్శకుడు శ్రీకాంత్ ఓదెలతో నాని చేసిన సినిమా కావడంతో రిలీజ్‌కు ముందే భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఎస్‌ఎల్‌వీ సినిమాస్ బ్యానర్‌పై సుధాకర్ చెరుకూరి ఈ సినిమాను నిర్మించారు. పీరియాడిక్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కిన ఈ సినిమాలో నాని 'జడల్' అనే పవర్‌ఫుల్ పాత్రలో కనిపించారు. సినిమా విడుదలకు ముందు పాటలు, గ్లింప్స్, ప్రమోషనల్ కంటెంట్ మంచి బజ్ తీసుకొచ్చాయి. ముఖ్యంగా అనిరుధ్ రవిచందర్ అందించిన సంగీతం, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ సినిమాకు మరింత బలాన్ని చేకూర్చింది.

16 ఏళ్ల కష్టానికి నేనే సాక్ష్యం.. ది ప్యారడైజ్ రిలీజ్ వేళ నాని వైఫ్ ఎమోషనల్!
16 ఏళ్ల కష్టానికి నేనే సాక్ష్యం.. ది ప్యారడైజ్ రిలీజ్ వేళ నాని వైఫ్ ఎమోషనల్!

'ది ప్యారడైజ్' సినిమా థియేటర్లలోకి రావడంతో.. సినిమా బడ్జెట్‌తో పాటు ఇందులో నటించిన నటీనటులు, టెక్నీషియన్ల రెమ్యునరేషన్స్ కూడా ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి. నాని నుంచి మోహన్ బాబు, రాఘవ్ జుయల్, కాయదు లోహర్, సంపూర్ణేష్ బాబు వరకు ఎవరెవరు ఎంత పారితోషికం తీసుకున్నారనే చర్చ మొదలైంది. ఇంతకీ ఈ సినిమాలో ఎవరికి ఎన్ని కోట్లు ఇచ్చారు? ఎవరి రెమ్యునరేషన్ ఎక్కువ? ఎవరికి ఎంత పారితోషికం దక్కిందనే వివరాలు ఇప్పుడు ఆసక్తికరంగా మారాయి.

The Paradise Remuneration

నానికి ఎంత పారితోషికం?
ఇక 'ది ప్యారడైజ్' నిర్మాణానికి దాదాపు రూ.90 కోట్ల వరకు ఖర్చయినట్లు సినీ వర్గాల్లో టాక్ ఉంది. అయితే ఈ బడ్జెట్‌పై కూడా అధికారిక ప్రకటన లేదు. భారీ యాక్షన్ సన్నివేశాలు, సెట్స్, టెక్నికల్ వర్క్ కారణంగా నిర్మాణ వ్యయం పెరిగినట్లు సమాచారం. ఇక ఈ సినిమాలో జడల్ పాత్రలో నటించిన నాని ఈ సినిమాలో అత్యధిక పారితోషికం అందుకున్న నటుడిగా ప్రచారం జరుగుతోంది. ఇండస్ట్రీ టాక్ ప్రకారం నాని రూ.35 కోట్ల నుంచి రూ.40 కోట్ల వరకు తీసుకున్నట్లు అంచనా.

Bigg Boss 10 Telugu: బిగ్‌‌బాస్ హౌజ్ నుంచి యాక్టర్ కృష్ణుడు ఎలిమినేట్
Bigg Boss 10 Telugu: బిగ్‌‌బాస్ హౌజ్ నుంచి యాక్టర్ కృష్ణుడు ఎలిమినేట్

రాఘవ్ జుయల్‌కు ఎంత?
సినిమాలో విక్రమ్ మాలిక్ పాత్రలో బాలీవుడ్ నటుడు రాఘవ్ జుయల్ కనిపించారు. ఇతని పాత్ర కూడా సినిమాకు కీలకం. ఆయన పారితోషికంగా రూ.8 కోట్ల నుంచి రూ.10 కోట్ల వరకు తీసుకున్నటు తెలుస్తోంది.ఇక శికంజా మాలిక్ పాత్రలో మోహన్ బాబు కనిపించారు. ఆయన పాత్ర కథలో కీలకం. ఇక మోహన్ బాబు పారితోషికం సుమారు రూ.4 కోట్ల నుంచి రూ.5 కోట్ల వరకు తీసుకుంటున్నారని టాక్.

నాని 'ది ప్యారడైజ్' సినిమాలో కేసీఆర్ మ్యాజిక్.. సోషల్ మీడియాలో వైరల్
నాని 'ది ప్యారడైజ్' సినిమాలో కేసీఆర్ మ్యాజిక్.. సోషల్ మీడియాలో వైరల్

ఇక హీరోయిన్ కాయదు లోహర్ కీలక పాత్రలో కనిపించారు. ఆమె పాత్ర పేరు సుబ్బులక్ష్మి. ఆమె రెమ్యునరేషన్ గా రూ.3 కోట్ల నుంచి రూ.4 కోట్ల వరకు తీసుకున్నటు తెలుస్తోంది.ఇక సినిమాకు సంగీతం అందించిన అనిరుధ్ రవిచందర్ కూడా భారీ రెమ్యునరేషన్ అందుకున్నట్లు టాక్. పలు నివేదికల ప్రకారం ఆయన పారితోషికం రూ.18 కోట్ల నుంచి రూ.20 కోట్ల వరకు ఉంటుందని అంచనా.

The Paradise Twitter Review: నాని 'ది ప్యారడైజ్' ట్విట్టర్ రివ్యూ.. టాక్ ఏంటి ఇలా ఉంది..!!
The Paradise Twitter Review: నాని 'ది ప్యారడైజ్' ట్విట్టర్ రివ్యూ.. టాక్ ఏంటి ఇలా ఉంది..!!

సంపూర్ణేష్ బాబుకు ఎంత?
ఇక ఈ లిస్ట్‌లో ఆసక్తి కలిగిస్తున్న పేరు సంపూర్ణేష్ బాబు. గతంలో ఆయనకు రూ.38 లక్షల వరకు మాత్రమే పారితోషికం ఇచ్చినట్లు కొన్ని కథనాలు చెబుతుంటే.. తాజా అంచనా ప్రకారం ఆయనకు రూ.2 కోట్ల వరకు పారితోషికం ఇచ్చినట్లు టాక్. అయితే.. ఈ విషయంలో ఎలాంటి అధికారిక ప్రకటన ఇంకా వెలువడలేదు. ఇదిలా ఉంటే.. భారీ అంచనా మధ్య విడుదలైన నాని మూవీ మిక్స్డ్ టాక్ అందుకుంటుంది. ఈ నేపథ్యంలో ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద ఎలాంటి విజయం అందుకుంటుందో.. ఎంత వసూలు చేస్తుందో అనేది ఆసక్తికరంగా మారింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+