The Paradise First Review: ది ప్యారడైజ్ మూవీ ఫస్ట్ రివ్యూ ఇదే..!
నేచురల్ స్టార్ నాని ప్రతిష్టాత్మక చిత్రం 'ది ప్యారడైజ్' ఎన్నో వాయిదాల తర్వాత ఎట్టకేలకు విడుదలకు సిద్ధం అవుతోంది. ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా సెప్టెంబర్ 24న విడుదల కానుంది. ఇప్పటికే బుకింగ్స్ ఓపెన్ అయ్యాయి. బుక్ మై షో యాప్ లో గంటకు దాదాపు 19 వేల టికెట్స్ బుకింగ్ అవుతున్నాయి. ఇప్పటివరకూ ఓ ట్రైలర్ లేదు.. ప్రీ రిలీజ్ ఈవెంట్ కాలేదు.. సినిమా ఎలా ఉంటుందో తెలియదు.. అయినా కూడా బుకింగ్స్ ఓ రేంజ్ లో జరుగుతున్నాయి. దీన్ని బట్టి ప్యారడైజ్ మూవీ కోసం అభిమానులు ఎంతలా ఎదురు చూస్తున్నారో అర్థం అవుతోంది. రిలీజ్ కు ముందే సినిమాపై పాజిటివ్ బజ్ బీభత్సంగా పెరగడానికి పలు కారణాలు ఉన్నాయి. అందులో ప్రధానమైనది.. నాని- శ్రీకాంత్ ఓదెల రస్టిక్ కాంబినేషన్. దర్శకుడు శ్రీకాంత్ ఓదెల ఫస్ట్ సినిమా దసరా.. ఈ మూవీలో నాని హీరో.. తెలంగాణ బ్యాక్ డ్రాప్ లో 2023 లో వచ్చిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంది.
అయితే ఇప్పుడు మళ్లీ తెలంగాణ బ్యాక్ డ్రాప్ లో నాని- శ్రీకాంత్ ఓదెల సినిమా వస్తున్న నేపథ్యంలో భారీ అంచనాలు ఉన్నాయి. ఇక రెండోది అనిరుధ్ మ్యూజిక్.. ఇప్పటికే ప్యారడైజ్ నుంచి వచ్చిన ఆయా షేర్, ఏషనాగుల పాటలు ఏ రేంజ్ లో హిట్ అయ్యాయో తెలిసిందే. ఎక్కడ చూసినా ఈ పాటలే వినిపిస్తున్నాయి. ఇక నాని- అనిరుధ్ కాంబోలో ఇది మూడో సినిమా ఇదివరకు గ్యాంగ్ లీడర్, జెర్సీ సినిమాలకు అనిరుధ్ సంగీతం అందించారు. ఆ సినిమాలు సూపర్ హిట్ అయ్యాయి. దాంతో ఈ సెంటిమెంట్ మరోసారి ప్యారడైజ్ తో రిపీట్ కానుంది. ఇక మూడోది హైదరాబాద్ బ్యాక్ డ్రాప్.. హైదరాబాద్ బ్యాక్ డ్రాప్ మీద కథలు రావడం చాలా అరుదు. నాని లాంటి పెద్ద హీరో హైదరాబాద్ నిజాం కాలం నాటి బ్యాక్ డ్రాప్ కు వ్యతిరేకంగా సినిమా రావడంతో సినిమాపై అంచనాలు భారీగా పెరిగాయి.
ఇక తాజాగా ప్యారడైజ్ మూవకి తెలంగాణ ప్రభుత్వం టికెట్ ధరలను పెంచుకునేందుకు అవకాశం కల్పించింది. అంతేకాక రిలీజ్ కు ఒక్కరోజు ముందు అంటే సెప్టెంబర్ 23 న సాయంత్రం 6 గంటల 30 నిమిషాలకు ప్రీమియర్ షో వేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దాంతో నాని ఫ్యాన్స్ ఫుల్ ఖుషీలో ఉన్నారు. ఇక తాజాగా ఈ మూవీ సెన్సార్ పూర్తయింది. చిత్ర యూనిట్ భావించినట్లుగానే ఈ చిత్రానికి సెన్సార్ టీమ్ ఏ సర్టిఫికెట్ ను జారీ చేసింది. ఇదే విషయాన్ని కొద్దిసేపటి క్రితం నాని తన అధికారిక ఎక్స్ వేదికగా పంచుకున్నారు. ప్యారడైజ్ మూవీకి ఏ సర్టిఫికెట్ వచ్చిందని తెలిపారు.
సెన్సార్ టీమ్ ప్రకారం ఈ మూవీ రన్ టైమ్ 2 గంటల 54 నిమిషాలుగా ఉంది. ఇక ప్యారడైజ్ మూవీలో హీరోయిన్ గా కయాదు లోహర్ నటించింది. అలాగే సినిమాలో సంపూర్ణేష్ బాబు, బాలీవుడ్ యాక్టర్ రాఘవ్ జుయల్, సోనాలి కులకర్ణి తదితరులు నటించారు. ఈ సినిమాను ఎస్ఎల్వీ సినిమాస్ బ్యానర్ పై ప్రముఖ నిర్మాత సుధాకర్ చెరుకూరి భారీ స్థాయిలో నిర్మించారు.

ఇక ప్యారడైజ్ మూవీ స్టోరీ విషయానికి వస్తే.. 1980 దశకంలో సికింద్రాబాద్ ప్రాంతంలో సవారీ అనే తెగ వివక్ష ను ఎదుర్కొంటుంది. ఆ తెగ లోంచి పుట్టుకొచ్చిన ధగడ్(నాని) కి అనేక రకాలుగా వివక్షను ఎదుర్కొంటాడు. సవారీ తెగపై.. ప్యారడైజ్ ప్రాంతంలో షికంజా మాలిక్ (మోహన్ బాబు), విక్రమ్ మాలిక్ (రాఘవ్ జుయల్ ) అధిపత్యాన్ని చెలాయిస్తుంటారు. అయితే వారి ఆగడాలు, ఆకృత్యాలపై తిరగబడిన ధగడ్ కథే ఈ ప్యారడైజ్ మూవీ. ఈ రెవల్యూషనరీ స్టోరీకి మథర్ సెంటిమెంట్ ను జత చేసి తీసుకొచ్చిందే ప్యారడైజ్ మూవీ అని తెలుస్తోంది. ఇక ఫుల్ రివ్యూ కోసం సెప్టెంబర్ 23 వరకు ఆగాల్సిందే..












Click it and Unblock the Notifications
