పిఠాపురానికి నూతన అందాలు: పవన్ చొరవ- హైలైట్స్..!!

ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ చొరవతో గ్రామీణ ప్రాంత చెరువుల రూపురేఖలు మారిపోతున్నాయి. తన సొంత నియోజకవర్గం కాకినాడ జిల్లా పిఠాపురంలో ఆరు కోట్ల రూపాయల వ్యయంతో 11 చెరువుల సుందరీకరించారు. నియోజకవర్గంలోని ఫకృద్ధీన్ పాలెం మైసమ్మ చెరువును మోడల్‌ రివర్ ఫ్రంట్ గా తీర్చిదిద్దారు. చెరువు చుట్టూ వాకింగ్ ట్రాక్, ఓపెన్ ఎయిర్ జిమ్, చిల్డ్రన్స్ పార్క్, జెండా స్థూపం, గ్రీనింగ్ ఏర్పాటు చేశారు. రాష్ట్రవ్యాప్తంగా రూ. 50 కోట్లతో 105 చెరువుల ఆధునీకరించనున్నారు.

ఫకృద్ధీన్ పాలెంలో రూ. 73 లక్షల వ్యయంతో సర్వాంగ సుందరంగా రూపుదిద్దుకుందీ మైసమ్మ చెరువు. పీఠికాపురి నగరవనం పేరుతో తుదిమెరుగులు దిద్దుకున్న ఈ పార్క్ ను పవన్ కల్యాణ్ ప్రారంభించారు. గ్రామీణ ప్రాంతాల్లో చెరువులను నీటి వనరులుగానే కాకుండా ప్రజలకు ఆహ్లాదం, ఆరోగ్యాన్ని అందించే సామాజిక వేదికలుగా తీర్చిదిద్దాలన్న లక్ష్యంతో దీన్ని ఓ మోడల్ రివర్ ఫ్రంట్ గా అభివృద్ధి చేశారు. దీంతో పాటు నియోజకవర్గలో అభివృద్ధి చేసిన మరో 11 చెరువుల శిలాఫలకాన్ని ఆయన ఆవిష్కరించారు.

Pithapuram Nagara Vanam Urban Forest Park Launched by Deputy CM Pawan Kalyan Key Highlights

కాకినాడ జిల్లా పరిధిలో అభివృద్ధి చేసిన 14 చెరువులకి సంబంధించిన ఫొటో ఎగ్జిబిషన్ ను పవన్ కల్యాణ్ తిలకించారు. చెరువు గట్టు వెంబడి కలియదిరిగారు. అక్కడ ఉన్న వృక్షాలు, మొక్కల వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. చెరువుల సుందరీకరణ గ్రామీణ ప్రజలకు విశ్రాంతి, వినోదంతోపాటు ఆరోగ్యాన్ని అందించడంలో ఈ చెరువులు దోహదపడతాయని ఈ సందర్భంగా పవన్ కల్యాణ్ వ్యాఖ్యానించారు.

చెన్నైకి భారీ ప్రాజెక్ట్ ను ఎగరేసుకెళ్లిన సీఎం విజయ్
చెన్నైకి భారీ ప్రాజెక్ట్ ను ఎగరేసుకెళ్లిన సీఎం విజయ్

మోడల్ రివర్ ఫ్రంట్ ప్రాజెక్టుగా తీర్చిదిద్దిన ఫకృద్ధీన్ పాలెం మైసమ్మ చెరువు నగరవనంలో అనేక ఔషధ మొక్కలను నాటారు. ఇక్కడి చిల్డ్రన్స్ పార్కును పవన్ కల్యాణ్ చిన్నారులతో కలసి ప్రారంభించడం ఆకట్టుకుంది. అక్కడి జిమ్ పరికరాలను పరిశీలించారు. చిల్డ్రన్స్ పార్కులో ఆడుకుంటున్న చిన్నారులకు తినుబండారాలు, చాక్లెట్లు అందించారు.

శాప్ కార్యాలయంలో స్పోర్ట్స్ కోటా టీచర్లపై వైసీపీ దాడి..!!
శాప్ కార్యాలయంలో స్పోర్ట్స్ కోటా టీచర్లపై వైసీపీ దాడి..!!

ప్రధాన మంత్రి కృషి సించాయి యోజన (PMKSY) సహకారంతో రాష్ట్రవ్యాప్తంగా రూ. 50 కోట్ల వ్యయంతో 105 చెరువుల సుందరీకరణ పనులు చేపట్టామని పవన్ కల్యాణ్ వివరించారు. వీటిలో దాదాపు సగానికి పైగా పనులు పూర్తయ్యాయని, మిగిలినవి పురోగతిలో ఉన్నాయని తెలిపారు. ఈ నెలాఖరు నాటికి అన్ని చెరువుల సుందరీకరణ పనులు పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని లక్ష్యంగా పెట్టుకున్నామని అన్నారు.

మైసమ్మ చెరువు ప్రారంభోత్సవానికి ముందు గట్టుపై ఉన్న ఆలయంలో శ్రీ మైసమ్మ అమ్మవారిని పవన్ కళ్యాణ్ దర్శించుకున్నారు. అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. చెరువు మధ్య భాగానికి వచ్చే విధంగా నూతనంగా నిర్మిస్తున్న నందీశ్వరుడి సహిత శివుని విగ్రహాన్ని పరిశీలించారు. చెరువు ప్రారంభోత్సవానికి విచ్చేసిన ప్రజల వద్దకు వెళ్లి ప్రతి ఒక్కరినీ పవన్ కళ్యాణ్ ఆప్యాయంగా పలుకరించారు. వారి నుంచి వినతులు స్వీకరించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+