ఇటుకలు అమ్మి 3 నెలల్లో 4 లక్షలు ..! ముచ్చటపడ్డ చంద్రబాబు..!

ఏపీ సీఎం చంద్రబాబు (Chandrababu) కుప్పం టూర్ లో భాగంగా ఇవాళ వివిధ అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ సందర్బంగా పలు అభివృద్ది పథకాల లబ్దిదారులతో ముఖా ముఖి కూడా నిర్వహించారు. అనంతరం కుప్పం అభివృద్ధిపై స్థానికుల అభిప్రాయాలను తెలుసుకున్నారు. స్థానికంగా ఉన్న మహిళలు ఏయే పనులు చేస్తున్నారు, వ్యాపారాలు చేస్తున్న వారు ఎంత సంపాదిస్తున్నారు, కుటుంబాలు ఎలా గడుస్తున్నాయన్న అంశాలపై వారితో కాసేపు చిట్ చాట్ చేశారు.

Dussehra Holidays: ఏపీలో దసరా సెలవుల ప్రకటన- ఈసారి బోనస్ గా మరో 2..!
Dussehra Holidays: ఏపీలో దసరా సెలవుల ప్రకటన- ఈసారి బోనస్ గా మరో 2..!

ఈ సందర్భంగా కుప్పంలో ఓ మహిళను చంద్రబాబు ఏం చేస్తున్నావని అడిగితే.. అమె ఇటుకలు తయారు చేసి.. మూడు నెలలకు రూ.4 లక్షలు సంపాదిస్తున్నా సార్ అంటూ గర్వంగా చెప్పింది. ఈ విషయం ఆమె కాస్త నెమ్మదిగా చెప్పడంతో కలగజేసుకున్న చంద్రబాబు.. నీవు పారిశ్రామికవేత్తవి.. గట్టిగా మాట్లాడు అన్నారు. ఈ లెక్కన సంవత్సరానికి ఎంత సంపాదిస్తున్నావని అడిగితే ఖర్చులు పోను 10 లక్షలు సంపాదిస్తున్నట్లు చెప్పింది. దీంతో సంవత్సరానికి ఖర్చులు పోను రూ.10 లక్షలు సంపాదించడంపై ఆమెను ప్రశంసించారు. నిన్ను చూసి నేను లెక్కలు నేర్చుకోవాలి అంటూ చంద్రబాబు సంతోషం వ్యక్తం చేశారు.

Chandrababu Impressed by Woman s 4-Lakh Brick Business Says He ll Learn Maths From Her
El Nino: ఏపీకి పెరుగుతున్న ముప్పు..! చంద్రబాబు కీలక ఆదేశాలు..!
El Nino: ఏపీకి పెరుగుతున్న ముప్పు..! చంద్రబాబు కీలక ఆదేశాలు..!

తర్వాత కుప్పంలో వివిధ అభివృద్ధి కార్యక్రమాల సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో సీఎం చంద్రబాబు పాల్గొన్నారు.
ఈ సభలో సీఎం చంద్రబాబు ప్రసంగం కొనసాగుతుండగా... మసీదులో అజా ప్రార్థన వినిపించింది. అజా ప్రార్థన వినిపించగానే తన ప్రసంగాన్ని మధ్యలో కొద్దిసేపు నిలిపివేసిన చంద్రబాబు.. ప్రార్థన ముగిశాక ప్రసంగాన్ని కొనసాగించారు. దీంతో స్థానికంగా దీనిపై చర్చించుకోవడం కనిపించింది. అనంతరం కుప్పం బహిరంగ సభలో సీఎం చంద్రబాబు తన ప్రసంగం పూర్తి చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+