విజయ్ కు పోటీగా అజిత్ టీఎంకే పార్టీ - వార్ బిగిన్స్..!!

తమిళనాడు రాజకీయాల్లో అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. హీరో విజయ్ సీఎం కావటంతో.. ఇప్పుడు అజిత్ ఫ్యాన్స్ రాజకీయ బాట పడుతున్నారు. అజిత్ అభిమానులు 'తమిళగ మక్కల్ కళగం(టీఎంకే)పేరుతో రాజకీయ పార్టీని స్థాపించారు. పార్టీ జెండాను ఆవిష్కరించారు. ఈ జెండా ఇంచుమించుగా అధి కార పార్టీ టీవీకే జెండాను పోలిఉంది. కాగా, అజిత్ రాజకీయ ప్రవేశంపై ఎప్పటి నుంచో చర్చ జరుగుతోంది. అజిత్ రాజకీయాల్లోకి రానని చెప్పినా ఇప్పుడు ఆయన అభిమానులు పార్టీ ప్రకటించటం సంచలనంగా మారుతోంది.

ప్రముఖ సినీ హీరో అజిత్ అభిమానులు తమిళనాడు రాజకీయాల్లో మరో సంచలనానికి కేంద్రంగా నిలిచారు. రాజకీయాల్లోకి రానని అజిత్ స్వయంగా వెల్లడించినా ఆయన అభిమానులు మాత్రం పదేపదే ఆయన పేరును రాజకీయంగా తెరపైకి తెస్తున్నారు. కొత్తగా పార్టీ ప్రకటించారు. ఆ పార్టీకి ప్రధాన కార్యదర్శి పదవి ఖాళీగా ఉంచారు. ఆ పదవి అజిత్ కు కేటాయిస్తున్నట్లు వెల్లడించారు.

 టైం చూసి DMK, AIADMK ను భారీ దెబ్బ కొట్టిన విజయ్ - ఒక్క నిర్ణయంతో సీన్ ఛేంజ్..!!
టైం చూసి DMK, AIADMK ను భారీ దెబ్బ కొట్టిన విజయ్ - ఒక్క నిర్ణయంతో సీన్ ఛేంజ్..!!
Ajith Kumar Fans Launch Tamilaga Makkal Kazhagam Political Party in Ulundurpet

'రాష్ట్రవ్యా ప్తంగా ఉన్న అజిత్ అభిమాన సంఘాల నేతలమంతా కలిసి ఒకే తాటిపైకి వచ్చి ఈ పార్టీని ఏర్పాటు చేశామని... అజిత్ రాజకీయాల్లోకి రావాలని కోరుతున్నామని పిలుపునిచ్చారు.తమిళనాడులో విజయ్ - అజిత్ ఫ్యాన్స్ మధ్య గొడవలు జరుగుతూనే ఉన్నాయి. విజయ్, అజిత్ కలిసి కనిపించినా వాళ్ళ మధ్య ఏ గొడవలు లేవని సంకేతాలు ఇచ్చినా ఫ్యాన్స్ మాత్రం మా హీరో గొప్ప అంటే మా హీరో గొప్ప అని పోటీ పడుతూనే ఉన్నారు. ఇటీవల విజయ్ సీఎం అయ్యాక అజిత్ కార్ రేసింగ్ లో పాల్గొంటే అక్కడికి వెళ్లి కలిసి అభినందించారు.

విజయ్ అజిత్ ని కలిసిన కొన్ని రోజులకే అజిత్ ఫ్యాన్స్ కొత్త రాజకీయ పార్టీని ప్రకటించారు. ఇక పార్టీ జెండాగా పసుపు, తెలుపు, ఎరుపు మూడు రంగులతో, మధ్యలో రెండు చిరుతపులులతో రూపొందించారు. విజయ్ పార్టీ జెండా పసుపు, ఎరుపు రంగులతో మధ్యలో రెండు ఏనుగులు ఉన్న సంగతి తెలిసిందే. దీంతో అజిత్ ఫ్యాన్స్ పార్టీ, పార్టీ జెండా ఇప్పుడు తమిళనాట చర్చగా మారాయి. మరి దీనిపై అజిత్ స్పందిస్తాడా లేదా చూడాలి.

 అజిత్ తో సీఎం విజయ్, ఫ్యాన్స్ కు సర్‌ప్రైజ్ ట్రీట్ - 30 ఏళ్ల పోటీకి తెర.. ఇక నుంచి..!!
అజిత్ తో సీఎం విజయ్, ఫ్యాన్స్ కు సర్‌ప్రైజ్ ట్రీట్ - 30 ఏళ్ల పోటీకి తెర.. ఇక నుంచి..!!

అసలు అజిత్ కి అయితే రాజకీయాలు ఇంట్రెస్ట్ లేదు. సినిమాలు కూడా ఇంట్రెస్ట్ లేదు కానీ అభిమానుల కోసమే చేస్తున్నాను అని గతంలోనే చెప్పాడు. అజిత్ కార్ రేసింగ్ పైనే ఎక్కువ మక్కువ చూపిస్తూ వివిధ దేశాల్లో జరిగే రేసింగ్స్ లో పాలోంతున్నాడు. అజిత్ కి అధికారిక కార్ రేసర్ లైసెన్స్ ఉంది. మన దేశం తరపున అధికారికంగా పలు పోటీల్లో పాల్గొని విజయం కూడా సాధించారు. కేవలం అజిత్ ఫ్యాన్స్ విజయ్ సీఎం అయ్యారనే కారణంతోనే ఈ పార్టీ ప్రకటించినట్లు భావిస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+