చిరంజీవి వల్ల కెరీర్ పోగొట్టుకున్న టాప్ డైరెక్టర్లు వీరే

మెగాస్టార్ చిరంజీవి అంటే సినీ పరిశ్రమలో ఒక మేరు పర్వతం లాంటి వ్యక్తి. ఆయనకున్న స్టార్ ఇమేజ్ మరెవరికీ లేదని చెప్పొచ్చు. అంతటి ఘనమైన హీరోతో సినిమాలు చేయడానికి దర్శకులంతా క్యూలో ఉంటారు. మెగాస్టార్ తో ఒక సినిమా చేస్తే చాలు.. మనకు కూడా స్టార్ ఇమేజ్ వస్తుందని భావించే డైరెక్టర్లు ఎంతోమంది ఉన్నారు. సినీ పరిశ్రమలోకి కొత్తగా వచ్చే దర్శకుల నుంచి స్టార్ దర్శకుల వరకు అంతా చిరంజీవితో ఓ సినిమా చేయాలనే కోరికతో ఉంటారు. అయితే అంతటి ఇమేజ్ ఉన్న చిరుతో సినిమా చేసి కెరీర్ పోగొట్టుకున్న డైరెక్టర్లు కూడా ఉన్నారు. వారిగురించి తెలుసుకుందాం.

హీరోలకు మాస్ ఇమేజ్ కల్పించే డైరెక్టర్ గా వి.వి.వినాయక్ కు ఎంతో పేరు ఉంది. ఆయనతో సినిమా చేయాలని ఒకానొక దశలో ప్రతి స్టార్ హీరో తపించేవారు. వినాయక్ తో సినిమా అంటే కచ్చితంగా సుమోలు గాలిలోకి లేవడమే కాకుండా హీరోల ఇమేజ్ కూడా ఆసాంతం పైకి లేస్తుంది. అటువంటి వినాయక్ కూడా చిరంజీవితో సినిమా చేసి కెరీర్ పోగొట్టుకున్నాడు.

these directors lost their career making with actor chiranjeevi

పరిశ్రమలోకి రీ ఎంట్రీ ఇచ్చే సమయంలో మొదటి సినిమాగా ఖైదీ నెంబర్ 150 చేశాడు. తమిళంలో విజయ్ హీరోగా వచ్చిన కత్తి సినిమాకు తెలుగు రీమేక్. కాజల్ కథానాయిక. వినాయక్ దర్శకత్వం వహించారు. ఈ సినిమా మంచి హిట్ అవడమే కాకుండా చిరుకు స్ట్రాంగ్ కంబ్యాక్ ఇచ్చింది. ఈ సినిమా తర్వాత వినాయక్ కు ఎటువంటి ఆఫర్లు రాలేదు. సాయిధరమ్ తేజ్ తో ఇంటిలిజెంట్ అనే సినిమా చేయగా అది డిజాస్టర్ గా నిలిచింది.

బెల్లంకొండ సాయిశ్రీనివాస్ హీరోగా తెలుగు ఛత్రపతి సినిమాను హిందీలో రీమేక్ చేయగా దానికి వినాయక్ దర్శకత్వం వహించారు. అది భారీ డిజాస్టర్ అయింది. ఆ తర్వాత వినాయక్ కు ఇంతవరకు సినిమాలు లేవు. ఆయనతో సినిమాలు చేసేందుకు ఏ నిర్మాత ముందుకు రావడంలేదు. మరో దర్శకుడు సురేందర్ రెడ్డి కూడా స్టార్ డైరెక్టరే. చిరంజీవితో సైరా సినిమా చేశాడు. అది ఫ్లాప్ అయింది. ఆ తర్వాత ఆఫర్లు రాలేదు. అక్కినేని అఖిల్ తో ఏజంట్ అనే సినిమా చేయగా అది ఘోర పరాజయాన్ని పొందింది. తనతో సినిమా చేయడానికి ఏ హీరో, నిర్మాత ముందుకు రావడంలేదు. వీరినుంచి సినిమాలు వస్తాయో? రావో కూడా తెలియని పరిస్థితి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+