పవన్ కల్యాణ్ కెరీర్‌లోనే భారీ డిజాస్టర్ సినిమా బాసూ ఇది..!
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. చిరంజీవి తమ్ముడుగా ఇండస్ట్రీలో అడుగుపెట్టిన పవన్ కల్యాణ్ అనతి కాలంలోనే తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. వరుస హిట్లను తన ఖాతాలో వేసుకుంటూ ఫుల్ పాపులారిటీని సొంతం చేసుకున్నారాయన. 10 ఏళ్ల పాటు ఒక్క హిట్ కూడా లేకపోయినప్పటికీ ఆయనుకున్న ఇమేజ్ ఏమాత్రం చెక్కుచెదరలేదంటే పవన్ క్రేజ్ ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు. ముఖ్యంగా ఖుషీ సినిమాతో పవన్ కల్యాణ్ రేంజ్ ఒక్కసారిగా మారిపోయింది.
పవన్ కల్యాణ్ కెరీర్‌తో బ్లాక్ బస్టర్ హిట్‌గా ఖుషీ సినిమా నిలిచింది. ఆ తర్వాత ఆయనకు పదేళ్ల పాటు హిట్ సినిమా లేదు. తిరిగి గబ్బర్ సింగ్ సినిమాతో ఆయన హిట్ కొట్టారు. ఆ తర్వాత కొంతకాలానికి పవన్ కల్యాణ్ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. ప్రస్తుతం ఆయన ఏపీ డిప్యూటీ సీఎంగా కొనసాగుతున్నారు. అయితే పవన్ కల్యాణ్ కెరీర్‌లో చాలా హిట్లు, ఫ్లాపులు ఉన్నాయి. కానీ ఓ సినిమా మాత్రం పవన్ కల్యాణ్ కెరీర్‌ను పదేళ్లు వెనక్కి తీసుకువెళ్లింది.

ఆ సినిమా మరెదో కాదు..జానీ. వరుస హిట్ల మీద ఫుల్ జోష్‌లో ఉన్న పవన్ కల్యాణ్‌కు జానీ సినిమా పెద్ద షాకిచ్చింది. ఇంకా చెప్పాలంటే పవన్ కెరీర్‌లోనే ఈ సినిమా అత్యంత భారీ డిజాస్టర్‌గా నిలిచింది.ఈ సినిమాకు పవన్ కల్యాణే దర్శకత్వం వహించారు.మొదటి రోజు మొదట ఆట పడగానే ఫ్లాప్ టాక్ వచ్చింది. వెంటనే డిస్ట్రిబ్యూటర్లు, ఫైనాన్షియర్లు పవన్ ఇంటి మీదకు వెళ్లారు. ఈ విషయాన్ని పవన్ కల్యాణే స్వయంగా ఓ ఇంటర్వ్యూలో చెప్పడం జరిగింది. మాకు డబ్బులు రావడం లేదు.
ఇప్పుడు ఏంచేస్తావని డిస్ట్రిబ్యూటర్లు, ఫైనాన్షియర్లు పవన్ కల్యాణ్‌ను నిలదీశారు. చేసేది లేక పవన్ కల్యాణ్ ఆ సినిమాకు తీసుకున్న పారితోషికం మొత్తం వెనక్కి ఇచ్చేశారు. పైగా రూ.15 లక్షల వరకు అప్పు చేసి మరి డిస్ట్రిబ్యూటర్లు, ఫైనాన్షియర్లకు సెటిల్ చేశారట పవన్ కల్యాణ్. ఆ తర్వాత పదేళ్ల పాటు పవన్ కల్యాణ్ హిట్ మొహం చూసింది లేదు. తిరిగి గబ్బర్ సింగ్ సినిమాతో ఆయన హిట్ కొట్టారు. ఇలా పవన్ కల్యాణ్ కెరీర్‌లో జానీ సినిమా పెద్ద ఫ్లాప్‌గా నిలిచింది.












Click it and Unblock the Notifications