హీరో దర్శన్ కు షాక్, ఎస్పీ ముందు లొంగిపోయిన నిందితులు, అక్కడ ఏం చెప్పారంటే ?
రేణుకాస్వామి హత్య కేసుకు సంబంధించి కారు డ్రైవర్ రవి నిన్న లొంగిపోగా, ఈరోజు (జూన్ 14) మరో ఇద్దరు దర్శన్ గ్యాంగ్ నిందితులు పోలీసులకు లొంగిపోయారు. రేణుకాస్వామి కేసులో 6వ నిందితుడు జగదీష్, 7వ నిందితుడు అను అలియాస్ అనిల్ అనే ఇద్దరు నిందితులను పోలీసులు అరెస్ట్ చేసి విచారణ నిమిత్తం బెంగళూరుకు తరలించినట్లు సమాచారం.
దర్శన్ అరెస్ట్ తరువాత ఈ కేసు రోజురోజుకు అనేక మలుపులు తిరుగుతోంది. చిత్రదుర్గలో నిందితులు అర్థరాత్రి ఏం చేశారో అని పోలీసులు అరా తీస్తున్నారు. హత్యకు గురైన రేణుకాస్వామి కిడ్నాప్ కేసులో ప్రధాన నిందితురాలు గత నాలుగైదు రోజులుగా పరారీలో ఉన్నారు. పరారీలో ఉన్న నిందితుల్లో కారు డ్రైవర్ రవి పోలీస్ స్టేషన్‌కు వెళ్లి నేరుగా డీవైఎస్పీ దినకరన్ ఎదుట లొంగిపోయారు.

ఇదే కేసులోఆరవ, ఏడో నిందితులు కూడా శుక్రవారం పోలీసుల ముందు లొంగిపోయారు. జూన్ 14వ తేదీన గురువారం రేణుకాస్వామి హత్య కేసులో 8వ నిందితుడు పోలీసులకు లొంగిపోయాడు. నిందితుడు రవి చిత్రదుర్గలోని జిల్లా ఎస్పీ కార్యాలయానికి వెళ్లిచ్చి పోలీసులకు లొంగిపోయాడు. చిత్రదుర్గ రేణుకాస్వామి హత్య కేసుకు సంబంధించి నటుడు దర్శన్, నటి పవిత్ర గౌడ సహా మొత్తం 14 మంది నిందితులు పోలీసుల అదుపులో ఉన్నారు.
17 మందిలో 13 మంది నిందితులు ఇప్పటికే పోలీసుల అదుపులో ఉండగా నలుగురు నిందితులు పరారీలో ఉంటూ ఇప్పుడు పోలీసుల ముందు ముగ్గురు లొంగిపోయారు. అరెస్టు అయిన ఎనిమిదో నిందితుడు చిత్రదుర్గ జిల్లా కుర్బరహట్టికి చెందిన రవి అకస్మాత్తుగా చిత్రదుర్గ ఎస్పీ కార్యాలయానికి వెళ్లి పోలీసుల ఎదుట లొంగిపోయాడు. అయితే ఈ కేసు రోజురోజుకు మలుపు తిరుగుతుండటంతో హీరో దర్శన్ తో పాటు మరో ఆయన గర్ల్ ఫ్రెండ్ పవిత్రా గౌడకు చెమటలు పడుతున్నాయని తెలిసింది.
-
రైతులకు శుభవార్త.. ఆ డబ్బులు నేరుగా మీ బ్యాంకు ఖాతాల్లోనే! -
రైతు భరోసా నిధులు జమ విషయంలో లేటెస్ట్ అప్డేట్! -
తెలుగు హీరోయిన్‌తో స్టార్ క్రికెటర్ ఎంగేజ్మెంట్! -
T20 World Cup: చిత్తుగా ఓడిన కివీస్ పై అర్ధరాత్రి ఐసీసీ సంచలన ట్వీట్..! -
140 కోట్ల మంది కలలు ఛిద్రం.. ప్రపంచ కప్ నుంచి భారత్ అవుట్! -
బెంగళూరుకు ప్రత్యేక రైళ్లు- ఏపీలో హాల్ట్ స్టేషన్లు -
T20 WC 2026 ఫైనల్ గెలిచేది ఆ జట్టే: మహమ్మద్ అమీర్ -
పాతాళానికి పడిపోతున్న బంగారం ధరలు- భారీ క్రాష్ -
టాలీవుడ్ స్టార్ హీరో ఎంగేజ్మెంట్ -
నా దేవత- ఆమె రాకతోనే నా జీవితం ఇలా మారిపోయింది -
ఆయన చలవ వల్లే- సక్సెస్ మంత్ర బయటపెట్టిన సంజు -
బంగాళాఖాతంపై ఉపరితల ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో వర్షాలు












Click it and Unblock the Notifications