ప్రియాంక చోప్రా ఇంట్లో తీవ్ర విషాదం

గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. ఆమె భర్త, ప్రముఖ సింగర్ నిక్ జోనస్ కుటుంబానికి అత్యంత సన్నిహితురాలు, నిక్ జోనస్ తన సొంత సోదరిలా భావించే మాయా కిబెల్ తుదిశ్వాస విడిచారు. కేవలం 30 ఏళ్ల వయసులోనే ఆమె కన్నుమూయడం నిక్ జోనస్ కుటుంబాన్ని విషాదంలోకి నెట్టివేసింది.

మాయా మారణానికి కారణం?
మాయా కిబెల్ గత కొంత కాలంగా విల్సన్ అనే అరుదైన జన్యుపరమైన వ్యాధితో పోరాడుతున్నట్లు తెలిసింది. ఈ వ్యాధి కారణంగా శరీరంలో రాగి పేరుకుపోయి కాలేయం, మెదడు, ఇతర కీలక అవయవాలపై తీవ్ర ప్రభావం చూపుతుంది. మార్చి 7న ఉదయం మాయా అకస్మాత్తుగా స్పృహతప్పి పడిపోయారని.. ఆ సమయంలో ఆమె గుండె, ఊపిరితిత్తులు పనిచేయడం ఆగిపోయాయని మాయా తల్లి కియోకో కిబెల్ సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. వెంటనే ఆస్పత్రికి తరలించి ఐసీయూలో చికిత్స అందించినప్పటికీ.. ఫలితం లేకపోయింది.

Tragedy in Priyanka Chopra-Nick Jonas Family Maya Kibel Dies at 30 Due to Rare Wilson Disease

నిక్ జోనస్ కుటుంబంతో విడదీయలేని బంధం
మాయా కిబెల్ కేవలం నిక్ జోనస్ స్నేహితురాలు మాత్రమే కాదు.. ఆమె జోనస్ బ్రదర్స్ కు పొరుగున నివసించేవారు. చిన్నప్పటి నుంచి నిక్ జోనస్, మాయా కిబెల్ కలిసి పెరిగారు. నిక్ జోనస్ ఆమెను తన సొంత చెల్లెలిలా భావించేవారు. క్రిస్మస్ వేడుకల నుంచి టూర్ల వరకు ప్రతి విషయంలోనూ నిక్ జోనస్ కుటుంబంలో ఒకరిలా ఉండేవారు.

తల్లి కన్నీటిపర్యంతం.. భావోద్వేగ పోస్ట్
మాయా తల్లి కియోకో కిబెల్ తన కూతురు అనుభవించిన నరకాన్ని వివరిస్తూ ఇన్‌స్టాలో ఓ పోస్ట్ చేశారు. "మాయా విల్సన్ వ్యాధితో ఎంతో పోరాడింది. అప్పుడప్పుడు ఆ నొప్పిని తట్టుకోలేక ఏడుస్తూనే నిద్రపోయేది. ఇప్పుడు ఆమె ఏ బాధ లేని లోకానికి వెళ్లిపోయిందని అనుకుంటూ నా మనసును ఓదార్చుకుంటున్నాను" అని కియోకో కిబెల్ రాసుకొచ్చారు.

నిక్ జోనస్ భావోద్వేగ నివాళి
ఈ బాధాకర వార్త విన్న నిక్ జోనస్ తీవ్ర దిగ్భ్రాంతికి లోనయ్యారు. కియోకో పోస్ట్‌పై నిక్ జోనస్ స్పందిస్తూ, "నా సోదరి శాశ్వతంగా దూరమైపోయింది. మాయా.. నేను ఎప్పుడూ నీతోనే ఉంటాను" అని అత్యంత భావోద్వేగంగా కామెంట్ చేశారు. నిక్ జోనస్, ప్రియాంక చోప్రా ఇద్దరూ మాయా మృతికి సంతాపం వ్యక్తం చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+