రష్మిక గురించి చెప్పాల్సిన సమయం వచ్చింది: విజయ్ దేవరకొండ

తెలుగు సినీ పరిశ్రమలో హీరోయిన్ రష్మిక పేరు చెప్పగానే వెంటనే అందరికీ విజయ్ దేవరకొండ పేరు గుర్తుకు వస్తుంది. అలాగే విజయ్ దేవరకొండ పేరు చెప్పగానే రష్మిక పేరు గుర్తుకువస్తుంది. తెలుగు ప్రేక్షకుల గుండెల్లో అంతలా వీరిద్దరూ నిలిచిపోయారు. వెండితెరపై వీరిద్దరి కెమిస్ట్రీకి అందరూ ఫిదా అయిపోయారు. నిజజీవితంలో ఎప్పుడు విజయ్-రష్మిక ఒకటవుతారా? అంటూ వారి అభిమానులే కాకుండా సినీ ప్రియులంతా ఎదురుచూస్తున్నారు. అదిగో, ఇదిగో అంటూ పరోక్షంగా హింట్ ఇస్తున్నారుకానీ ఇంతవరకు బయటపడలేదు.

ఆనంద్ వదిన అని పిలుస్తుంటాడు
విజయ్ దేవరకొండ కుటుంబ సభ్యులతో కలిసి ఇటీవలే రష్మిక పుష్ప2 సినిమా చూసింది. పండగల సమయంలో కూడా వాళ్లింటికి వెళుతుంది. విజయ్ తమ్ముడు ఆనంద్ దేవరకొండ రష్మికను వదిన అనే పిలుస్తుంటాడు. విజయ్-రష్మిక కలిసి పార్టీలకు వెళుతుంటారు.. అయితే అది ఎవరికీ కనపడకుండా విదేశాల్లో మాత్రమే. అప్పుడప్పుడూ అలా కలిసివెళుతూ విమానాశ్రయాల్లో ఫొటోలకు దొరికిపోతుంటారు. డేటింగ్ లో ఉన్నారని, పిక్నిక్ గడపడానికి వెళ్లారంటూ సామాజిక మాధ్యమాల్లో తరుచుగా వార్తలు వస్తుంటాయి.

vijay devarakonda interesting comments on dating with rashmika

తనపై ఎటువంటి ఒత్తిడి లేదు
తాజాగా ఓ ఇంటర్వ్యూలో విజయ్ దేవరకొండ పాల్గొన్నాడు. ఆ ఇంటర్వ్యూలో రష్మిక ప్రస్తావన వచ్చింది. దీనిపై విజయ్ మాట్లాడుతూ ఈ విషయం గురించి మంచి సమయం వచ్చినప్పుడు తానే ప్రస్తావిస్తానని, ప్రేక్షకులంతా ఎప్పుడైతే ఈ విషయాన్ని తెలుసుకోవాలని భావిస్తుంటారో సరిగ్గా అదే సమయంలో తాను దీన్నిగురించి వెల్లడిస్తానని చెప్పారు. తామే ఈ విషయాన్ని బయటపెడతానన్నారు. తాను సినిమా నటుడిని కావడంతో సహజంగానే అందరూ తన గురించి, తన వ్యక్తిగత జీవితం గురించి ఆసక్తి ప్రదర్శిస్తుంటారని, ఇది సహజంగా జరుగుతుంటుందని, ఈ విషయంలో తనపై ఎటువంటి ఒత్తిడి లేదన్నారు. ప్రస్తుతం విజయ్ దేవరకొండ చేసిన కామెంట్లు సామాజిక మాధ్యమాల్లో వైరలవుతున్నాయి. పరోక్షంగా రష్మిక గురించి చెప్పారని, త్వరలోనే ఈ విషయాన్ని తానే ప్రకటిస్తానని చెప్పడంతో వీరిద్దరి ప్రేమ ఖాయమేనని, పెళ్లి జరగడమే తరువాయి అంటున్నారు నెటిజన్లు. రష్మిక కూడా ఇటీవలే ఈ విషయం గురించి స్పందిస్తూ అందరికీ తెలుసని తాను ఎవరిని పెళ్లి చేసుకోబోతున్నానో అని వ్యాఖ్యానించింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+