"విజయ్"కి డబుల్ ట్రీట్.. ఒకే రోజు త్రిష బర్త్‌డే, ఎలక్షన్ రిజల్ట్స్ !!
కోలీవుడ్ స్టార్ హీరో, టీవీకే అధినేత విజయ్ తన సినీ కెరీర్ లో ఎన్నో సూపర్ హిట్ చిత్రాలలో నటించి తమిళం లోనే కాకుండా దక్షిణాది వ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్నారు. రీసెంట్ గానే రాజకీయాల్లోకి సైతం ఎంట్రీ ఇచ్చి ఎన్నికల బరిలో నిలిచేందుకు సన్నద్దమవుతున్నారు. ఈ ఏడాది తమిళనాడులో జరగబోయే అసెంబ్లీ ఎన్నికలలో తన పార్టీ టీవీకే ద్వారా రంగంలోకి దిగి అధికారంలోకి రావాలని సన్నాహాలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఆయనకు వ్యక్తిగతంగా వరుస ఇబ్బందులు ఎదురవుతూ వస్తుండడం హాట్ టాపిక్ అవుతోంది.
రీసెంట్ గానే విజయ్ నుంచి విడాకులు కోరుతూ ఆయన భార్య సంగీత కోర్టును ఆశ్రయించడం చర్చనీయాంశంగా మారింది. మరో నటితో సన్నిహితంగా ఉంటున్నారని, నటితో బంధం వీగిపోయిందంటూ తనకు మాట ఇచ్చినప్పటికీ, ఆ మాట తప్పారని ఆమె ఆరోపించారు. విజయ్ నుంచి విడాకులు కోరుతూ చెంగల్ పట్టు జిల్లా కోర్టులో సంగీత పిటిషన్ దాఖలు చేసింది. ఈ నేపథ్యంలో ఏప్రిల్ 20న విచారణకు హాజరు కావాలని విజయ్ కి నోటీసులు జారీ చేసినట్లు తెలుస్తోంది.

కాగా విజయ్ - సంగీత మధ్య విడాకులకు కారణం త్రిషనే అని.. సోషల్ మీడియాలో జోరుగా చర్చ నడుస్తోంది. కానీ అదే సమయంలో విజయ్, త్రిష ఓ వివాహ వేడుకకు కలిసి హాజరైన ఫోటోలు, వీడియోలు వైరల్ కావడంతో ఈ డిస్కషన్ మరింత ఊపందుకుంది. విజయ్, త్రిష రిలేషన్‌పై ఎప్పటినుంచో గాసిప్స్ వినిపిస్తున్నా వీళ్లిద్దరు ఎప్పుడూ ఓపెన్ కాకపోవడం కూడా అనుమానాలకు తావిచ్చింది. మరోవైపు గతంలో త్రిష ఎంగేజ్మెంట్ చేసుకొని.. పెళ్లి క్యాన్సిల్ చేసుకున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే త్రిష త్వరలోనే సినిమాలకు గుడ్‌బై చెప్పబోతున్నారనే టాక్ వినిపిస్తుంది. రాజకీయ నాయకులు కూడా విజయ్ కి - త్రిషకి మధ్య రిలేషన్ ఉంది అంటూ వార్తలు గుప్పిస్తున్నారు.
అయితే తమిళనాడులో ఎన్నికల గురించి ఈసీ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఏప్రిల్ 23వ తేదీన తమిళనాడు అసెంబ్లీకి ఎన్నికలు జరుగనుండగా.. ఒకేదశలో పోలింగ్ నిర్వహించనున్నారు. మే 4వ తేదీన ఓట్లను లెక్కింపు జరగనుంది. ఈ ఎన్నికల్లో గనుక విజయ్ దళపతి విజయం సాధిస్తే డబుల్ ధమాకా లభించినట్లే అనే కామెంట్లు వ్యక్తం అవుతున్నాయి. అందుకు గల కారణం సైతం నెట్టింట జోరుగా చర్చించుకుంటున్నారు.
ఒకే రోజు త్రిష బర్త్‌డే & ఎలక్షన్ రిజల్ట్స్..
ఎలక్షన్ రిజల్ట్ మే 4వ తేదీన వెలువడనుండగా అదే రోజు త్రిష పుట్టినరోజు కూడా కావడం గమనార్హం. ఒకవేళ విజయ్ తమిళనాడు ఎలక్షన్స్ లో తన టీవీకే పార్టీతో అధికారంలోకి వస్తే మాత్రం ఆయనకు డబుల్ ధమాకా అంటూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. ఒకవైపు త్రిష బర్త్ డే..మరోవైపు ఎలక్షన్ విన్నింగ్ .. రెండు మర్చిపోలేని అనుభూతులుగా మిగిలిపోతాయని కామెంట్స్ చేస్తున్నారు. చూడాలి మరి ఆరోజు ఏం జరగనుందో అని.












Click it and Unblock the Notifications