భర్త చనిపోయిన నెల రోజులకే అలాంటి పని చేసిన విజయ్ కాంత్ భార్య
తమిళ ప్రజల అభిమాన నటుడు విజయ్ కాంత్ మరణించి అప్పుడే నెల రోజులు దాటిపోయింది. విజయ్ కాంత్ కొంతకాలం తీవ్ర అనారోగ్యంతో బాధపడ్డరనే సంగతి అందరికి తెలిసిందే. ఆరోగ్యం విషమించడంతో గతడేది డిసెంబర్ 28వ తేదీన విజయ్ కాంత్ కన్నుమూశారు. విజయ్ కాంత్ మరణాన్ని ఆయన అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. అభిమాన నటుడు తమ మధ్యలో లేరనే నిజాన్ని వారు నమ్మలేకపోతున్నారు.
విజయ్ కాంత్‌కు జ్క్షాపకంగా తమిళనాడులో స్మారక స్థూపాన్ని ఏర్పాటు చేయడానికి ఆయన అభిమానులు భారీ ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నారు. స్మారక స్థూపం దగ్గర రోజు అన్నదానం చేయడానికి కూడా సన్నాహాలు చేస్తున్నారు. ఇదిలా ఉంటే భర్త విజయ్ కాంత్ మరణాన్ని ఆయన భార్య ప్రేమలత ఇప్పటికి తట్టుకోలేకపోతున్నారు. అయితే భర్త విజయ్ కాంత్‌కు గుర్తుగా ఆమె ఆయన బొమ్మను టాటూగా వేయించుకున్నారు.

ఈ టాటూను చూసినప్పుడల్లా విజయ్ కాంత్ గుర్తుకు రావాలనే దీన్ని వేయించుకున్నారామె. చనిపోయిన భర్త విషయంలో ప్రేమలత చూపిస్తున్న ప్రేమకు నెటిజన్లు ఫిదా అవుతున్నారు. ఇక విజయ్ కాంత్ స్థాపించిన దేశీయ ముర్పోక్కు ద్రవిడ కజగం రాజకీయ పార్టీని సైతం ప్రేమలత ముందుండి నడిపించడానికి సిద్ధం అవుతున్నారు.విజయ్ కాంత్ ఏ ఆశయాలతో పార్టీని మొదలుపెట్టారో ఆ ఆశయాల సాధనకు అందరం కలిసికట్టుగా పాటు పడదామని ప్రేమలత వెల్లడించారు.












Click it and Unblock the Notifications