రణవీర్, షారుక్ లను వెనక్కు నెట్టేసిన విరాట్ కోహ్లీ!!
భారతదేశంలో అత్యంత విలువైన సెలబ్రిటీల జాబితాలో వరుసగా ఏడవ సారి కూడా అగ్రస్థానంలో నిలిచాడు విరాట్ కోహ్లీ. క్రోల్ 2023లో సెలబ్రిటీల బ్రాండ్ వ్యాల్యూ ను రిపోర్ట్ ను విడుదల చేసిన విషయం తెలిసిందే. భారతదేశంలోని 25 అత్యంత శక్తివంతమైన సెలబ్రిటీ బ్రాండ్లను వారి బ్రాండ్ విలువ ఆధారంగా ర్యాంక్ చేసిన క్రోల్ 2023లో 25 మంది సెలబ్రిటీల మొత్తం బ్రాండ్ విలువ 1.9 బిలియన్ డాలర్లుగా అంచనా వేసింది.
బ్రాండ్ వాల్యూలో టాప్ 1 స్థానంలో క్రికెట్ దిగ్గజం
2022 తో పోలిస్తే 15.5% పెరుగుదల ఉన్నట్టుగా పేర్కొంది. బ్రాండ్ విలువ ఆధారంగా టాప్ 10 సెలెబ్రిటీల జాబితాను చూసినట్లయితే టాప్ వన్ స్థానంలో విరాట్ కోహ్లీ నిలిచాడు . దేశంలోనే టాప్ బ్రాండ్ ఇమేజ్ తో 227.9 మిలియన్ డాలర్ల బ్రాండ్ వేల్యూ తో మొదటి స్థానంలో నిలిచాడు విరాట్ కోహ్లీ .40 బ్రాండ్లను ఎండార్స్ చేసిన ఆయన వాల్యూ లో దేశంలోనే టాప్ వన్ గా నిలిచారు.

రణవీర్, షారూక్ ఖాన్ లు ఆ స్థానాల్లో
ఆ తర్వాత స్థానంలో బాలీవుడ్ సూపర్ స్టార్ రణవీర్ సింగ్ నిలిచారు. 23.1 మిలియన్ డాలర్ల బ్రాండ్ విలువతో రెండవ స్థానంలో ఉన్న రణవీర్ దాదాపు తన పోర్ట్ ఫోలియాలో 50 బ్రాండ్లను కలిగి ఉన్నారు. ఇక షారుక్ ఖాన్ 2020 తర్వాత మొదటిసారిగా 120.7 మిలియన్ల బ్రాండ్ విలువతో భారతదేశంలోని టాప్ ఫైవ్ సెలబ్రిటీ ఎండార్సర్స్ లలో టాప్ 3 స్థానాన్ని దక్కించుకున్నారు.
అలియా భట్, దీపికా పదుకొనే ఏ స్థానంలో ఉన్నారంటే
నాలుగవ స్థానంలో అక్షయ్ కుమార్ 111.7 మిలియన్ డాలర్ల బ్రాండ్ విలువతో ఉన్నారు. ఇక ఐదవ స్థానంలో 101.1 మిలియన్ డాలర్ల బ్రాండ్ విలువతో ఆలియా భట్ నిలిచారు దీపికా పదుకొనే 96 మిలియన్ డాలర్ల బ్రాండ్ విలువతో ఆరవ స్థానంలో ఉండగా, మాజీ క్రికెటర్ కెప్టెన్ ఎంఎస్ ధోని 95.8 మిలియన్ డాలర్ల బ్రాండ్ విలువతో ఏడవ స్థానంలో ఉన్నారు.
అమితాబ్, సల్మాన్ ఈ స్థానాల్లో
ఇక ఎనిమిదవ స్థానంలో క్రికెట్ దిగజం సచిన్ టెండూల్కర్ 91.3 మిలియన్ డాలర్ల బ్రాండ్ విలువతో ఉన్నారు. బాలీవుడ్ దిగ్గజం అమితాబ్ బచ్చన్ 83.6 మిలియన్ డాలర్ల బ్రాండ్ విలువతో 9వ స్థానంలోనూ, 81.7 మిలియన్ డాలర్ల బ్రాండ్ విలువతో సల్మాన్ ఖాన్ పదవ స్థానంలోనూ ఉన్నారు. మొత్తంగా 2023 అత్యంత విలువైన సెలబ్రిటీల జాబితాలో సినీ సెలబ్రిటీలను పక్కకి నటి క్రీడా సెలెబ్రెటీ విరాట్ కోహ్లీ మొదటి స్థానంలో నిలవడం విశేషం.












Click it and Unblock the Notifications