అంధ గాయకుడి స్వరానికి ఫిదా.. తంబూర మీటే చేతులకు బాలీవుడ్ బంపరాఫర్!

రైళ్లలో, పల్లెటూరి వీధుల్లో తంబూర మీటుతూ భజనలు పాడే ఓ అంధ గాయకుడు ఇప్పుడు బాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో తన గొంతుతో సంచలనం సృష్టిస్తున్నారు. మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని బుందేల్‌ఖండ్ ప్రాంతానికి చెందిన 25 ఏళ్ల సునీల్ లోధి.. ఇటీవల విడుదలై బాక్సాపీస్ వద్ద విజయం సాధించిన 'హనుమాన్ అంశ్' సినిమాలోని భక్తిగీతంతో దేశవ్యాప్తంగా గుర్తింపు పొందారు.

'రోమాంచకం' చూసిన మహేశ్ బాబు.. సినిమాపై సూపర్ స్టార్ రివ్యూ ఇదే!
'రోమాంచకం' చూసిన మహేశ్ బాబు.. సినిమాపై సూపర్ స్టార్ రివ్యూ ఇదే!

తంబూరతో ప్రారంభమైన చిన్ననాటి సంగీత ప్రయాణం
మధ్యప్రదేశ్‌లోని సాగర్ జిల్లా అగ్రా గ్రామానికి చెందిన సునీల్ లోధికి జన్మతః దృష్టి లోపం ఉంది. సుమారు 10 లేదా 11 ఏళ్ల వయస్సు నుంచే ఆయన తన కుటుంబ పోషణ కోసం స్థానిక రైళ్లలో, గ్రామాల్లో తంబూర పట్టుకుని బుందేలి జానపద గేయాలు, హనుమంతుని భజనలు పాడటం ప్రారంభించారు. ఆయనలోని అద్భుతమైన ప్రతిభను గుర్తించిన 'బుందేలి దునియా' అనే యూట్యూబ్ ఛానెల్, సోషల్ మీడియా వేదిక ఆయన పాటలను రికార్డు చేసి డిజిటల్ దునియాలోకి తీసుకొచ్చింది.

Visually Impaired Singer Suneel Lodhi Scores Bollywood Hit With Hanuman Ansh Song Full Details Here

2.9 కోట్ల వ్యూస్ తెచ్చిపెట్టిన వైరల్ భజన
సునీల్ పాడిన 'మోరే సంకట్ కే కటయ్యా' అనే హనుమాన్ భజన సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయి దాదాపు 2.9 కోట్ల వ్యూస్ సాధించింది. ఎటువంటి అత్యాధునిక వాయిద్యాలు లేకుండా కేవలం ఆయన స్వరం, తంబూర శబ్ధంతో సాగిన ఈ భజన సంగీత దర్శకుడు, ప్రొడ్యూసర్ పంకజ్ వీఆర్‌కే దృష్టిని ఆకర్షించింది. ఆయన ఎంతగానో శ్రమించి సునీల్ చిరునామాను కనుగొని, ముంబైలోని సాయిబాబా స్టూడియోలో రికార్డింగ్ కోసం అవకాశం కల్పించారు.

బాలీవుడ్ ఎంట్రీ.. 'హనుమాన్ అంశ్' హిట్!
ముంబైలో సునీల్ లోధి పాడిన భజనల్లో 'మైనే తేరే హీ భరోసే' అనే పాటకు విశేష స్పందన లభించింది. నీమ్ కరోలీ బాబా జీవిత కథ ఆధారంగా విశాల్ చతుర్వేది దర్శకత్వంలో తెరకెక్కిన 'హనుమాన్ అంశ్' సినిమాలో ఈ పాటను ప్రధాన భక్తిగీతంగా చేర్చారు. చిన్న బడ్జెట్‌తో రూపొంది బాక్సాఫీస్ వద్ద సర్‌ప్రైజ్ హిట్‌గా నిలిచిన ఈ సినిమాతో సునీల్ లోధి పేరు మారుమోగిపోతోంది.

Romanchakam Movie Review: 'రోమాంచకం' మూవీ రివ్యూ.. హిట్టా.. ఫట్టా?
Romanchakam Movie Review: 'రోమాంచకం' మూవీ రివ్యూ.. హిట్టా.. ఫట్టా?

రాజకీయ, సినీ ప్రముఖుల ప్రశంసలు
పాట పాడే సమయంలో అది ఓ సినిమాలో భాగమవుతుందని తనకు తెలియదని, హనుమంతునిపై ఉన్న భక్తితోనే పాడానని సునీల్ లోధి చెబుతున్నారు. ఆయన పడిన శ్రమ, ప్రతిభను చూసి తెలంగాణ బీజేపీ జనరల్ సెక్రటరీ చంద్రశేఖర్‌తో పాటు పలువురు రాజకీయ, సినీ ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా అభినందనలు కురిపించారు. లోకల్ ట్రైన్లతో భజనలు పాడే స్థాయి నుంచి బాలీవుడ్ ప్లేబ్యాక్ సింగర్‌గా ఎదిగిన సునీల్ లోధి కథ ప్రస్తుతం ఎందరికో ఆదర్శంగా నిలుస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+