చేసిన త్యాగాలు చాలు, వెనక్కు తగ్గేది లేదు - పవన్..!!

జనసేనాని పవన్ కీలక నిర్ణయాల దిశగా అడుగులు వేస్తున్నారు. పార్టీ బలోపేతం కోసం స్థానిక ఎన్నికలకు వ్యూహాలు సిద్దం చేయాలని నిర్దేశించారు. కూటమికి చెడ్డ పేరు రాకుండా.. పార్టీ కోసం పని చేసిన సైనికులకు గుర్తింపు దక్కేలా సీట్లు కేటాయించాలని సూచించారు. 100 శాతం స్ట్రయిక్‌ రేట్‌ విజయం సాధించేలా ప్రణాళికాబద్ధంగా ముందుకు వెళ్లాలని నిర్దేశించారు. ఎక్కడైనా కూటమి పార్టీలకు చెందిన నేతలతో ఫ్రెండ్లీ పోటీ ఉంటుందని భావించిన చోట పోటీ చేయచ్చని పవన్ స్పష్టం చేసారు.

స్థానిక ఎన్నికలపై జనసేన రాష్ట్రస్థాయి సన్నాహక సమావేశంలో పవన్ కీలక వ్యాఖ్యలు చేసారు. పార్టీకి బలమున్న ప్రతీ చోట పోటీ చేయాలని తేల్చి చెప్పారు. పొత్తుల లెక్కల్లో భాగంగా ఎక్కడైనా సీట్లు దక్కకుంటే స్నేహ పూర్వక పోటీకి దిగాలని సూచించారు. 2024 ఎన్నికల్లో రాష్ట్ర భవిష్యత్ కోసం సీట్లు త్యాగం చేసామని.. ఇప్పుడు పార్టీ బలోపేతం కోసం బలమున్న ప్రతీ చోటా పోటీ చేయా లని పవన్ సూచించారు. కాగా.. ఇదే సమయంలో పవన్ కీలక వ్యాఖ్యలు చేసినట్లు పార్టీ నేతల సమాచారం.

Janasena Chief Pawan Kalyan sensational decision over contesting in local body Elections clear directions for party

15 శాతం సీట్ల షేరింగ్ జనసేనకు ఉంటుందని ఎవరు చెప్పారని ప్రశ్నించారు. ఈ ఎన్నికల్లో కార్యకర్తలకు సీట్లు ఇచ్చి పార్టీని బలోపేతం చేసుకొందామని సూచించారు. సమన్వయ కమిటీలు సీట్ల ఖరారు పైన నిర్ణయం తీసుకోవాలని నిర్దేశించారు. అవసరమైతే తాను చంద్రబాబు తో మాట్లాడుతానని చెప్పారు. చేసిన త్యాగాలు చాలని.. సీట్లు తగ్గిస్తామంటే ఒప్పుకొనేది లేదని పవన్ వ్యాఖ్యానించినట్లు పార్టీ నేతల సమాచారం.

 కేబినెట్ భేటీ: కొత్త పెన్షన్ల కు ఆమోదం, ముందుగా వారికే - స్థానిక ఎన్నికల్లో ఇలా..!!
కేబినెట్ భేటీ: కొత్త పెన్షన్ల కు ఆమోదం, ముందుగా వారికే - స్థానిక ఎన్నికల్లో ఇలా..!!

పవన్ వ్యాఖ్యలతో కీలక మలుపు

అదే విధంగా ఒకే చోట రెండు పార్టీలు పోటీలో ఉన్నా స్నేహ పూర్వక పోటికి దిగాలని స్పష్టం చేసారు. ఇదే సమయంలో కూటమికి చెడ్డపేరు వచ్చే విధంగా వ్యవహరించవద్దని తేల్చి చెప్పారు. స్థానిక సంస్థల్లో.. ఏయే స్థానాల్లో పార్టీ బలంగా ఉంది?. ఎక్కడెక్కడ పోటీచేస్తే బాగుంటుందో అధ్యయనానికి నియమించిన కమిటీలతో నేతలు కలిసి ఉండి తగిన నిర్ణయం తీసుకోవాలని పవన్ సూచించారు. కష్టపడ్డ కార్యకర్తలకు పోటీ చేసే అవకాశం ఇవ్వాలన్నారు. కొంతమంది నేతలు తాను నియోజకవర్గాలకు వచ్చినప్పుడే హడావుడి చేస్తున్నారని, ఆ తర్వాత పార్టీని అసలు పట్టించుకోవడం లేదని మండిపడ్డారు.

Janasena Chief Pawan Kalyan sensational decision over contesting in local body Elections clear directions for party

అధికారంలోకి వచ్చిన తర్వాత చాలామంది నేతలు కార్యకర్తల కృషిని మర్చిపోయేలా వ్యవహరిస్తున్నారని, ఇది సరికాదని హెచ్చరించారు. కాగా.. ఈ సమావేశంలో మనోహర్ చేసిన వ్యాఖ్యలు.. స్పందన ప్రస్తావనకు వచ్చింది. దీని పైన వివరణ ఇచ్చిన మనోహర్ తన వ్యాఖ్యలను జనసేన శ్రేణులు మరో విధంగా అర్థం చేసుకున్నాయని, తన ఉద్దేశం అది కాదన్నారు. పార్టీ బలంగా ఉన్నచోట పోటీ చేయాలనేదే తన ఉద్దేశమని చెప్పారు. ఇక.. ఇప్పుడు పవన్ తీసుకున్న నిర్ణయం పైన రాజకీయంగా ఆసక్తి కర చర్చ సాగుతోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+