మందు బాబులకు షాక్- ఈ ప్రాంతాల్లో మద్యం అమ్మకాలు బంద్, తాజా ఆదేశాలు..!!

మందు బాబులకు బిగ్ అలర్ట్. రాష్ట్ర వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో మద్యం దుకాణాలను మూసి వస్తే ఆదేశాలు జారీ అయ్యాయి.హైదరాబాద్ సహా నిమజ్జన వేడుకలు పెద్ద ఎత్తున నిర్వహించే అన్ని ప్రాంతాల్లోనూ వైన్ షాప్స్ ను మూసివేస్తున్నారు. ప్రధానంగా హైదరాబాద్ పరిధిలో వినాయక నిమజ్జన సమయంలో మందు దుకాణాలతో పాటుగా బార్లు అన్నింటినీ మూసివేయాలని పోలీసు ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేసారు. కల్లు దుకాణాలకు ఈ ఆదేశాలు వర్తిస్తాయని స్పష్టం చేసారు.

తెలంగాణలో గణేశ్ నిమజ్జన శోభాయాత్రల నేపథ్యంలో పోలీసులు మద్యం విక్రయాలపై కఠిన ఆంక్షలు విధించారు. నిమజ్జన కార్యక్రమాలు ప్రశాంతంగా నిర్వహించడంతో పాటు ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా ముందస్తు చర్యల్లో భాగంగా వైన్‌షాపులు, బార్లు, కల్లు దుకాణాలను మూసివేయాలని స్పష్టం చేసారు. హైదరాబాద్ వ్యాప్తంగా అన్ని వైన్ షాపులు, బార్లు మరియు మద్యం దుకాణాలను మూసివేయాలని అధికారులు అధికారికంగా ఆదేశాలు జారీ చేశారు. ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం, శుక్రవారం (సెప్టెంబర్ 25) ఉదయం 6:00 గంటల నుంచి శనివారం (సెప్టెంబర్ 26) ఉదయం 6:00 గంటల వరకు ఈ నిబంధన కఠినంగా అమల్లో ఉంటుంది. నిమజ్జన శోభాయాత్ర సాగే ప్రధాన మార్గాలు మరియు సున్నితమైన ప్రాంతాల్లో శాంతిభద్రతలను కాపాడటమే లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు.

 ఉద్యోగుల నిరీక్షణకు తెర- డీఏల విడుదల, పీఆర్సీ ముహూర్తం: సీపీఎస్ పై కీలక నిర్ణయం..!!
ఉద్యోగుల నిరీక్షణకు తెర- డీఏల విడుదల, పీఆర్సీ ముహూర్తం: సీపీఎస్ పై కీలక నిర్ణయం..!!
police-have-ordered-wine-and-toddy-shops-and-bars-attached-to-restaurants-to-remain-closed-from-6-a

వినాయక నిమజ్జనం వేళ తాజా ఆదేశాలు

హైదరాబాద్ తో పాటుగా వరంగల్‌, కరీంనగర్‌, మెదక్‌, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి సహా పలు జిల్లాల్లో ఈ ఆంక్షలు అమల్లోకి రానున్నాయి. గణేశ్ నిమజ్జనం ప్రారంభమయ్యే బుధవారం ఉదయం 6 గంటల నుంచి గురువారం ఉదయం 6 గంటల వరకు మద్యం విక్రయాలు నిలిచిపోనున్నాయి. నిమజ్జన శోభాయాత్రల సమయంలో మద్యం సేవించి శాంతిభద్రతలకు విఘాతం కలిగించే వారిపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసినట్లు పోలీసులు తెలిపారు. అయితే, స్టార్‌ హోటళ్లలోని బార్లు, రిజిస్టర్డ్‌ క్లబ్బులకు ఈ ఆంక్షల నుంచి మినహాయింపు ఇచ్చారు. ప్రభుత్వ ఆదేశాలను ఉల్లంఘించి ఎవరైనా రహస్యంగా మద్యం విక్రయిస్తే వారిపై చట్టపరంగా అత్యంత కఠినమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+