మెరుగుపడుతున్న బంగారం రేట్లు: మార్పులు- మార్కెట్లకు కళ

అంతర్జాతీయ మార్కెట్ లో చోటుచేసుకుంటున్న తాజా రాజకీయ, ఆర్థిక పరిణామాల ప్రభావంతో నేడు దేశంలో పసిడి ధరలు స్వల్పంగా పెరిగాయి. ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశాల్లో భాగంగా అమెరికా- ఇరాన్ దేశాల మధ్య చర్చలు సానుకూలంగా సాగినట్లు వచ్చిన వార్తలు ఇటు బులియన్ మార్కెట్లు, అటు ముడిచమురు మార్కెట్లపై ప్రభావాన్ని చూపాయి. ఇన్వెస్టర్ల ఆందోళనలు సైతం తగ్గడంతో బంగారం పుంజుకొంటోన్నాయి. అదే సమయంలో వెండి రేట్లు కూడా ఫర్వాలేదనిపించే స్థాయిలో వృద్ధిని నమోదు చేశాయి.

మధ్యప్రాచ్యంలో నెలకొన్న భౌగోళిక ఉద్రిక్తతలను తగ్గించే విధంగా జరిగిన ఈ అంతర్జాతీయ చర్చలు సానుకూల వాతావరణంలో ముగిసినట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వెల్లడించారు. దేశీయ కమోడిటీ మార్కెట్లపై వీటి ప్రభావం స్పష్టంగా కనిపించింది.

Gold and silver Rates in India s retail market gain 23 September amid talks between the US and Iran

మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్ (MCX)లో ఈ ఉదయం ట్రేడింగ్ సెషన్‌లో పసిడి ధరలు సుమారు 0.13 శాతం మెరుగుపడ్డాయి. మంగళవారం నాటి క్లోజింగ్ సెషన్ తో పోల్చుకుంటే 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధరలో రూ. 870 పెరుగుదల రికార్డయింది. 22 క్యారెట్లల్లో రూ. 800, 18 క్యారెట్లల్లో రూ. 650 మేర పెరిగాయి. దీంతో ప్రతి 10 గ్రాముల బంగారం ధర రూ.1,53,420 వద్ద ట్రేడ్ అయింది. వెండి ఫ్యూచర్స్ దాదాపు 0.31 శాతం పుంజుకుని కిలోకు రూ.2,40,720 వద్ద స్థిరపడింది.

ఏపీ తీరానికి సమీపిస్తోన్న వాయుగుండం: ఈ జిల్లాల్లో వర్షాలు
ఏపీ తీరానికి సమీపిస్తోన్న వాయుగుండం: ఈ జిల్లాల్లో వర్షాలు

ముంబైలో 24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ.1,53,030, 22 క్యారెట్లకు రూ.1,40,278 కాగా వెండి కిలో రూ.2,40,210 వద్ద నిలిచింది. బెంగళూరులో 24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకురూ.1,53,260 22 క్యారెట్లకు రూ.1,40,488, వెండి రూ.2,40,480 వద్ద ట్రేడ్ అయ్యాయి. హైదరాబాద్ లో ఇవే రేట్లు రూ. 1,53,380, రూ.1,40,598, రూ.2,40,670లుగా నమోదయ్యాయి. చెన్నైలో 24 క్యారెట్లు రూ.1,53,590, 22 క్యారెట్లు రూ. 1,40,791 కాగా వెండి రూ. 2,40,990 వద్ద ట్రేడింగ్ అయ్యాయి.

పితృ పక్షాలు ఎప్పుడు: మహాలయ అమావాస్య తేదీ, ఈ కాలంలో చేయాల్సినవి
పితృ పక్షాలు ఎప్పుడు: మహాలయ అమావాస్య తేదీ, ఈ కాలంలో చేయాల్సినవి

వివిధ నగరాల్లో నేడు నమోదైన బంగారం రేట్లు ఒక గ్రాముకు ఇలా ఉన్నాయి.

చెన్నై..

24 క్యారెట్లు- రూ. 15,420, 22 క్యారెట్లు - రూ. 14,135, 18 క్యారెట్లు - రూ. 11,905

ముంబై..

24 క్యారెట్లు - రూ. 15,420, 22 క్యారెట్లు- రూ. 14,135, 18 క్యారెట్లు - రూ. 11,565

బెంగళూరు..

24 క్యారెట్లు - రూ. 15,420, 22 క్యారెట్లు- రూ. 14,135, 18 క్యారెట్లు - రూ. 11,565

హైదరాబాద్..

24 క్యారెట్లు - రూ. 15,420, 22 క్యారెట్లు- రూ. 14,135, 18 క్యారెట్లు - రూ. 11,565

విజయవాడ..

24 క్యారెట్లు - రూ. 15,420, 22 క్యారెట్లు- రూ. 14,135, 18 క్యారెట్లు - రూ. 11,565

విశాఖపట్నం..

24 క్యారెట్లు - రూ. 15,420, 22 క్యారెట్లు- రూ. 14,135, 18 క్యారెట్లు - రూ. 11,565

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+