‘పుష్ప’రాజ్‌కు జపాన్‌పై పట్టు రాలేదా?

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప2 సినిమాతో సంచలనం సృష్టించారు. అందులో ఎర్ర చందనం స్మగ్లర్ పుష్పరాజుగా పాత్రలోకి పరకాయ ప్రవేశం చేశారు. సుకుమార్ అల్లు అర్జున్ సినిమా జీవితాన్ని పూర్తిగా మలుపు తిప్పారు ఈ సినిమాతో. త్వరలోనే పుష్ప3 కూడా రాబోతోంది. జపాన్ లో కూడా మన సినిమాలకు అద్భుతమైన ఆదరణ లభిస్తోంది. దీంతో నిర్మాతలు పుష్ప2ను అక్కడి భాషలోకి అనువాదం చేసి విడుదల చేశారు. ఈ సినిమా ప్రమోషన్స్ కోసం బన్నీ జపాన్ వెళ్లినప్పుడు జపాన్ భాషలోనే మాట్లాడి, డైలాగులు చెప్పి అక్కడి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. ఆ దేశంలో పుష్ప కున్రిన్ పేరుతో విడుదల చేశారు.

అనుకున్న స్థాయిలో స్పందన కనపడలేదు
అయితే ఈ సినిమా విడుదలైన సందర్భంగా అక్కడి నుంచి వస్తున్న నివేదికల ప్రకారం అనుకున్న స్థాయిలో ప్రేక్షకుల నుంచి స్పందన రాలేదు. మన తెలుగు నుంచి వెళ్లిన చాలా సినిమాలకంటే తక్కువ స్థాయిలో కలెక్షన్లే వస్తున్నాయి. ఆర్ఆర్ఆర్ లాంటి సినిమాలను అక్కడి సినిమా ప్రియులు బాగా ఇష్టపడ్డారు. అదే స్థాయిలో పుష్ప కూడా ఆకట్టుకుంటుందని అందరూ అంచనా వేశారు. సినిమాను దేశవ్యాప్తంగా భారీస్థాయిలో 250 థియేటర్లలో విడుదల చేశారు. అయినా ఆశించినంత స్థాయిలో జనాలు థియేటర్లకు రాలేదు. ఇది కొంచెం సినిమా యూనిట్ కు, బన్నీ అభిమానులకు షాక్ అని చెప్పొచ్చు.

Why is the Pushpa movie not receiving a good response in Japan

జపాన్ ప్రేక్షకుల అభిరుచి వేరు
అయితే జపాన్ ప్రేక్షకుల అభిరుచి చాలా భిన్నంగా ఉంటుంది. వారికి లాంగ్ రన్, మౌత్ టాక్ ముఖ్యం. వాటినిబట్టే థియేటర్లకు తరలివస్తారు. మనలా మొదటి మూడు, నాలుగు రోజులు థియేటర్లకు పోటెత్తరు. ఆర్ఆర్ఆర్ సినిమా కూడా మొదట్లో చిన్నగా ప్రారంభమైంది. మౌత్ టాక్ ద్వారా అద్భుత విజయాన్ని అందుకుంది. ఈ వారం ముగిసేసరికి అక్కడి ప్రేక్షకులు పుష్పకు కనెక్ట్ అయితే చాలా మంచిది. మళ్లీ మంచి కలెక్షన్లు కొల్లగొట్టొచ్చు. ఆర్ఆర్ఆర్ కూడా చిన్నగా అందుకొని అక్కడ ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. ఒక తెలుగు కమర్షియల్ సినిమా జపాన్ మార్కెట్ లోకి అడుగుపెట్టడమే గ్రేట్ అంటున్నారు. అలాగే పుష్ప కూడా అందుకుంటుందా? లేదా? అనేది తెలియాలంటే కొద్దిరోజులు వేచిచూడాలి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+