కోరుకున్న కారు నెంబరు కోసం బాలయ్య పెట్టిన ఖర్చు ఎంతో తెలుసా..?

ఏపీ టీడీపీ ఎమ్మెల్యే , నటసింహం నందమూరి బాలకృష్ణ అంటేనే రికార్డులు. చరిత్ర రాయాలన్నా.. తిరగరాయాలన్నా బాలయ్యకే చెందుతుంది. అటు సినిమాలైనా, రాజకీయాలైనా, రియాల్టీ షోలైనా బాలయ్య మార్క్ కచ్చితంగా ఉంటుంది. ఏ రంగమైన తనదైన శైలిలో దూసుకెళ్తున్నారు బాలయ్య. తాజాగా తాను కోరుకున్న కారు నెంబర్ కోసం రికార్డు స్థాయిలో డబ్బు ఖర్చు పెట్టారు.

నందమూరి బాలకృష్ణ టీజీ09 ఎఫ్0001 ఫ్యాన్సీ నంబర్ కోసం రికార్డు ధరను బిడ్ చేశారు. తనకు కావాల్సిన '0001' నంబర్ కోసం ఏకంగా రూ.7.75 లక్షలు ఖర్చుచేసి అందరినీ ఆశ్చర్యపరిచారు. దీంతో ఫ్యాన్సీ నంబర్ల వేలంలో తెలంగాణ రవాణా శాఖకు ఒకే రోజున రూ.37.15 లక్షల మొత్తం లభించింది. అది కూడా ఖైరతాబాద్ జోన్ పరిధిలో కావటం విశేషం. ఇక టీజీ09 ఎఫ్ 0009 నంబరును కమలాలయ హైసాఫ్ట్ సంస్థ సొంతం చేసుకుంది. ఎఫ్ 0005 నంబరును జెట్టి ఇన్ ఫ్రా ప్రాజెక్ట్స్ రూ.1,49,999 ఖర్చు చేసింది.

బాలయ్య ఈ ఫ్యాన్సీ నెంబర్ కోసం ఏకంగా రూ.7.75 లక్షలు ఖర్చు చేసిన విషయం సామాజిక మాధ్యమాల్లో వైరల్ కావడంతో అభిమానులు రకరకాల కామెంట్స్ చేస్తున్నారు. మా బాలయ్య కోరుకున్నది దక్కేంత వరకూ ఎక్కడివరకైనా వెళ్తాడని బాలయ్య శైలిలో డైలాగ్స్ చెబుతున్నారు. అయితే.. గతంలో జూనియర్ ఎన్టీఆర్ TS09 FS 9999 నెంబర్ కోసం.. ఏకంగా రూ. 17 లక్షలు చెల్లించారట.

You Won t Believe How Much Balayya Paid for His Favorite Car Number

ఇక నందమూరి బాలకృష్ణ వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. ప్రస్తుతం ఆయన 'అఖండ 2 - తాండవం' సినిమా చేస్తున్నారు. ఈ మూవీని క్రేజీ డైరెక్టర్ బోయపాటి శ్రీను అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నారు. బ్లాక్ బస్టర్ గా నిలిచిన అఖండకు సీక్వెల్ గా ఈ సినిమాను రూపొందిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా సాగుతోంది. ఈ సినిమాలో బాలీవుడ్ హీరోయిన్ విద్యా బాలన్ ఓ కీలక పాత్రలో నటిస్తున్నట్లు సమాచారం. ఈ చిత్రానికి తమన్ మ్యూజిక్ ఇస్తున్నారు. మరోవైపు గోపిచంద్ మలినేని డైరెక్షన్ లోనూ బాలయ్య ఓ సినిమా చేయనున్నట్లు సమాచారం.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+